Breaking News

హైరింగ్‌ పండుగ!

Published on Tue, 08/18/2026 - 05:43

ముంబై: ఈ పండుగ సీజన్‌లో తాత్కాలిక సిబ్బంది రిక్రూట్‌మెంట్‌కి డిమాండ్‌ జోరుగా ఉండనుంది. ఈసారి వ్యాపార సంస్థలు దాదాపు 2.5–2.7 లక్షల పైచిలుకు నియామకాలు చేపట్టనున్నాయని అంచనా. ప్రధానంగా ఈ–కామర్స్, లాజిస్టిక్స్, క్విక్‌ కామర్స్, రిటైల్‌తో పాటు బీఎఫ్‌ఎస్‌ఐ (బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా) తదితర రంగాల సంస్థలు భారీగా రిక్రూట్‌మెంట్‌ చేపట్టనున్నాయి.

 టాలెంట్‌ కంపెనీ అడెకో ఇండియా విడుదల చేసిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం గతేడాది పండుగ సీజన్‌లో సుమారు 2.16 లక్షల తాత్కాలిక సిబ్బంది నియామకాలు జరగ్గా ఈ ఏడాది హైరింగ్‌ 15–20 శాతం మేర పెరగనుంది.

 ‘అంతర్జాతీయంగా వ్యాపార పరిస్థితులు అత్యంత సంక్లిష్టంగా ఉన్నప్పటికీ ఈసారి పండుగ సీజన్‌లో నియామకాలు చేపట్టడంపై వ్యాపార సంస్థలు ఆసక్తిగా ఉన్నాయి. దేశీయంగా వినియోగం పెరుగుతుండటమనేది రిటైల్, ఈ–కామర్స్, లాజిస్టిక్స్, వినియోగదారులను ప్రత్యక్షంగా కలవాల్సిన అవసరం ఉండే సంస్థల్లో నియామకాలకు డిమాండ్‌ నెలకొంది. 

భౌగోళిక, రాజకీయ పరిణామాలు, ఇంధన ధరలు పెను మార్పులకు లోనవుతుండటం, వ్యాపారపరంగా అంతర్జాతీయంగా మారుతున్న పరిస్థితులు, ఎగుమతుల ఆధారిత పరిశ్రమల్లో అనిశ్చితి కొనసాగుతుండటంలాంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని వ్యాపార సంస్థలు ప్రణాళికలు వేసుకుంటున్నాయి‘ అని అడెకో ఇండియా డైరెక్టర్‌ దీపేష్‌ గుప్తా తెలిపారు. 100కు పైగా క్లయింట్ల నుంచి సేకరించిన వివరాలతో పాటు మార్కెట్‌ అధ్యయన నివేదికల ఆధారంగా అడెకో ఇండియా ఈ నివేదికను రూపొందించింది.  

నివేదికలో మరిన్ని విశేషాలు.. 
→ ఈసారి నియామకాల డిమాండ్‌లో దాదాపు 45 శాతం వాటా లక్నో, జైపూర్, కోయంబత్తూర్‌లాంటి ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల నుంచి ఉండనుంది. ఆయా మార్కెట్లలో వినియోగం పెరుగుతుండటం, ఈ–కామర్స్‌ విస్తరిస్తుండటం, సంఘటిత రిటైల్‌ రంగం వృద్ధి చెందుతుండటం మొదలైన అంశాలు ఇందుకు కారణంగా నిలవనున్నాయి.  

→ ఇదే సమయంలో హైదరాబాద్, ముంబై, బెంగళూరు, ఢిల్లీ–ఎన్‌సీఆర్‌లాంటి ప్రథమ శ్రేణి నగరాల్లో సిబ్బంది కొరత అత్యధికంగా 30 శాతం మేర ఉంటోంది. సిబ్బంది వేగంగా మారిపోతుండటం, గిగ్‌ వర్క్‌ వైపు మొగ్గు చూపుతుండటం మొదలైన విషయాల వల్ల నియామకాలు చేపట్టడంలోనూ, ఉన్న ఉద్యోగులు వెళ్లిపోకుండా అట్టే పెట్టుకోవడంలోనూ సవాళ్లు ఎదురవుతున్నాయి.  

→ తాత్కాలిక సిబ్బంది వేతనాలు మెట్రో మార్కెట్లలో 12–15%, ద్వితీయ..తృతీయ శ్రేణి ప్రాంతాల్లో 8–10% మేర పెరగనున్నాయి.  

→ కొత్త కేటగిరీల్లో కాకుండా కీలకమైన కార్యకలాపాల నిర్వహణ విధులను నిర్వహించే సిబ్బందికి డిమాండ్‌ ఎక్కువగా ఉండనుంది. ఇన్‌–స్టోర్, బీఎఫ్‌ఎస్‌ఐ ఆధారిత హైరింగ్‌ విషయంలో రిటైల్‌ సేల్స్‌ అసోసియేట్స్, కస్టమర్‌ సపోర్ట్‌ రిప్రజెంటేటివ్స్, ఫీల్డ్‌ సేల్స్‌ ఎగ్జిక్యూటివ్స్‌ మొదలైన కొలువులు కీలకంగా ఉంటున్నాయి. అత్యంత వేగంగా ఆర్డర్లను డెలివరీ చేయడం, కస్టమర్లకు మరింత మెరుగైన అనుభూతిని కలి్పంచడంపై కంపెనీలు ప్రధానంగా దృష్టి పెడుతుండటం ఇందుకు కారణం. 

→ ఒకే భాషకు పరిమితం కాకుండా పలు భాషలు వచి్చన వారిని తీసుకోవడానికి కంపెనీలు ప్రాధాన్యతనిస్తున్నాయి. తెలుగు, కన్నడ, తమిళం, మరాఠీ, హిందీ, ఇంగ్లిష్‌ తదితర భాషల్లో అనర్గళంగా మాట్లాడగలిగి, డిజిటల్‌ పరిజ్ఞానం కలిగి ఉండి, కస్టమర్లతో సంభాíÙంచగలిగి, కార్యకలాపాల నిర్వహణ సామర్థ్యాలు కలిగి ఉన్న వారికి పెద్దపీట వేస్తున్నాయి. పరిస్థితులకు అనుగుణంగా తమను తాము మల్చుకోగలగడం, పటిష్టమైన కమ్యూనికేషన్‌ నైపుణ్యాలుండటం రిటైల్, లాజిస్టిక్స్, బీఎఫ్‌ఎస్‌ఐ, ఈ–కామర్స్‌లో కొలువులను దక్కించుకునేందుకు అదనపు అర్హతలుగా ఉంటున్నాయి.  

→ సీజనల్‌గా తీసుకునే వారిలో దాదాపు 25% మంది క్రమంగా దీర్ఘకాలిక ఉద్యోగ విధుల్లోకి మారుతున్నారు. దీన్ని బట్టి చూస్తే దేశీయంగా సంఘటిత రంగ ఉద్యోగాలను దక్కించుకోవాలంటే పండుగ సీజన్‌ నియామకాలు 
ఎంట్రీ పాయింట్‌గా ఉంటున్నాయి.  

→ నియామకాల అవకాశాలు భారీగానే కనిపిస్తున్నప్పటికీ, ప్రతిభావంతుల లభ్యత పెను సవాలుగా ఉంటోంది. పండుగ సీజన్‌లో ఫ్రంట్‌లైన్, కార్యకలాపాల నిర్వహణ కొలువులకు సంబంధించి దాదాపు 80 శాతం సంస్థలకు సరైన అభ్యర్ధులు దొరకడం లేదు. కీలకమైన ప్రస్తుత తరుణంలో డిమాండ్‌–సరఫరా మధ్య 10–15% మేర వ్యత్యాసం ఉండవచ్చని అడెకో అంచనా వేస్తోంది. 

Videos

దారి తప్పిన మమ్ముట్టి చివరికి ఏమైందంటే..?

మహిళతో TDP నేత సంచలన ఆడియో లీక్

రేవంత్ సర్కార్ నిర్ణయంపై ఆటో డ్రైవర్ల రియాక్షన్

సీఎం విజయ్ ని చూసి నేర్చుకోండి.. చంద్రబాబు.. పవన్ కు చురకలు

కాంగ్రెస్ పార్టీకి రాజగోపాల్ రెడ్డి దూరం..?

పోలీసుల వాహనంలో గంజాయి, మద్యం దొరకడంపై YS జగన్ ఫైర్

చింతాడ రవికుమార్ కు బెయిల్

బీజేపీ కొత్త టీమ్ ఇదే..! DK అరుణ, లక్ష్మణకు బిగ్ షాక్

PV సింధుని 384 మంది ఫేక్ వాళ్లతో పోల్చటం సిగ్గుచేటు

తొక్కిసలాటకు ముందు ఉజ్జయిని మహంకాళి ఆలయం డ్రోన్ విజువల్స్

Photos

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న క్రికెటర్ తిలక్ వర్మ (ఫొటోలు)

+5

18 ఏళ్లు పూర్తి చేసుకున్న కోహ్లి (ఫొటోలు)

+5

న్యూయార్క్‌ : 'ఇండియా డే పరేడ్ 2026'లో పూజా హెగ్డే సందడి (ఫొటోలు)

+5

కందుకూరులో వైభవంగా తేళ్ల పంచమి... పోటెత్తిన భక్తజనం (ఫొటోలు)

+5

హైదరాబాద్ : కన్నుల పండువగా ఇస్కాన్‌ దేవాలయ స్వర్ణోత్సవాలు (ఫొటోలు)

+5

ఫ్యామిలీతో ప్రియాంక చోప్రా సందడి (ఫొటోలు)

+5

చిరునవ్వులు చిందిస్తూ శ్రియా సోయగాలు (ఫొటోలు)

+5

వయ్యారాలు ఒలకబోస్తున్న రకుల్‌ (ఫొటోలు)

+5

‘ఇరుముడి’ మూవీ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

బండ్ల గణేశ్‌ కూతురు పెళ్లిలో టాలీవుడ్ తారల సందడి (ఫోటోలు)