దేశంలోనే అత్యంత ఖరీదైన పెంట్‌హౌస్‌ కొనుగోలు

Published on Tue, 08/11/2026 - 14:17

భారతీయ రియల్ ఎస్టేట్ రంగ చరిత్రలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. ఢిల్లీ-ఎన్‌సీఆర్ పరిధిలోని గురుగ్రామ్ గోల్ఫ్ కోర్స్ రోడ్డులో ఉన్న డీఎల్ఎఫ్ లగ్జరీ ప్రాజెక్ట్ ‘ది దాలియాస్’లోని ఒక సూపర్ లగ్జరీ పెంట్‌హౌస్‌ ఏకంగా రూ.271 కోట్లకు అమ్ముడై దేశవ్యాప్తంగా వ్యాపార వర్గాలను ఆశ్చర్యపరిచింది. ప్రముఖ ఆటోమోటివ్ విడిభాగాల తయారీ సంస్థ ‘ఇంపీరియల్ ఆటో’ గ్రూప్‌నకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త మానవ్ సర్దానా ఈ డీల్‌ను దక్కించుకున్నారు.

దేశంలోనే అత్యధిక ధర

ఈ ప్రాపర్టీ ధరల వివరాలు రియల్టీ విశ్లేషకులను విస్మయానికి గురిచేస్తున్నాయి. ఈ పెంట్‌‌హౌస్ సూపర్ ఏరియా 17,200 చదరపు అడుగులు కాగా కార్పెట్ ఏరియా 10,500 చదరపు అడుగులు. సూపర్ ఏరియా ప్రాతిపదికన చదరపు అడుగుకు రూ.1.58 లక్షలు పడగా, కార్పెట్ ఏరియా లెక్కన చదరపు అడుగుకు ఏకంగా రూ.2.6 లక్షలు వ్యయమైంది. సాధారణంగా ముంబైలోని వర్లీ, మలబార్ హిల్స్ వంటి ప్రాంతాల్లో మాత్రమే ఇటువంటి భారీ ధరలు కనిపిస్తాయి. అయితే గురుగ్రామ్‌లో ఒక్క సింగిల్ రెసిడెన్షియల్ యూనిట్ రూ.271 కోట్లకు అమ్ముడవడం భారతదేశపు అత్యంత ఖరీదైన హౌసింగ్ డీల్స్‌లో ఒకటిగా నిలిచింది.

ఎవరీ మానవ్ సర్దానా?

1969లో ఫరీదాబాద్‌లో ఎస్.బి. సర్దానా, జగ్‌జీత్ సింగ్‌లు ప్రారంభించిన ఇంపీరియల్ ఆటో ఇండస్ట్రీస్ ప్రపంచస్థాయి సంస్థగా ఎదిగింది. ఫ్లూయిడ్ ట్రాన్స్‌మిషన్ ప్రొడక్ట్స్ (పైప్‌లైన్లు, హోస్ అసెంబ్లీలు) తయారీలో అగ్రగామిగా ఉన్న ఈ సంస్థకు భారత్‌లో 20కి పైగా, విదేశాల్లో 3 ఉత్పాదన కేంద్రాలు ఉన్నాయి. గ్లోబల్ ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజం 'వార్‌బర్గ్ పింకస్' ఈ సంస్థను కొనుగోలు చేసుకున్నప్పటికీ సర్దానా కుటుంబం ఇంపీరియల్ ఆటో గ్రూప్‌లో క్రియాశీలకంగా కొనసాగుతోంది.

ఇదీ చదవండి: ఆకాశమే హద్దుగా పసిడి ధరలు.. ఒక్కరోజే ఇంతలా..

Videos

భారతి సిమెంట్స్ కేసులో కూటమి ప్రభుత్వానికి గట్టి షాకిచ్చిన హైకోర్టు

చిరు NEXT మూవీ టైటిల్ లీక్.. వద్దు వద్దు అంటున్న ఆపుకోలేక నోరు జారిన చిరంజీవి

ఆ సీఐ చుట్టూ కూటమి రాజకీయం..!

LB నగర్ పీఎస్ లో కానిస్టేబుల్ ఆత్మహత్య

కేకును కోస్తే అరెస్ట్ చేసి నడి రోడ్డుపై నడిపించారు.. మెడికల్ విద్యార్థిని ప్రియాంకను చంపేస్తే మాత్రం వారిని

నేడు MLA, MLCలతో వైఎస్ జగన్ కీలక సమావేశం

నా కాలు విరిగినా.. నా ప్రాణం పోతాదన్నా జగనన్న కోసం ఎలాంటి కష్టానైనా...

EVM ట్యాపరింగ్ జరిగిందో లేదో చంద్రబాబే చెప్పాలి..! ఉండవల్లి అరుణ్ కుమార్ షాకింగ్ కామెంట్స్

రాజమండ్రి పోలీసులు అందరూ ఎలాంటివారంటే..! డాక్టర్ ప్రియాంక ఘటనపై అడ్వకేట్ బాల కామెంట్స్

నా భర్తను అక్రమంగా అరెస్ట్ చేసి... సీదిరి అప్పలరాజు భార్య సంచలన వ్యాఖ్యలు

Photos

+5

హైదరాబాద్‌లో మొదలైన వినాయక చవితి 2026 సందడి (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ మూవీ టీజర్ రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

‘విశ్వనాథ్ & సన్స్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌...(ఫొటోలు)

+5

‘కొరియన్ కనకరాజు’ సక్సెస్ సెలబ్రేషన్స్‌...ముఖ్య అతిథిగా చిరంజీవి (ఫొటోలు)

+5

హాఫ్ శారీలో చిన్న పిల్లలా హీరోయిన్ నభా నటేశ (ఫొటోలు)

+5

ఫైరింగ్ కియారా.. అందం ఏ మాత్రం తగ్గలే (ఫొటోలు)

+5

ఐశ్వర్య రాజేశ్ ఇంతలా మారిపోయిందేంటి? (ఫొటోలు)

+5

యంగ్ హీరోతో నయన్ లవ్ పోజులు (ఫొటోలు)

+5

‘అగధ’ మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్ (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం క్యూట్ ఫ్యామిలీ.. వెకేషన్ (ఫొటోలు)