Breaking News

భారత్‌లో.. లక్షలమంది కొంటున్న కారు ఇదే!

Published on Sat, 08/08/2026 - 16:12

భారతదేశంలో ప్రస్తుతం ఎస్‌యూవీలకు మంచి డిమాండ్ ఉంది. అయినప్పటికీ.. మారుతి సుజుకి డిజైర్ (సెడాన్) మాత్రం అమ్మకాలలో దూసుకుపోతోంది. FY27లో ఏప్రిల్ నుంచి జూలై వరకు డిజైర్ 89,816 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. అంతకుముందు FY26లో 2,29,130 యూనిట్ల అమ్మకాలతో దేశంలో అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలిచింది. సెడాన్ కార్ల మార్కెట్ వాటా భారీగా పడిపోయినప్పటికీ డిజైర్ అమ్మకాలు గణనీయంగా ఉండటం విశేషం.

డిజైర్‌కు ఇంత ఆదరణ రావడానికి ప్రధాన కారణాలు.. మంచి మైలేజ్, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చు, విశాలమైన క్యాబిన్, మంచి రీసేల్ వాల్యూ. మారుతి సుజుకి బ్రాండ్‌పై ప్రజలకు ఉన్న నమ్మకం, దేశవ్యాప్తంగా ఉన్న పెద్ద సర్వీస్ నెట్‌వర్క్ కూడా దీనికి కలిసొస్తున్నాయి. అందుకే చాలా కుటుంబాలు డిజైర్ ఒక మంచి ఎంపికగా భావిస్తారు.

భద్రత విషయంలో.. కూడా కొత్త డిజైర్ మంచి ఫలితాలు సాధించింది. భారత్ ఎన్సీఏపీ క్రాష్ టెస్టులో అడల్ట్, చైల్డ్ ప్రొటక్షన్ రెండింటిలోనూ 5 స్టార్ రేటింగ్ సాధించింది. ఈ కారులో 6 ఎయిర్ బ్యాగులు ఉన్నాయి. కాగా ఇది 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్, సీఎన్జీ ఎంపికలలో కూడా లభిస్తుంది. పెట్రోల్ వెర్షన్ 24.79 కిమీ/లీ మైలేజ్, సీఎన్జీ మోడల్ 33.73 కిమీ/కేజీ మైలేజ్ అందిస్తుందని కంపెనీ చెబుతోంది. డిజైర్ ధరలు సుమారు రూ.6.26 లక్షల నుంచి రూ.9.36 లక్షల (ఎక్స్ షోరూమ్) వరకు ఉంటుంది

Videos

ఆ కోపంతోనే కారుతో ప్రియాంకను ఢీకొట్టారు

నువ్వు బిరియాని కనిపెడితే ఇరానీలు ఏం చేసినట్లు? బాబుపై బుగ్గన సెటైర్లే సెటైర్లు

DSCలో అంధుడిని మోసం చేసిన లోకేష్

షూస్ వేసుకొని వెంకన్న విగ్రహం తీసుకున్న కేంద్ర మంత్రి పెమ్మసాని

దిశా చట్టాన్ని పేరు మార్చి అయినా చట్టాన్ని అమలు చెయ్.. అనితకు వరుదు కళ్యాణి సూచన

రఫేల్ ది గేమ్ చేంజర్

నీ కంటే అడుక్కున్నవాడు నయం..! బాబు,లోకేష్ ని ఏకిపారేసిన లక్ష్మీ పార్వతి

అన్యాయం జరిగిన వారికి ఉద్యోగాలు ఇవ్వాల్సిందే

లోన్ తీసుకున్నారా? ఇక EMI వేధింపులు ఉండవు

కండిషన్ క్రిటికల్ చివరి ప్రయత్నాలు

Photos

+5

ప్రెగ్నెన్సీతో సమంత.. ఆగస్టు ఎనర్జీతో ఇలా (ఫొటోలు)

+5

వేశ్య పాత్రలో అదరగొట్టిన వామికా గబ్బి.. ఈ బ్యూటీ బ్యాగ్‌గ్రౌండ్‌ తెలుసా? (ఫొటోలు)

+5

సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ HD స్టిల్స్

+5

హైదరాబాద్ : అమ్మవారికి బంగారు బోనం సమర్పించిన కొణిదెల నిహారిక .. ఫొటోలు వైరల్

+5

హైదరాబాద్ లో సందడి చేసిన ‘కాంతారా’ ఫేమ్‌ రుక్మిణి వసంత్‌ (ఫొటోలు)

+5

‘కొరియన్‌ కనకరాజు’ సినిమా సక్సెస్‌ సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

విజయ్ విడాకుల కేసులో ట్విస్ట్.. ట్రెండింగ్‌లో ఫ్యామిలీ ఫోటోలు

+5

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్‌లో బోనాల పండుగ (ఫొటోలు)

+5

ఒంగోలు : భక్తితో వేల్ కావడి ఉత్సవం (ఫొటోలు)

+5

'కనకరాజు'తో హ్యాట్రిక్ కొట్టిన రితికా నాయక్ (ఫొటోలు)