Breaking News

చదివించాలంటే తలప్రాణం తోకకి వస్తుందా? అయితే ఇలా చేయండి!

Published on Sat, 08/01/2026 - 08:23

మొన్న మొన్నటి వరకు వేసవి సెలవలు. దాదాపు రెండు నెలలపాటు ఇంట్లో హాయిగా గడిపిన పిల్లలను మళ్లీ బడికి పంపించడం, ఆ తర్వాత వాళ్లని చదివించడం చాలా పెద్ద బాధ్యత. అసలు వాళ్ల చేత రోజూ హోమ్‌ వర్క్‌ చేయించడమే కష్టం. అలాంటిది ఎప్పుడో రాబోయే పరీక్షలకు ఇప్పటినుంచే చదివించాలంటే తలప్రాణం తోకకి వస్తుంది. ఒక్కోసారి బుద్ధిగానే చదువుకుంటారు కానీ చాలాసార్లు బద్ధకిస్తారు. చదవనని మొరాయిస్తారు. ఇలాంటి సందర్భాలు ఇంచుమించు అందరు తల్లిదండ్రులకూ ఎదురయ్యే సమస్యే. అయితే కొన్ని చిట్కాలు పాటిస్తే వాళ్లలో చదువుపై ధ్యాస పెరగడంతో పాటు హోమ్‌వర్క్‌ కూడా చకచకా చేసేస్తారు. ఇంతకూ  ఆ చిట్కాలు ఏమిటంటారా? చదివెయ్యండి మరి!

ఒత్తిడి పెట్టద్దు
స్కూల్‌ నుంచి రాగానే వారిచేత మొహం కాళ్లూ చేతులూ కడిగించి, తినడానికి ఏమైనా పెట్టి, ఆ తర్వాత హోమ్‌వర్క్‌ చేయించడం అంటే చెప్పుకున్నంత సులువేం కాదు. వాళ్ల పద్ధతిలోకి మనమే వెళ్లి నేర్పించాల్సి ఉంటుంది. గట్టిగా అరిచినా, కోప్పడినా వాళ్లు పుస్తకం పట్టకుండా మొండికి తిరుగుతారు. ముఖ్యంగా చదివే విషయంలో పూర్తిగా వాళ్లకి స్వేచ్ఛను ఇవ్వాలి. ఏ టైమ్‌లో చదవాలని అనుకుంటున్నారో అప్పుడే వాళ్లని చదివించాలి.

అంటే.. మరీ అర్ధరాత్రి వరకూ కాకుండా వాళ్లు చెప్పిన టైమ్‌ని బట్టి కాస్త అటూ ఇటూగా మనమే వారికి అడ్జస్ట్‌ అయి వాళ్లకి అర్థమయ్యే విధంగా ఓర్పుగా నేర్పుగా హోమ్‌వర్క్‌ చేయించాలి.  నేర్పించాలి. స్నాక్స్‌ తిని హోమ్‌వర్క్‌ చేస్తారా? లేదంటే తరవాత చేస్తారా అనే ఛాయిస్‌ వాళ్లకే వదిలెయ్యాలి.  వాళ్లు చెప్పినదానిని బట్టి నిర్ణయం తీసుకోవాలి. అంతే కాని బలవంతంగా వాళ్లపై ఏమీ రుద్దకూడదు.

ఆడుతూ పాడుతూనే...
చదివించడం అంటే సీరియస్‌గా కూర్చోబెట్టి అన్నీ చె΄్పాలి అని కాదు. కాస్త ఆటగోలుగానే ఉండాలి. అంటే.. కష్టమైన టాపిక్స్‌ ని గేమ్స్‌ లా మార్చి వాళ్లకి అర్థమయ్యే విధంగా నేర్పించాలి. పజిల్స్‌ సాల్వ్‌ చేయించడం, మైండ్‌ గేమ్స్‌ ఆడించడం లాంటివి చేయాలి. వీటి వల్ల పిల్లల్లో నేర్చుకునే గుణం పెరుగుతుంది. నేర్చుకోవడాన్ని వాళ్లు ఎంజాయ్‌ చేస్తారు. మొదట 20 నిముషాల పాటు చదివేలా ఓ ఛాలెంజ్‌ పెట్టాలి. ఈ 20 నిముషాల పాటు సరైన విధంగా చేస్తే ఓ లెవెల్‌ సాధించినట్టుగా.. అంటే గేమ్‌ లో ఎలాగైతే లెవెల్‌ సాధిస్తే రివార్డ్స్‌ వస్తాయో అలా వాళ్లను ప్రోత్సహించాలి. దీని వల్ల పిల్లలు స్క్రీన్‌ టైమ్‌ తగ్గించి కొత్తవి నేర్చుకునేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు

ప్రశంస అనే టానిక్‌ ఇవ్వాలి
పిల్లలు నేర్చుకున్నది చిన్న విషయమైనా సరే ప్రశంసించాలి. వాళ్ల మైండ్‌ సెట్‌ కి ఆధారంగానే నేర్పించడం మొదలు పెట్టాలి. అదనపు భారం వాళ్లపైన వేయకూడదు. అలా అయితేనే వాళ్ల మెదడు చురుగ్గా పని చేస్తుంది. ఏం నేర్చుకున్నా సరే.. స్మార్ట్‌ అంటూ పిల్లల్ని పొగడాలి. ఇలా చేయడం వల్ల వాళ్లలో పాజిటివిటీ పెరుగుతుంది. ఏమైనా చేయవచ్చు అనే కాన్ఫిడెన్స్‌ పెరుగుతుంది. క్రమంగా ఇంటిలిజెన్స్‌ పెరుగుతుంది. కష్టపడి హోమ్‌ వర్క్‌ పూర్తి చేస్తే ఆ కష్టాన్ని ప్రశంసించండి. దీని వల్ల వాళ్లలో కాన్ఫిడెన్స్‌ పెరుగుతుంది.

ఆసక్తి పెరిగేలా చేయాలి
పిల్లల్లో ఆసక్తి పెంచడం అనేది తల్లిదండ్రులు చేయాల్సిన మొదటి పని. వాళ్ల బ్రెయిన్‌ ఎప్పుడూ యాక్టివ్‌ గా ఉండాలంటే మొట్టమొదట వాళ్లలో క్యూరియాసిటీ పెంచాలి. పుస్తకాలు తెరిచే ముందే ఆ క్యూరియాసిటీ పెరగాలి. పుస్తకం తెరిచే ముందు కొన్ని ఇంట్రెస్టింగ్‌ క్వశ్చన్స్‌ అడగండి. అవి సబ్జెక్ట్‌ తో సంబంధం ఉన్నవే అవ్వాల్సిన అవసరం లేదు. వేరేవి అయినా సరే జస్ట్‌ వాళ్లలో ఆసక్తి పెంచే ప్రశ్నలు అడిగితే సరి΄ోతుంది. దీని వల్ల కొత్తవి నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్‌ వాళ్లలో పెరుగుతుంది.

ఇలా సెట్‌ చేస్తే సరి!
పిల్లల్ని చదివించడం అంటే పిల్లల కన్నా ముందు తల్లిదండ్రులు ప్రిపేర్‌ అవ్వాలి. అయితే వాళ్లను చదివించే వాతావరణం బాగుండాలి. రోజూ ఓ టేబుల్‌ పైన కూర్చోబెట్టి వాళ్లకి నచ్చిన బొమ్మలు, లేదా వస్తువులు అక్కడ ఉంచాలి. రోజూ ఒకే సమయంలో చదివించే ందుకు ప్రయత్నించాలి. దానివల్ల ఆ టైమ్‌ కి వాళ్లు అలవాటుపడి΄ోతారు. వాళ్లకి నచ్చిన ఫుడ్‌ లేదా డ్రింక్‌ ఇవ్వాలి. ఆ తరవాత వాళ్లను చదివించేందుకు సిద్ధం చేయాలి. ఇలా చేస్తే వాళ్లు మానసికంగా సిద్ధంగా ఉంటారు.

మోటివేషన్‌ ముఖ్యం
చిన్న చిన్న లక్ష్యాలు సాధించినా సరే వాళ్లని ప్రోత్సహించండి. ఇలా మోటివేట్‌ చేయడం వల్ల పిల్లల్లో పాజిటివ్‌ థాట్స్‌ పెరుగుతాయి. అదే సమయంలో ఎలాంటి సవాళ్లను అయినా ఎదుర్కొనేందుకు ధైర్యం వస్తుంది. వాళ్లలో క్రమంగా ఒత్తిడి కూడా తగ్గుతుంది. ఏదైనా ఛాప్టర్‌ కంప్లీట్‌ చేసినప్పుడు అక్కడ కలర్స్‌తో మార్క్‌ చేయండి. ఇలా చేయడం వల్ల వాళ్లలో ఫోకస్‌ పెరుగుతుంది. ఆ స్టికర్స్‌ చూసినప్పుడు టాపిక్స్‌ కూడా రివైజ్‌ చేసినట్టుగా అవుతుంది. పైగా అది వాళ్లు చేరుకున్న గోల్స్‌కి గుర్తుగా కూడా ఉంటుంది.

Videos

కామన్వెల్త్ లో భారత్ పతకాల పంట.. 13 స్వర్ణాలతో 4వ స్థానం..

మూవీ చూసి బాబాయ్ ఏం చెప్పాడంటే..

విరుపాక్షిని హత్య చేసే కుట్ర..! లోకేష్ ని వదిలిపెట్టం..

ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్ పై బుట్టా రేణుక స్ట్రాంగ్ రియాక్షన్

పెమ్మసాని పై అంబటి అదిరిపోయే సాంగ్

బాబుకు షాక్.. TDPపై జనసేన ఘన విజయం

మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించిన సీఎం రేవంత్

జూరాల వద్ద పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ

ఇరాన్ యుద్ధం పై ట్రంప్ కీలక నిర్ణయం..

విశాఖ యారాడ బీచ్ లో విషాదం..! అలల ఉధృతికి ఇద్దరు గల్లంతు

Photos

+5

Ujjaini Mahankali Bonalu : ఘనంగా సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహంకాళి బోనాలు (ఫోటోలు)

+5

ఫ్రెండ్‌షిప్ డే స్పెషల్.. దోస్తులతో మంచు లక్ష్మీ (ఫొటోలు)

+5

కాశీ పరమేశ్వరుడి సేవలో ధనశ్రీ వర్మ (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఆగస్టు 02- 09)

+5

శ్రీవారి సేవలో యాంకర్ లాస్య-మంజునాథ్ జంట(ఫోటోలు)

+5

బ్లాక్‌ డ్రెస్‌లో దివ్య పిళ్లై స్టన్నింగ్‌ లుక్స్‌ (ఫోటోలు)

+5

చీరలో సంయుక్త.. ఎంత అందంగా ఉందో(ఫోటోలు)

+5

బ్లాక్ శారీలో మెరిసిన కాయదు లోహర్.. ఫోటోలు

+5

లండన్ ట్రిప్‌లో వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

మిల మిల మెరిసిన 'చెన్నై లవ్ స్టోరీ' తార (ఫొటోలు)