BIG Question: ఉప్పొంగిన ఉత్తరాంధ్ర.. జనసంద్రం పోటెత్తితే ఎలా ఉంటుందో తెలుసా?
Breaking News
గూగుల్ సమర్పించు...డిజిటల్ వెల్బీయింగ్ గైడ్‌బుక్
Published on Thu, 07/30/2026 - 06:27
హెల్త్ స్క్రీన్ టైమ్ అంటే ఏమిటి?
ఆ టైమ్‌ను ఎలా సెట్ చేసుకోవాలి?
నిన్నటి వరకు డిజిటల్ పరికరాలను విరివిగా వాడిన పిల్లలతో...
‘రోజూ ఇంత సమయం మాత్రమే వాడాలి’ అని చెబితే
ఎదురయ్యే సమస్యలు, సవాళ్లు ఏమిటి?... ఇవి మాత్రమే కాదు...
హెల్తీ స్క్రీన్ హ్యాబిట్స్, ఆన్లైన్ సేఫ్టీ, రెస్పాన్సిబుల్ టెక్నాలజీ...
మొదలైన వాటి గురించి నిపుణుల సలహాలు, సూచనలతో గూగుల్ ఇండియా,
యూట్యూబ్ సవివరమైన ‘డిజిటల్ వెల్బీయింగ్ గైడ్‌బుక్’ను విడుదల చేశాయి...
భారతీయ కుటుంబాలను దృష్టిలో పెట్టుకొని గూగుల్ ఇండియా, యూట్యూబ్ ‘డిజటల్ వెల్బీయింగ్ గైడ్‌బుక్’ను లాంచ్ చేశాయి. పేరెంటింగ్ అడ్వకేట్స్, సెలబ్రిటీ పేరెంట్స్... మొదలైన వారి నుంచి ఇన్పుట్స్ తీసుకొని ఈ గైడ్‌ను రూపొందించారు. మన దేశంలోని ప్రత్యేకమైన డిజిటల్ వాతావరణానికి అనుగుణంగా రూపొందించిన ఈ గైడ్‌బుక్, ఆరోగ్యకరమైన టెక్నాలజీ అలవాట్లను కుటుంబాలు పెంపొందించుకోవడంలో సహాయపడడానికి ఆచరణాత్మకమైన, పరిశోధన ఆధారిత సలహాలు అందిస్తుంది.
సురక్షితమైన.. బాధ్యతాయుతమైన...
కేవలం స్క్రీన్ సమయాన్ని పరిమితం చేయడంపై మాత్రమే దృష్టి పెట్టకుండా సురక్షితమైన, బాధ్యతాయుతమైన డిజిటల్ వాతావరణానికి దోహదపడుతుంది... డిజిటల్ వెల్బీయింగ్ గైడ్‌బుక్.
స్క్రీన్ టైమ్ పరిమితులను సిఫారసు చేయడానికి ముందు, తల్లిదండ్రులు తమ పిల్లలతో ఎలాంటి దాపరికం లేకుండా సంభాషించాలని, డిజిటల్ పరికరాల వాడడానికి సంబంధించి కుటుంబ సభ్యులందరూ కలిసి పాటించే నియమాలను రూపొందించుకోవాలని, ఇంట్లో టెక్–ఫ్రీ జోన్లను ఏర్పాటు చేసుకోవాలని ఈ గైడ్ సూచిస్తోంది.
అలా కాకుండా....
‘డిజిటల్ పరికరాలకు సంబంధించి తల్లిదండ్రులు పిల్లలపై అకస్మాత్తుగా ఆంక్షలు విధించినప్పుడు తరచుగా వివాదాలు తలెత్తుతాయి. ఆకస్మిక నిషేధాల వల్ల పిల్లలు ఒంటరిగా ఫీలవుతారు. అలా కాకుండా, డిజిటల్ పరికరాల వాడకానికి సంబంధించి స్పష్టమైన హద్దులను ఏర్పాటు చేసుకోవడానికి పిల్లలను ఒప్పించడం ద్వారా కుటుంబాలు ఆరోగ్యకరమైన డిజిటల్ అలవాట్లను పెంపొందించుకునే అవకాశం ఎక్కువ ఉంది’ అంటున్నారు క్లినికల్ సైకాలజీ ప్రొఫెసర్ డాక్టర్ మనోజ్ కుమార్ శర్మ.
వినోదం–విద్య
వినోదంతో పాటు విద్య కోసం డిజిటల్ పరికరాలను విరివిగా ఉపయోగించే భారతీయ కుటుంబాలకు ఎదురయ్యే సవాళ్లను గూగుల్ గైడ్ ప్రస్తావించింది. ఆన్లైన్ భద్రతను మెరుగుపరచడానికి యూట్యూబ్ వారి ‘హౌస్ వాచింగ్ ప్రొఫైల్స్’ను సిఫారసు చేసింది. డిజిటల్ అక్షరాస్యతను బలోపేతం చేసే, ఆన్లైన్ మోసాలను నివారించడంలో సహాయపడే సా«ధనాలను పరిచయం చేసింది. ‘డిజిటల్ వెల్బీయింగ్’ గైడ్‌బుక్ ఉచిత డౌన్లోడ్ అందుబాటులో ఉంది.
Tags : 1