Breaking News

ప్లాస్టిక్ కవర్‌లలో పట్టు చీరలను పెడుతున్నారా..?

Published on Mon, 07/27/2026 - 13:57

పట్టు చీర అనేది భారతీయ కుటుంబాల్లో అదొక శారీ మాత్రమే కాదు..ఎన్నో జ్ఞాపకాల మూట. అది మా అమ్మది, నానమ్మది.. అంటూ వాళ్లతో ముడివేసిన బంధాన్ని గుర్తుచేసేది. వారసత్వంగా భద్రపర్చుకునే గొప్ప జ్ఞాపకం. కుటుంబ చరిత్ర నింపుకున్న చీర. అలాంటి ఏళ్ల నాటి చీరలను రక్షించడం కోసం ఉపయోగించే పద్ధతులే వాటిని పాడైపోయేలా చేస్తున్నాయని అంటున్నారు ప్రముఖ​ జానపద గాయని, సాంస్కృతిక చిహ్నం మాలినీ అవస్థి. 

తాను 40 ఏళ్లు  పైబడినా..తన సొంత పట్టు చీరలను ఎలా చెక్కుచెదరకుండా ఉంచారో వెల్లడించారు. వారసత్వ పట్టుచీరలను కాపాడుకోవడం అనేది ఏమి కష్టమైనది, ఖరీదైనది కాదు అంటూ పట్టుచీరలను సురక్షితంగా ఉంచుకునే చిట్కాలు పంచుకున్నారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.  

ప్లాస్టిక్‌ కవర్‌లలో ఉంచొద్దు..
ప్లాస్టిక్‌ కవర్‌లలో చీరలు ఉంచితో ఏదోరకంగా గాలి వెళ్లిపోతుంది తద్వారా తేమ చీరల్లోకి చేరిపోతుంది. కానీ వాటిలో ఉన్న సమస్య ఏంటంటే ఒకసారి తేమ ప్రవేశించినా..బయటకు వెళ్లడానికి ఛాన్స్‌ ఉండదు. అది ఘనీభవించి బట్టపై మచ్చలుగా పేరుకుపోతుంది. అది పట్టు లేదా జరీని ఆక్సీకరణం చేసి తిరిగి మార్చలేని విధంగా పాడు చేస్తుంది. 

పట్టు చీరలను భద్రపర్చడానికి మస్లిన్‌ వంటి సహజమైన వస్త్రాలతో, గాలి ఆడే గార్మెంట్‌ బ్యాగులలో భద్రపర్చాలి. చీరలను దుమ్ము, కీటకాల నుంచి కాపాడుతూనే గాలి ప్రసరణకు అనుమతివ్వాలి. అందువల్ల ప్లాస్టిక్ సంచులను ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదు. అవి తేమను బంధించి త్వరితగతిన పాడేయ్యేందుకు కారణమువుతుంది.

నాఫ్తలీన్‌ బిళ్లలు వద్దు..
నాఫ్తలీన్‌ బిళ్లలు కీటకాల నుంచి రక్షిస్తాయని భావించి ఆ చీరల మధ్యలో ఉంచుతారు. అది కొంతవరకు నిజమే అయినా..పట్టు లేదా జరీకి ఆ నాఫ్తలీన్‌ బిళ్లలు నేరుగా తగలగానే అది వస్త్రంతో చర్య జరిపి..సున్నితమైన దారాల రంగు మారి దెబ్బతినే అవకాశం ఉంటుంది. అందువల్ల వేపాకులు లేదా లవంగాలు ఉంచితే చాలని. అవి సురక్షితంగా ఉంచడమే గాక ప్రభావవంతమైన ప్రత్యామ్నాయం అని అంటున్నారు.

వస్త్రంలో చుట్టాల్సిందే..

గాయని మాలినీ అవస్థి ఉపయోగించే పద్ధతి సాంప్రదాయబద్ధమైనది, వస్త్ర నిపుణులచే పూర్తిగా ఆమోదించబడింది. ప్రతి చీరను నిల్వచేసే ముందు విడివిడిగా ఒక శుభ్రమైన పత్తి వస్త్రంలో చుట్టండి. చీరలను చుట్టేటప్పుడు, దుమ్ము లేదా తేమ లోపలికి రాకుండా గాలి ప్రసరించేలా పత్తి లేదా మస్లిన్‌తో చేసిన మృదువైన వస్త్రాన్ని ఉపయోగించండి. ప్లాస్టిక్‌లా కాకుండా, గాలి ప్రసరించే వస్త్రం చీరను దుమ్ము, కీటకాల నుండి రక్షిస్తూ తాజాగా ఉంచుతుంది.

అలాగే మడతలను క్రమం తప్పకుండా మార్చండి. ఒక చీర నెలలు లేదా సంవత్సరాల పాటు ఒకే స్థితిలో మడతపెట్టి ఉంటే..బలహీనపడుతుంది. అందువల్ల ప్రతి రెండు నెలలకు ఒకసారి చీరలను మళ్లీ మడతపెట్టడం మంచిదని అంటున్నారామె. 

అలాగే పట్టుచీరలను చెక్కపెట్టెలు లేదా ట్రంకులలో నిల్వ చేసే సంప్రదాయ పద్ధతే మంచిదని అంటున్నారు. పెట్టె అడుగ భాగంలో శుభ్రమైన పత్తి వస్త్రాన్ని పరచాలి..ఆ వస్త్రంపై చీరలను ఉంచి ఆ పై నుంచి మరో వస్త్రం కప్పాలి.

అలాగే చీరలను చీకటి అల్మారాల్లోనే భద్రపర్చాలి. చల్లని పొడి ప్రదేశాన్నే ఎంచుకోవాలి

వీటి తోపాటు భద్రపర్చిన చీరలు గాలికి తగలడం కూడా అవసరం. అందువల్ల పట్టు చీరలను అప్పుడప్పుడు స్వచ్ఛమైన గాలి తగిలేలా ఉంచడం వల్ల మేలు జరుగుతుంది. ప్రతి కొన్ని నెలలకొకసారి వాటిని బయటకు తీసి, మెల్లగా గాల్లో విప్పండి, కొన్ని గంటలపాటు నీడలో ఆరబెట్టి తిరిగి పెట్టే ముందు వేర్వేరు వరుసలో మడతపెట్టండి. 

ఇలా చేస్తే ఎన్నాళ్లైనా పట్టు  చీరలు రంగుతో సహా పాడవ్వకుండా సురక్షితంగా ఉంటాయి. ఇవన్నీ మన నానమ్మల కాలం నాటి చిట్కాలేనని అంటున్నారు మాలినీ అవస్థి.

 

(చదవండి: స్లిమ్‌గా అర్జున్‌ రణతుంగ..! ఊబకాయులకు ఇదే సరైనదా?)

 

#

Tags : 1

Videos

డీఏస్సీ స్కామ్ లో సీబీఐ ఎంక్వైరీ..? తక్షణమే లోకేష్ రాజీనామా..?

రంగనాథ్‌పై TG హైకోర్టు కీలక ఆదేశాలు

సీనియర్స్ కే ఆ అర్హత దక్కాలి వాళ్ళ తర్వాతే నేను

విజయవాడలో టెన్షన్ టెన్షన్.. ఔట్ సోర్సింగ్ కార్మికుల కన్నెర్ర..

పెద్దిని పరామర్శించిన KCR

దేవినేని ఉమాను కలిస్తే తప్పేంటి..? నోరు తెరిస్తే తట్టుకోలేవు..

మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని వైఎస్సార్సీపీ డిమాండ్

గుడ్ న్యూస్.. వచ్చే మూడు రోజుల్లో భారీ వర్షాలు..

పవన్ కళ్యాణికి బిగ్ షాక్ జనసేనపై తిరగబడ్డ Gen-Z

భారీగా పెరిగిన బంగారం ధరలు.. 10 గ్రాముల ధర మరీ ఇంతనా? తాజా రేట్లు చూసి షాక్ అవుతారు!

Photos

+5

'మహేంద్రగిరి వారాహి' టీజర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

గర్ల్‌ఫ్రెండ్‌తో టీమిండియా క్రికెటర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌ (ఫొటోలు)

+5

మీనాక్షి చౌదరి అమెరికా ట్రిప్.. ఎంత ముద్దుగా ఉందో? (ఫొటోలు)

+5

ఏపీ : విశాఖపట్నం దగ్గరలో అద్భుతమైన జలపాతం... ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

ఈ టాలీవుడ్ నటుడు గుర్తున్నాడా..? ఆయన కూతురు మనవి ఇప్పుడు క్రేజీ హీరోయిన్.. (ఫొటోలు)

+5

డాక్టర్‌ సతీశ్‌రెడ్డికి 'ఛేంజ్‌ మేకర్‌' పురస్కారం అందజేసిన చిరంజీవి (ఫొటోలు)

+5

శ్రీకాళహస్తి : ధర్మరాజులస్వామి ఆలయంలో శాస్తోక్తంగా అగ్నిగుండ మహోత్సవం (ఫొటోలు)

+5

'శ్రీనివాస మంగాపురం' మూవీ ప్రెస్‌మీట్‌ (ఫొటోలు)

+5

విజ‌య‌వాడ దుర్గ‌మ్మ‌కు తెలంగాణ బోనాలు (ఫోటోలు)

+5

నేచర్ ఎంజాయ్ చేస్తోన్న టాలీవుడ్ నటి అనసూయ (ఫోటోలు)