Breaking News

కోడికూర రుచిచూడాలంటే అంకాపూర్‌ వెళ్లాల్సిందే..!

Published on Sun, 07/26/2026 - 12:55

అంకాపూర్‌ ఊరి పేరు చెబితే భోజన ప్రియుల కళ్లలో మెరుపులు.. వేడివేడి మక్కవడ.. ఘుమఘుమలాడే దేశీచికెన్‌ రుచి చూడాలంటే అక్కడికి వెళ్లాల్సిందే అంటూ ఉత్సాహం చూపుతారు. 63వ నంబర్‌ జాతీయ రహదారిపై రాకపోకలు సాగించే ఏ వాహనదారుడైనా అంకాపూర్‌లో ఆగిమరీ ఇక్కడి రుచులను ఆస్వాదిస్తారు. అలాగే ఇక్కడ విక్రయించే పచ్చి మక్కబుట్టలకు విపరీతమైన డిమాండ్‌ ఉంది. వ్యవసాయరంగంలో తనదైన ముద్రవేసుకున్న అంకాపూర్‌.. మక్కవడలు, దేశీచికెన్‌ రుచులతో భోజన ప్రియుల మదిలో ప్రత్యేక స్థానాన్ని పదిలపర్చుకుంది. పచ్చిబుట్టల విక్రయాలు జోరుగాసాగుతున్నాయి. వివిధ ప్రాంతాలకు ప్రతిరోజూ ట్రాలీల్లో పచ్చిబుట్టలు తరలుతున్నాయి. నిజామాబాద్‌ జిల్లా కేంద్రంతోపాటు హైదరాబాద్‌ వంటి మహానగరంలో పచ్చిబుట్టలు విక్రయించే వారు సైతం ‘అంకాపూర్‌’ పేరుతోనే బిజినెస్‌ సాగిస్తుంటారు.  

కాల్చిన మక్కెన్‌లు..
63వ నంబర్‌ జాతీయ రహదారికి వరువైపులా చిన్నచిన్న గుడిసెలు వేసుకుని మహిళలు మక్కెన్‌లను కాల్చి విక్రయిస్తున్నారు. మొక్కజొన్న పండే ఆరు నెలల కాలం వీరికి జీవనోపాధి ఇదే. రైతులు, మధ్య దళారుల నుంచి ముందుగానే పచ్చి బుట్టలు కొనుగోలు చేసి వాటిని బొగ్గులపై కాల్చి రూ.20కు ఒకటి చొప్పున విక్రయిస్తున్నారు. వాహనదారులు ఇక్కడ ఆగుతూ చల్లని వాతావరణంలో బొగ్గులపై కాల్చిన వేడి వేడి మక్కెన తింటూ మధురానుభూతిని పొందుతున్నారు.  

పచ్చి బుట్టలు 
జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు ఉన్న అంకాపూర్‌ మొక్కజొన్న మార్కెట్‌ విక్రయదారులు, కొనుగోలుదారులతో కళకళలాడుతోంది. దూర ప్రాంతాల నుంచి వచ్చే వాహనదారులు ఇక్కడ ఆగుతూ రైతులు, వ్యాపారులు చెప్పిన ధరకే పచ్చి మక్కబుట్టలను కొనుగోలు చేస్తున్నారు. ఆర్మూర్‌ ప్రాంతంలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులు పండించిన మొక్కజొన్న పంటను మధ్య దళారులు ముందుగానే కొనుగోలు చేస్తారు. లేదా రైతులు నేరుగా ఆటో ట్రాలీల్లో అంకాపూర్‌ మార్కెట్‌కు తీసుకొచ్చి రోడ్డు పక్కన కుప్పలుగా పోసి విక్రయిస్తున్నారు.  

కోడికూర 
అంకాపూర్‌ పేరు వింటేనే అందరూ ఠక్కున పలికేది ‘దేశీ కోడికూర’. మాంసం ప్రియుల నోరూరించే దేశీ కోడికూరకు అంకాపూర్‌ ఎంతో ప్రత్యేకం. మక్కవడలు, దేశీచికెన్‌ రుచి తెలిసిన భోజన ప్రియులు రెండింటిని కలిపి లాగిస్తున్నారు. మక్క వడలను దేశీ కోడి కూరలో నంజుకొని తింటున్నారు. పెద్ద పెద్ద స్టార్‌ హోటళ్లలో సైతం ఈ రుచి అందుబాటులో ఉండకపోవడంతో దేశీకోడి కూరతో మక్క వడలు తినడానికి ఎక్కువ మంది వస్తుండటంతో ఆర్డర్‌ మెస్‌లు, మక్క వడలు వేసే హోటళ్లు జనాలతో కిటకిటలాడుతున్నాయి.  

నోరూరిస్తున్న మక్కవడలు
అంకాపూర్‌ మక్కవడ అంటేనే ఎంతో స్పెషల్‌. గ్రామానికి చెందిన వారితోపాటు ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చిన వారుసైతం హోటళ్లలో పోటాపోటీగా ఎంతో రుచికరంగా మక్కవడలు వేస్తున్నారు. వాహనదారులు అంకాపూర్‌లోని జాతీయ రహదారికి ఇరువైపులా వాహనాలను నిలిపి వడలు తింటూ ‘ఆహా.. ఏమి రుచి’ అంటూ ఆస్వాదిస్తున్నారు. తాము తినడమే కాదు కుటుంబ సభ్యులు, మిత్రుల కోసం పార్సిల్‌లు తీసుకు వెళ్తున్నారు. నిజామాబాద్, హైదరాబాద్‌ ప్రాంతాలవారు ఫోన్‌లలో ఆర్డర్‌ చేస్తూ పార్సిల్‌లు తెప్పించుకుంటున్నారు.  

పచ్చిబుట్ట కొంటున్నారు 
ఇతర పట్టణాలు, గ్రామాల  నుంచి అంకాపూర్‌కు వచ్చిన వారు పచ్చి బుట్టను కొని తీసుకెళ్తున్నారు. ఇళ్ల లో మక్క వడలు వేసుకోవడానికి కొంటున్నామని చెబుతున్నారు. వాతావరణంలో మార్పు రావడంతో మార్కెట్‌ పుంజుకుంటోంది. 
– బోదాస్‌ లక్ష్మి, విక్రయదారు, అంకాపూర్‌ 

ఇక్కడ ఆగాల్సిందే.. 
అంకాపూర్‌ మీదుగా వెళ్లే వాహనాలు మాదగ్గర ఆగకుండా ముందుకు వెళ్లవు. కాల్చిన మక్కెన్‌ కొనుక్కొని ఉప్పు, నిమ్మకాయ దట్టించుకొని తిని మమ్మల్ని మెచ్చుకొని వెళ్తారు. చాలా ఆనందంగా ఉంటుంది. పదుల సంఖ్యలో ఇక్కడ షెడ్లు వేసుకొని మక్కెన్‌లు కాలుస్తున్నాం. గ్రామస్తులు కూడా మాకు సహకరిస్తున్నారు. 
– నర్సవ్వ, కాల్చిన మక్కెన్‌లు విక్రయించే మహిళ  

నిజామాబాద్‌ 

Videos

డీఏస్సీ స్కామ్ లో సీబీఐ ఎంక్వైరీ..? తక్షణమే లోకేష్ రాజీనామా..?

రంగనాథ్‌పై TG హైకోర్టు కీలక ఆదేశాలు

సీనియర్స్ కే ఆ అర్హత దక్కాలి వాళ్ళ తర్వాతే నేను

విజయవాడలో టెన్షన్ టెన్షన్.. ఔట్ సోర్సింగ్ కార్మికుల కన్నెర్ర..

పెద్దిని పరామర్శించిన KCR

దేవినేని ఉమాను కలిస్తే తప్పేంటి..? నోరు తెరిస్తే తట్టుకోలేవు..

మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని వైఎస్సార్సీపీ డిమాండ్

గుడ్ న్యూస్.. వచ్చే మూడు రోజుల్లో భారీ వర్షాలు..

పవన్ కళ్యాణికి బిగ్ షాక్ జనసేనపై తిరగబడ్డ Gen-Z

భారీగా పెరిగిన బంగారం ధరలు.. 10 గ్రాముల ధర మరీ ఇంతనా? తాజా రేట్లు చూసి షాక్ అవుతారు!

Photos

+5

'మహేంద్రగిరి వారాహి' టీజర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

గర్ల్‌ఫ్రెండ్‌తో టీమిండియా క్రికెటర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌ (ఫొటోలు)

+5

మీనాక్షి చౌదరి అమెరికా ట్రిప్.. ఎంత ముద్దుగా ఉందో? (ఫొటోలు)

+5

ఏపీ : విశాఖపట్నం దగ్గరలో అద్భుతమైన జలపాతం... ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

ఈ టాలీవుడ్ నటుడు గుర్తున్నాడా..? ఆయన కూతురు మనవి ఇప్పుడు క్రేజీ హీరోయిన్.. (ఫొటోలు)

+5

డాక్టర్‌ సతీశ్‌రెడ్డికి 'ఛేంజ్‌ మేకర్‌' పురస్కారం అందజేసిన చిరంజీవి (ఫొటోలు)

+5

శ్రీకాళహస్తి : ధర్మరాజులస్వామి ఆలయంలో శాస్తోక్తంగా అగ్నిగుండ మహోత్సవం (ఫొటోలు)

+5

'శ్రీనివాస మంగాపురం' మూవీ ప్రెస్‌మీట్‌ (ఫొటోలు)

+5

విజ‌య‌వాడ దుర్గ‌మ్మ‌కు తెలంగాణ బోనాలు (ఫోటోలు)

+5

నేచర్ ఎంజాయ్ చేస్తోన్న టాలీవుడ్ నటి అనసూయ (ఫోటోలు)