10 ఏళ్లలో 152 పరీక్షల పేపర్లు లీక్.. వారిలో ఒక్కరికీ శిక్షపడలేదు
Breaking News
12 సార్లు రిజెక్ట్.. 13వ ప్రయత్నంలో ఉద్యోగం!
Published on Mon, 07/20/2026 - 21:02
జీవితంలో విజయం ఒక్కసారిగా రాదు. ఎన్నో అపజయాలు, నిరాశలను దాటిన తర్వాతే విజయం లభిస్తుంది. దీనికి నిదర్శనంగా ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ తన అనుభవాన్ని సోషల్ మీడియా వేదిక 'ఎక్స్'లో షేర్ చేసుకున్నారు. వరుసగా 12 సార్లు తిరస్కరణ ఎదురైనా ఆశ వదులుకోకుండా ప్రయత్నించి, 13వ ప్రయత్నంలో గూగుల్‌లో ఉద్యోగం సాధించిన విషయాన్ని వెల్లడించారు.
గూగుల్ మాత్రమే కాదు, మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగం పొందడానికి కూడా తనకు 16 సార్లు తిరస్కరణ ఎదురైందని వెల్లడించాడు. అమెజాన్‌లో మూడుసార్లు అప్లికేషన్ తిరస్కరించబడగా, యాపిల్, ఒరాకిల్ వంటి సంస్థల నుంచి ఒక్కసారి కూడా ఇంటర్వ్యూకు పిలుపు రాలేదని తెలిపారు. అయినప్పటికీ ఎక్కడా నిరాశ చెందకుండా తన ప్రయత్నాలను కొనసాగించినట్లు పేర్కొన్నాడు.
తన విజయానికి కారణం కేవలం అదృష్టం మాత్రమే కాదని, సరైన ప్రణాళిక కూడా ముఖ్యమని చెప్పారు. ఉద్యోగాలకు విచక్షణ లేకుండా దరఖాస్తు చేయకుండా, తమ రెజ్యూమ్‌కు సరిపోయే పోస్టులకే అప్లై చేయాలని సూచించారు. అలాగే కంపెనీలో పనిచేస్తున్న పరిచయస్తుల ద్వారా హెచ్‌ఆర్‌ను సంప్రదించడం, లింక్డ్‌ఇన్‌లో మేనేజర్లతో కనెక్ట్ కావడం వంటి మార్గాలు కూడా ఉద్యోగ అవకాశాలను పెంచుతాయని వివరించారు.
ఈ పోస్ట్ చూసిన పలువురు నెటిజన్లు ఆయన పట్టుదలను అభినందించారు. మరికొందరు మాత్రం మంచి కాలేజీ లేదా పెద్ద కంపెనీల అనుభవం కూడా ఉద్యోగ అవకాశాలపై ప్రభావం చూపుతుందని అభిప్రాయపడ్డారు. ఇంకొందరు ఇంటర్వ్యూ సన్నద్ధతను మరింత మెరుగుపరచుకోవాలని సూచించారు.
I got into Google after getting rejected 12 times. 13th time was the charm🧿
Now just Google,
Amazon - got the offer after 3 rejections
Microsoft - got the offer after 16 rejections
Apple - never got a call back
Oracle - never got a call back
Applying in these companies is… pic.twitter.com/gjHMdfzdEA— Soumyadeep Paul (@investwithpaul) July 19, 2026
Tags : 1