Breaking News

ఈ ప్రైవేటు బ్యాంకులకు భలే లాభాలొచ్చాయ్‌..

Published on Mon, 07/20/2026 - 15:11

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ప్రైవేట్‌ రంగ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు రూ. 19,060 కోట్ల నికర లాభం (స్టాండెలోన్‌) ప్రకటించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో నమోదైన రూ. 18,155 కోట్లతో పోలిస్తే ఇది సుమారు 5 శాతం అధికం. మరోవైపు బ్యాంకు ఆదాయం రూ. 99,200 కోట్ల నుంచి రూ. 92,184 కోట్లకు తగ్గింది. వడ్డీ ఆదాయం రూ. 77,470 కోట్ల నుంచి రూ. 79,363 కోట్లకు పెరిగింది. స్థూల నిరర్థక ఆస్తులు (జీఎన్‌పీఏ) 1.4 శాతం నుంచి 1.17 శాతానికి, నికర ఎన్‌పీఎలు 0.47 శాతం నుంచి 0.41 శాతానికి నెమ్మదించాయి. పార్ట్‌టైమ్‌ చైర్మన్‌గా మాజీ చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ నియామకంతో సంస్థకు స్థిరత్వం లభించినట్లవుతుందని ఎండీ, సీఈవో శశిధర్‌ జగదీశన్‌ తెలిపారు.  

ఐసీఐసీఐ బ్యాంక్‌కి రుణ వృద్ధి దన్ను..

దేశీయంగా ప్రైవేట్‌ రంగంలో రెండో అతి పెద్ద బ్యాంకు అయిన ఐసీఐసీఐ బ్యాంక్‌ తొలి త్రైమాసికంలో నికర లాభం (కన్సాలిడేటెడ్‌) సుమారు 14 శాతం వృద్ధితో రూ. 13,558 కోట్ల నుంచి రూ. 15,440 కోట్లకు పెరిగింది. రుణాలు 20 శాతం వృద్ధి చెందడం ఇందుకు దోహదపడింది. నికర వడ్డీ ఆదాయం సుమారు 13 శాతం పెరిగి రూ. 24,384 కోట్లకు చేరింది. డిపాజిట్లు 14 శాతం పెరిగాయి. స్థూల నిరర్థక ఆస్తుల (జీఎన్‌పీఏ) నిష్పత్తి 1.67 శాతం నుంచి 1.38 శాతానికి తగ్గింది. స్టాండెలోన్‌ ప్రాతిపదికన బ్యాంకు నికర లాభం 16 శాతం వృద్ధితో రూ. 12,768 కోట్ల నుంచి రూ. 14,804 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్‌ స్వల్పంగా 4.36 శాతానికి పెరిగింది. వివిధ కారణాలరీత్యా గత కొంతకాలంగా నెమ్మదించిన కార్పొరేట్‌ రుణాల విభాగం మళ్లీ గణనీయంగా మెరుగుపడగలదని బ్యాంకు ఈడీ సందీప్‌ బాత్రా తెలిపారు.  

కోటక్‌ మహీంద్రా 23 శాతం అప్‌..

కోటక్‌ మహీంద్రా బ్యాంకు నికర లాభం గత క్యూ1తో పోలిస్తే 22.6 శాతం వృద్ధితో రూ. 5,480 కోట్లకు (కన్సాలిడేటెడ్‌) పెరిగింది. స్టాండెలోన్‌ ప్రాతిపదికన రూ. 3,282 కోట్ల నుంచి రూ. 4,123 కోట్లకు చేరింది. నికర వడ్డీ ఆదాయం 9 శాతం పెరిగి రూ. 7,259 కోట్ల నుంచి రూ. 7,928 కోట్లకు వృద్ధి చెందింది. అయితే, నికర వడ్డీ మార్జిన్‌ మాత్రం 4.64 శాతం నుంచి 4.53 శాతానికి తగ్గింది. ఈ ఏడాది డిసెంబర్‌లో వైదొలగాలన్న నిర్ణయానికి వ్యక్తిగత, వృత్తిగత అంశాలు కారణమని బ్యాంకు ఎండీ, సీఈవో అశోక్‌ వాస్వానీ తెలిపారు. సమీక్షాకాలంలో డిపాజిట్లు 14 శాతం వృద్ధితో రూ. 4,92 లక్షల కోట్ల నుంచి రూ. 5.59 లక్షల కోట్లకు చేరాయి. రుణాలు 15 శాతం పెరిగి రూ. 4.59 లక్షల కోట్ల నుంచి రూ. 5.28 లక్షల కోట్లకు వృద్ధి చెందాయి.  

యాక్సిస్‌ బ్యాంక్‌కి తగ్గిన ప్రొవిజనింగ్‌ భారం..

మొండిబాకీలు మొదలైన వాటికి ప్రొవిజనింగ్‌ తగ్గడం యాక్సిస్‌ బ్యాంక్‌ మెరుగైన పనితీరుకు దోహదపడింది. క్యూ1లో సంస్థ నికర లాభం 22 శాతం వృద్ధితో రూ. 7,632 కోట్లకు (కన్సాలిడేటెడ్‌) చేరింది. స్టాండెలోన్‌ ప్రాతిపదికన 23 శాతం పెరిగి రూ. 7,114 కోట్లకు వృద్ధి చెందింది. నికర వడ్డీ ఆదాయం 8 శాతం పెరిగి రూ. 14,646 కోట్లుగా నమోదైంది. రుణాలు 19 శాతం వృద్ధి చెందాయి. నికర వడ్డీ మార్జిన్‌ 3.80 శాతం నుంచి 3.46 శాతానికి తగ్గింది. కార్పొరేట్‌ రుణాలు 38 శాతం, రిటైల్‌ రుణాలు 8 శాతం వృద్ధి చెందినట్లు బ్యాంకు సీఈవో అమితాబ్‌ చౌదరి తెలిపారు. ఇక నుంచి నికర వడ్డీ మార్జిన్లు పుంజుకోగలవని ఆయన పేర్కొన్నారు. సమీక్షాకాలంలో ప్రొవిజనింగ్‌ రూ. 3,948 కోట్ల నుంచి రూ. 2,223 కోట్లకు తగ్గింది. జీఎన్‌పీఏ నిష్పత్తి 1.23 శాతం నుంచి 1.28 శాతానికి పెరిగింది.  

Videos

రాజీనామా చేసేంత వరకు నిరసన కొనసాగుతుంది..!

హైకోర్టు ఆవరణలో హైడ్రా కమీషనర్ కి నీకి అవమానం!

నోరు తెరిచి మాట్లాడు! పవన్ పై వరుదు కల్యాణి సీరియస్

బుడోడు రీఎంట్రీ.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే

ఆస్పత్రిలో వాంగ్ చుక్.. బయట సీజేపీ నిరసన.. టెన్షన్ టెన్షన్

సీదిరి అప్పలరాజును పరామర్శించారు YSRCP నేతలు

జంగల్ పాలనకు ముగింపు తప్పదు బయటపడ్డ గల్లా మాధవి, జత్వానీ అసలు రంగు

ఇందిరమ్మ ఇల్లు కావాలంటే ఇదిగో ఇలా దరఖాస్తు చేసుకోండి

ఇరాన్ దెబ్బకు అమెరికా విలవిల

అధికారాన్ని అడ్డుపెట్టుకుని రెచ్చిపోవద్దు ఇంతకుఇంత అనుభవిస్తారు

Photos

+5

ప్రియురాలిని పరిచయం చేసిన యంగ్ హీరో ఫోటోస్ వైరల్

+5

హైదరాబాద్‌ : అంగరంగ వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం (ఫొటోలు)

+5

హీరోయిన్ కంటే అందంగా చెన్నై లవ్ స్టోరీ యాంకర్ చర్మిలా (ఫోటోలు)

+5

చెల్లి సితార, ఫ్రెండ్స్‌తో మహేశ్ కొడుకు గౌతమ్ ట్రిప్ (ఫొటోలు)

+5

వైఎస్సార్‌సీపీ ‘చలో పంచదార్ల’ విజయవంతం (ఫొటోలు)

+5

విదేశీయుడితో సీరియల్ నటి రెండో పెళ్లి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి దేవాలయం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

'లెనిన్' సక్సెస్ మీట్.. అక్కినేని హీరోలు స్పెషల్ ఎట్రాక్షన్ (ఫొటోలు)

+5

రకుల్.. సో బ్యూటిఫుల్ (ఫొటోలు)

+5

హీరోయిన్లకు పోటీ ఇచ్చేంత అందంగా స్టార్ సింగర్ (ఫొటోలు)