Breaking News

1600 నెంబర్లను బ్లాక్‌ చేయొద్దు.. ట్రాయ్ కీలక ఆదేశాలు

Published on Tue, 07/14/2026 - 20:12

నియంత్రిత సంస్థలు, ప్రభుత్వం నుంచి ప్రజలకు సమాచారాన్ని చేరవేసేందుకు ఉద్దేశించిన 1600 నంబర్‌ సిరీస్‌ నుంచి వచ్చే ఫోన్‌ కాల్స్‌ని ఏ యాప్‌ కూడా బ్లాక్‌ చేయడానికి వీల్లేదని టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్‌ స్పష్టం చేసింది. అలాగే 140 నంబర్‌ సిరీస్‌తో వచ్చే ప్రమోషనల్‌ కాల్స్‌ని తమ నిర్వహణలోని డీఎన్‌డీ రిజిస్ట్రీ తప్ప ఇతరత్రా ఏ యాప్‌ కూడా బ్లాక్‌ చేయడానికి లేదని వివరణ ఇచ్చింది.

నిర్దిష్ట సిరీస్‌ల నుంచి వచ్చే కాల్స్‌ని ట్రూకాలర్‌ యాప్‌ స్పామ్‌ కింద లేబులింగ్‌ చేస్తున్న నేపథ్యంలో ట్రాయ్‌ వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే, 1600, 140 నంబర్‌ సిరీస్‌లు దుర్వినియోగమవుతున్నాయంటూ 5.25 లక్షల మంది పైగా యూజర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో వాటిని ట్యాగ్‌ చేయడం తప్పెలా అవుతుందని ట్రూకాలర్‌ సీఈవో రిషిత్‌ ఝున్‌ఝున్‌వాలా తెలిపారు. ఈ రెండు సిరీస్‌లలో రోజూ 5.1 కోట్లకు పైగా కాల్స్‌కి యూజర్లు అసలు స్పందించడం లేదని పేర్కొన్నారు. ప్రస్తుతం ట్రూకాలర్‌ యూజర్లు ప్రతి రోజూ 140 సిరీస్‌ నుంచి వచ్చే 4 లక్షల కాల్స్‌ని, 1600 సిరీస్‌కి చెందిన 1.25 లక్షల కాల్స్‌ని బ్లాక్‌ చేస్తున్నట్లు వివరించారు.

#

Tags : 1

Videos

ట్రంప్ వెనక్కి తగ్గిన వెనుక షాకింగ్ నిజాలు

బాబుకు పవన్ బిగ్ షాక్

విశ్వసనీయత లేని బాబు మాటలు

మీరు రావొద్దు... ప్రభుత్వ లాంఛనాలు అవసరం లేదు...

CI వేధింపులు తట్టుకోలేక పుట్టినరోజు నాడే

టీమిండియాకు బ్యాడ్ న్యూస్.. రెండో వన్డే నుంచి గిల్ ఔట్?

సాయి కృష్ణ కేసుపై తల్లి వెనకడుగు అడ్వకేట్ సంచలన వ్యాఖ్యలు

నేను విన్నాను...!. నేను ఉన్నాను..!

ముద్రగడ ఇంటి వద్ద పోలీసుల ఓవర్ యాక్షన్ ఇచ్చిపడేసిన అంబటి

బిజ్లీ మహాదేవ్ అసలు రహస్యం! సైన్స్ కు అర్థంకాని శివుడి మహిమ

Photos

+5

రాధిక భర్త శరత్‌కుమార్ బర్త్ ‍డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

ముద్రగడకు కన్నీటి వీడ్కోలు.. పాడె మోసిన వైఎస్‌ జగన్‌ (ఫొటోలు)

+5

కొరియన్ అమ్మాయితో మహేశ్ మేనల్లుడి పెళ్లి సందడి (ఫొటోలు)

+5

ఆక్వా రైతులకు బాసటగా.. వైఎస్‌ జగన్‌ భీమవరం పర్యటన (ఫొటోలు)

+5

ప్రెగ్నెన్సీతోనూ సమంత ఫారిన్ ట్రిప్ (ఫొటోలు)

+5

జగపతిబాబు-లయ 'వదలా' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

'ఆపరేషన్ అరుణారెడ్డి' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

పింక్ శారీలో బాలీవుడ్ భామ మాధురి దీక్షిత్‌ అందాలు.. ఫోటోలు

+5

ఫ్రెండ్ పార్టీలో బాలీవుడ్ భామ ఆలియా భట్ సందడి.. ఫోటోలు

+5

కూతురి పెళ్లి.. ఫ్యామిలీ ఫొటోలు షేర్ చేసిన నిర్మాత (ఫొటోలు)