గొడ్డలి పార్టీ మాదే... ఒప్పుకున్నా టీడీపీ లీడర్
Breaking News
ఎస్బీఐ నుంచి మెగా ఐపీఓకు రంగం సిద్ధం
Published on Thu, 07/09/2026 - 11:40
దేశీయ మ్యూచువల్ ఫండ్ రంగంలో అగ్రగామి సంస్థల్లో ఒకటైన ‘ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్మెంట్ లిమిటెడ్' ఐపీఓకు సర్వం సిద్ధం చేసింది. రూ.11,692.91 కోట్ల అంచనాతో వస్తున్న ఈ పబ్లిక్ ఇష్యూకు సంబంధించిన ప్రైస్ బ్యాండ్‌ను కంపెనీ అధికారికంగా ప్రకటించింది. 2026 సంవత్సరంలోనే దేశీయ ప్రాథమిక మార్కెట్లో భారీ ఐపీఓగా ఇది రికార్డు సృష్టించబోతోంది. ఈ మెగా ఐపీఓకు సంబంధించిన వివరాలు కొన్ని కింద చూద్దాం.
రూ.545 - రూ.574 గా ప్రైస్ బ్యాండ్ ఖరారు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుబంధ సంస్థ అయిన ఈ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ తన ఐపీఓ ధరల శ్రేణిని ఒక్కో షేరుకు రూ.545-రూ.574 గా నిర్ణయించింది. అప్పర్ ప్రైస్ బ్యాండ్ వద్ద లెక్కగడితే ఈ కంపెనీ మార్కెట్ విలువ ఏకంగా రూ.1.17 లక్షల కోట్లకు చేరనుంది.
అయితే, ఈ ఇష్యూ పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ పద్ధతిలో జరుగుతోంది. దీని ద్వారా ప్రమోటర్లు 20 కోట్లకు పైగా షేర్లను విక్రయిస్తున్నారు. ఇందులో ఎలాంటి ఫ్రెష్ ఇష్యూ (తాజా షేర్ల జారీ) లేదు. కాబట్టి, ఐపీఓ ద్వారా వచ్చే నిధులన్నీ విక్రయించే వాటాదారులకే వెళ్తాయి తప్ప కంపెనీ ఖాతాలోకి చేరవని గమనించాలి.
రిటైల్ పెట్టుబడిదారులకు కనీస పెట్టుబడి ఎంత?
సాధారణ రిటైల్ ఇన్వెస్టర్ల కోసం కంపెనీ కనీస లాట్ పరిమాణాన్ని 26 షేర్లుగా నిర్ణయించింది. ఒక లాట్ కోసం దరఖాస్తు చేయాలంటే అప్పర్ ప్రైస్ బ్యాండ్ (రూ.574) ప్రకారం రిటైల్ పెట్టుబడిదారునికి కనీసం రూ.14,924 అవసరమవుతాయి. గరిష్టంగా ఇన్వెస్టర్లు 26 షేర్ల మల్టిప్లైస్లో మరిన్ని లాట్లకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇదీ చదవండి: బంగారం ధరల్లో స్వల్ప మార్పు
పెట్టుబడిదారుల యాంకర్ బుక్ ఓపెనింగ్ జులై 13.
సబ్స్క్రిప్షన్ ప్రారంభం జులై 14.
సబ్స్క్రిప్షన్ ముగింపు జులై 16.
షేర్ల కేటాయింపు ఖరారు జులై 17 (అంచనా).
రిఫండ్లు, నిధుల అన్‌బ్లాకింగ్: జులై 20
డీమ్యాట్ ఖాతాల్లోకి షేర్ల జమ: జులై 20
Tags : 1