Breaking News

రూ.2,000 కోట్లతో నెక్స్ట్ భారత్ వెంచర్స్ భారీ పెట్టుబడులు

Published on Mon, 07/06/2026 - 18:04

భారతదేశంలో సామాజిక శ్రేయస్సు, గ్రామీణాభివృద్ధే ధ్యేయంగా జపాన్‌కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం ‘సుజుకి మోటార్ కార్పొరేషన్’ మద్దతుగల ‘నెక్స్ట్ భారత్ వెంచర్స్ ఐఎఫ్ఎస్‌సీ ప్రైవేట్ లిమిటెడ్’ భారీ పెట్టుబడులకు శ్రీకారం చుట్టింది. దేశీయ స్టార్టప్‌లకు ఊతమిచ్చేందుకు ఏకంగా రూ.2,000 కోట్ల నిధితో కూడిన రెండో ‘ఇంపాక్ట్ ఫండ్’ను ప్రకటించింది. వ్యవసాయం, ఆర్థిక సమ్మేళనం (ఫైనాన్షియల్ ఇంక్లూజన్), ఆరోగ్య సంరక్షణ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి కీలక రంగాల్లో సామాజిక మార్పు కోసం పనిచేసే స్టార్టప్‌లకు ఈ నిధుల ద్వారా ఆర్థిక చేయూత లభించనుంది.

గతంలో కేటాయించిన మొదటి ఫండ్ (రూ.340 కోట్లు) ద్వారా ఇప్పటికే దేశవ్యాప్తంగా 20కి పైగా సామాజిక ప్రభావం చూపే సంస్థలలో పెట్టుబడులు పెట్టిన విషయం తెలిసిందే.

మూడేళ్లలో నిధుల మోహరింపు

తాజా రెండో ఫండ్‌కు సంబంధించి సుజుకి మోటార్ కార్పొరేషన్ ప్రధాన పెట్టుబడిదారుగా వ్యవహరిస్తుందని, దీనితో పాటు జపాన్‌కు చెందిన మరికొన్ని కార్పొరేట్ సంస్థల నుంచి కూడా నిధులు సేకరించనున్నట్లు నెక్స్ట్ భారత్ వెంచర్స్ వ్యవస్థాపకుడు, సీఈఓ విపుల్ జిందాల్ నాథ్ వెల్లడించారు.

ఈ నిధుల కేటాయింపులపై ఆయన మాట్లాడుతూ.. ‘రాబోయే మూడు నుంచి నాలుగు సంవత్సరాలలో ఈ రూ.2,000 కోట్లను వ్యూహాత్మకంగా పెట్టుబడిగా పెట్టనున్నాం. ప్రాథమికంగా గ్రామీణ భారతదేశంలోని స్థానిక ప్రజలు, టైర్-2, టైర్-3 పట్టణాలు, లేదా నగరాల్లోని అనధికారిక, గిగ్ ఎకానమీ కార్మికుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే స్టార్టప్‌లకే మా ప్రాధాన్యత. దీనివల్ల వ్యవసాయం, అగ్రిటెక్, హెల్త్‌కేర్, హెల్త్-టెక్, స్థిరమైన జీవనోపాధి కల్పించే రంగాలు సహజంగానే లబ్ధి పొందుతాయి’ అని విపుల్ జిందాల్ నాథ్ చెప్పారు.

15 ఏళ్ల సుదీర్ఘ కాలపరిమితి

సాధారణ వెంచర్ క్యాపిటల్ (వీసీ) ఫండ్‌ల కాలపరిమితి 12 ఏళ్లు ఉంటే, నెక్స్ట్ భారత్ వెంచర్స్ తమ ఫండ్ కాలపరిమితిని 15 ఏళ్లుగా నిర్ణయించింది. దీనిపై నాథ్ స్పందిస్తూ.. జపాన్ సంస్థలు పెట్టుబడుల విషయంలో ఎంతో ఓపికగా వ్యవహరిస్తాయని, సామాజిక మార్పును ఆశించే స్టార్టప్‌లకు స్థిరపడటానికి కొంచెం ఎక్కువ సమయం పడుతుందని పేర్కొన్నారు. ఇక్కడ వృద్ధి రేటు ఒక్కసారిగా హైపర్ గ్రోత్ మోడ్‌లో కాకుండా, క్రమంగా స్థిరంగా సాగుతుందన్నారు.

ఇదీ చదవండి: కుదేలైన దక్షిణాది తేయాకు ఉత్పత్తి!

Videos

రావణ్ సంచలన వీడియో పవన్ వెన్నులో వణుకు

అసలు టార్గెట్ రావణేనా..? రావణ్‌పై ఎవరి గేమ్..?

ఒక్కటే అడుగుతున్న.. నీ తల్లి దండ్రులతో ఉన్న ఒకేఒక్క ఫోటో చూపించు..

అంతా నా ఇష్టం

నిజామాబాద్ లో దారుణం.. భర్త నరాల్లోకి హార్పిక్ ఎక్కించి

ఎవరో సైకోలు , పిచ్చోళ్లో తెలియదా..? జగన్ పై మాటలు జాగ్రత్త..!

ఎవడడిగాడు నిన్ను ఫ్రీ బస్సు... దానివల్ల ఎంత ఇబ్బంది పడుతున్నామో తెలుసా

చంద్రబాబుకు నేను చెప్పేది ఇదే చాలా ప్రమాదకరం...

రౌడీలను పెంచి పోషించేది కూటమి.. వాటాల రాజ్యం పోతేనే..

లై డిటెక్టర్ టెస్ట్ లో సియా ఏం చెప్పిందంటే..? అందరూ షాక్!

Photos

+5

సంయుక్త నీ అందం వేరే! (ఫొటోలు)

+5

తిరుపతిలో ఘనంగా 'లెనిన్' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో నాగార్జున కుటుంబం (ఫొటోలు)

+5

మాల్దీవులు ట్రిప్ వేసిన హీరోహీరోయిన్ జంట (ఫొటోలు)

+5

ఎన్టీఆర్ బావమరిది కొత్త సినిమా గ్రాండ్ లాంచ్ (ఫొటోలు)

+5

ఒకప్పటి హీరోయిన్ ఇప్పుడు షాకిచ్చేలా.. గుర్తుపట్టారా? (ఫొటోలు)

+5

కొండపాక శ్రీ సత్య సాయి సంజీవని ఆసుపత్రిలో విజయ్ దేవరకొండ (ఫొటోలు)

+5

బుల్లితెర భామ జ్యోతి పూర్వాజ్ బర్త్‌ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

30ల్లో ఫ్రెండ్‌షిప్ ఇలా.. ఈ హీరోయిన్ గుర్తుందా? (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (జూలై 05 - 12)