రావణ్ సంచలన వీడియో పవన్ వెన్నులో వణుకు
Breaking News
నోకియా ఫీచర్ ఫోన్లలో AI ఫీచర్.. కొత్త మోడళ్లు లాంచ్!
Published on Mon, 07/06/2026 - 12:25
మార్కెట్లో నోకియా కీప్యాడ్ ఫోన్లకు మంచి డిమాండ్ ఉండేది. కాలక్రమంలో స్మార్ట్ఫోన్లకు ఆదరణ పెరగడంతో కంపెనీ కొత్త కీప్యాడ్ మొబైల్స్ లాంచ్ చేయడం మానేసింది. అయితే ఇప్పుడు హెచ్ఎమ్డీ గ్లోబల్ తాజాగా నాలుగు కొత్త ఫీచర్ ఫోన్లను విడుదల చేసింది.
హెచ్ఎమ్డీ లాంచ్ చేసిన నాలుగు ఫోన్లు 'నోకియా 200 4జీ, నోకియా 210 4జీ, నోకియా 215 4జీ సెకండ్ ఎడిషన్, నోకియా 235 4జీ సెకండ్ ఎడిషన్'. వీటి ప్రత్యేకత ఏమిటంటే, మొదటిసారిగా ఫీచర్ ఫోన్లలో కూడా AI అసిస్టెంట్ బటన్ ప్రవేశపెట్టడం.
ఈ ఫోన్లలో డీ-ప్యాడ్ మీద ఒక ప్రత్యేక బటన్ ఉంటుంది. దాని ద్వారా Sikey AI అనే అసిస్టెంట్ పనిచేస్తుంది. ఇది వినియోగదారుల వాయిస్ కమాండ్లకు స్పందించి ఫ్లాష్‌లైట్ ఆన్ చేయడం, కెమెరా ఓపెన్ చేయడం, రిమైండర్లు సెట్ చేయడం, అలాగే సాధారణ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం వంటి పనులు చేస్తుంది.
వీటిలో 1450mAh బ్యాటరీ, 4G సపోర్ట్, బ్లూటూత్ 5.0, ఎఫ్ఎమ్ రేడియో, USB-C ఛార్జింగ్ వంటి సదుపాయాలు ఉన్నాయి. మోడల్‌ను బట్టి 2.4 అంగుళాలు లేదా 2.8 అంగుళాల డిస్ప్లేలు అందుబాటులో ఉంటాయి. అయితే కంపెనీ ఈ ఫోన్ ధరలను అధికారికంగా వెల్లడించలేదు.
Tags : 1