Breaking News

ఐఐటీ డ్రాపౌట్‌ అయినా..మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌లో ఉద్యోగం!

Published on Tue, 06/30/2026 - 10:53

స్టూడెంట్స్‌ ఐఐటీలో సీటు రావడాన్ని ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారో మనకు తెలిసిందే. అందుకోసం అహర్నిశలు కష్టపడతారు. అలాంటిది ఈ యువకుడికి జాక్‌పాట్‌ కొట్టినట్లుగా ప్రతిష్టాత్మక ఐఐటీ ఢిల్లీలోనే చోటు దక్కించుకున్నాడు. కానీ ఆ చదువుని మధ్యలోనే వదిలేశాడు. అయినప్పటికీ ప్రముఖ టెక్‌ దిగ్గజ కంపెనీల్లోనే సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా ఉద్యోగాలు సంపాదించాడు. పైగా ఇలాంటి ఘనతను సృష్టించిన పిన్నవయస్కుడిగా నిలిచాడు. అతడెవరంటే..

ఆ యువకుడే ఆశిష్ కుమార్ వర్మ. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లో సీటు సంపాదించడాన్ని అత్యున్నత విద్యా అవకాశంగా పరిగణిస్తుంది మన దేశం. అలాంటిది ఈ 19 ఏళ్ల వయకుడు, ఐఐటీ ఢిల్లీ విద్యార్థి అయిన ఆశిష్ కుమార్ వర్మ ఓటు వేసే వయసు రాకమునుపే ఆ ప్రముఖ విద్యాసంస్థలో చదువుని మధ్యలోనే ఆపేశాడు. ఆ తర్వాత టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా చేరాడం విశేషం. 

ఈ మేరకు వర్మ తన ప్రయాణాన్ని సోషల్‌ మీడియాలో పంచుకున్నాడు. ఆయన టెక్‌ పరిశ్రమలో విజయానికి అధికారిక డిగ్రీ ఒకటే ఏకైక మార్గమనే ఆలోచనను తిరగరాశాడు. అంత అసాధ్యం అనుకునేదాన్ని సుసాధ్యం చేసి చూపించాడు. పైగా 18 ఏళ్లకే గూగుల్‌ డెవలపర్‌ ఎక్స్‌పర్ట్‌ గుర్తింపు తెచ్చుకుని అతి పిన్న వయస్కుడైన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పేరుతెచ్చుకున్నాడు. ఆ యువకుడి చేతిలో పోర్ట్‌ఫోలియోలో సకురా సైన్స్ ప్రోగ్రామ్ కింద జపాన్‌లో చేపట్టిన సహకార పరిశోధన ప్రాజెక్టులు, అలాగే ఆయన స్వయంగా భారత ప్రధానికి ప్రదర్శించిన ఒక మొబైల్ అప్లికేషన్ ఉన్నాయి. 

 

తనకు ఐఐటీలోని కఠినమైన విద్యా ప్రయాణం అత్యంత పరిమితంగా అనిపించిందని అంటున్నాడు. మనకు వ్యవస్థ ఎప్పటికీ అసాధారణ మార్గం ఇవ్వదు అనేది అబద్ధం అంటున్నారు. యువత ఎప్పుడు ఈ వ్యవస్థను నిందించడం మాని..అపారమైన జ్ఞానాన్ని సంపాదించడానికి బ్యాచిలర్‌, మాస్టర్‌ లేదా పీహెచ్‌డీతో పనిలేదని, మీరు చేయలదలుచుకుంది చేయండి అని చెబుతున్నాడు ఆశిష్‌. తాను C#, టైప్‌స్క్రిప్ట్ వంటి భాషలను నిర్మించడమే గాక మార్గదర్శకుల సాయంతో నేరుగా నేర్చుకునే అవకాశం దక్కించుకున్నానని అంటున్నారు. 

తాను ఒక ఉద్యోగానికి పరిమితం కాకూడదనే గుగూల్‌ డెవలప్పర్‌ ఉద్యోగాన్ని వదిలి మైక్రోసాఫ్ట్‌ ఎకోసిస్టమ్‌లోకి అడుగుపెట్టానని అంటున్నాడు. ప్రస్తుతం ఏఐ, ఓపెన్‌ ఇంటర్నెట్‌లతే హవా..కాబట్టి ఈ కాలంలో సాంప్రదాయ డిగ్రీల కంటే ఆకట్టుకునే టాలెంట్‌, స్కిల్‌, కష్టపడే తత్వానికే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని ఆయన నొక్కి చెప్పారు. ఇక్కడ వర్మ కథ భారతదేశంలోని జెన్-జెడ్ టెక్ ప్రతిభావంతులలో పెరుగుతున్న మార్పును హైలైట్ చేస్తోంది..!.

(చదవండి: ఆమె కారణంగానే ఆ ఉద్యోగం..! ఆవేళ బంగారు గాజులు..)

 

Videos

నిప్పుల కొలిమిగా యూరప్... పిట్టలా రాలిపోతున్న జనాలు!

2029లో మీరు రాజారెడ్డి మనవడిని చూస్తారు..! ఒక్కొక్కడికీ ఊచకోతే..!

జులైలో వానలు! విశాఖ IMD గుడ్ న్యూస్

YS జగన్ ను కలిసిన సింగపూర్ కాన్సులేట్ జనరల్

కేతన్ హత్య కేసులో బయటపడుతున్న కీలక ఆధారాలు.. మరో సంచలన ట్విస్ట్!

మినిమం కామన్ సెన్స్ లేదా... ఏమ్మా హోమ్ మినిస్టర్, ఏం చేస్తున్నావ్..!

High Tension: చంద్రబాబు ఇంటిని ముట్టడి బారు గేట్లు లాగిపడేసిన రైతులు

సాయికృష్ణ కేసులో RMP డాక్టర్ చెప్పిన నమ్మలేని నిజాలు

ఫేస్ యాప్ దుర్వినియోగం? ఉపాధి హామీలో టీడీపీ అక్రమాలు

రికార్డులు బద్దలు కొట్టిన సమంత.. అనుష్కను దాటేసింది!

Photos

+5

అక్కినేని అఖిల్‌ ‘లెనిన్‌’ మూవీ HD స్టిల్స్‌

+5

‘హ్యాంగ్‌మ్యాన్’ మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

‘ఆల్ఫా’ మూవీ ప్రమోషన్‌లో సందడి చేసిన అలియా భట్ (ఫొటోలు)

+5

గ్లామరస్‌గా సింగ్ గీతం బ్యూటీ నివేదా పేతురాజ్.. (ఫోటోలు)

+5

రొట్టెల పండగ : స్వర్ణాల తీరం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

అందాల అదితీ రావు హైదరీ (ఫొటోలు)

+5

రకుల్.. అదిరెన్ నీ సొగసులు! (ఫొటోలు)

+5

లార్డ్స్ మైదానంలో సందడి చేసిన కోహ్లి-ధావన్ ఫ్యామిలీస్! (ఫోటోలు)

+5

ఫ్యామిలీతో హీరోయిన్ మధుబాల స్పెషల్ మూమెంట్స్ (ఫొటోలు)

+5

బాలీవుడ్ భామ ప్రగ్యా కపూర్ బర్త్‌ డే.. తమన్నా సందడి (ఫోటోలు)