జగన్ గురించి ఇంకోసారి పిచ్చిగా వాగితే.. నీ ఇంటికొచ్చి మాస్ వార్నింగ్
Breaking News
Income Tax: నోటీసుకి బదులివ్వండి..
Published on Mon, 06/22/2026 - 11:40
ప్ర. ఆదాయపు పన్ను శాఖ నుంచి ఈ మెయిల్ ద్వారా నాకు నోటీసు వచ్చింది. ఆ నోటీసు మీద ఫిర్యాదు చేయవచ్చా. నేను నోటీసుకి బదులుగా జవాబు నా మెయిల్ ద్వారా ఇవ్వాలా? ఇక ఏదైనా మార్గం ఉందా?
– బీవీ రమణ, ఈ–మెయిల్ ద్వారా
జ. ఆదాయపు పన్ను శాఖ వారు అసెస్సీలకు డైరెక్టుగా వారి వారి రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడీలకు నోటీసులివ్వొచ్చు. అలాగే రిజిస్టర్డ్ ఎస్‌ఎంఎస్‌లకు మెసేజీలు ఇవ్వొచ్చు. మీరు మీ మెయిల్ బాక్స్ ఓపెన్ చేస్తే ఈమెయిల్ నోటీసు కనిపిస్తుంది. అలాగే సెల్‌ఫోన్ ఓపెన్ చేస్తే మెసేజీలు వస్తాయి. కనిపిస్తాయి. సులువుగా చదువుకోవచ్చు. అయితే ఈ రోజుల్లో ఎన్నో ఫేక్ మెయిల్స్ వస్తున్నాయి. జనాల్లో ఒక భయం, దిగులు ఏర్పడుతున్నాయి.
మీరు నోటీసుకు జవాబు ఇచ్చేటప్పుడు అసలు ఆ నోటీసు నిజమైనదా కాదా.. డిపార్టుమెంటు వారి నుంచి అధికారికంగా వచ్చిందా కాదా అనేది చెక్ చేసుకోవచ్చు. అలా చేసుకోవడానికి మీ పాన్, కాగితం రూపంలో వచ్చిన వివరాలు.. అంటే.. నోటీసు, అసెస్‌మెంట్ సంవత్సరం వివరాలు, నోటీసు జారీ చేసిన తేదీ, మీ మొబైల్ నంబరు వివరాలు కావాలి. వారు పంపించే డాక్యుమెంట్ మీద నంబరు ఒక ప్రత్యేకమైన నంబరు ఉంటుంది.. దీన్నే డీఐఎన్ అంటారు.. అంటే డాక్యుమెంట్ ఐడెంటిఫికేషన్ నంబరు. కంప్యూటర్ సిస్టం ద్వారా ఈ నంబరుని జనరేట్ చేస్తారు.
ఉత్తరాల్లో, నోటీసుల్లో, ఉత్తర్వుల్లో ఇతర ఏ ప్రత్యుత్తరమైనా ఈ నంబరు ఉండి తీరాలి. వెంటనే నిర్ధారించండి. అది ఎలాగంటే వెంటనే ఈ–ఫైలింగ్ పోర్టల్‌కి వెళ్లి ‘ఆథెంటికేట్’ విండోకి వెళ్లండి. ఇలా చెక్ చేసుకోవడానికి మీరు లాగిన్ అవ్వక్కర్లేదు. పాస్‌వర్డ్ అక్కర్లేదు. ఇంకొక ఉపశమనం లేదా సడలింపు ఇచ్చారు. రిజిస్టర్డ్ మొబైల్ నంబరు రాయండి. అది లేని పక్షంలో ఇతరత్రా ఏ నంబరు అయినా ఇవ్వొచ్చు. అయితే, మీరు ఏ నంబర్ ఇస్తారో, ఆ నంబరుకే ఓటీపీ వస్తుంది.
ఈ ప్రాసెస్ ద్వారా నోటీసు నిజమా కాదా తెలుస్తుంది. నోటీసులో డీఐఎన్ కనబడకపోయినా/ లేకపోయినా/రాయకపోయినా, చింతించవద్దు. అలాంటి కాగితాలకు జవాబివ్వక్కర్లేదు. నంబరు లేని డాక్యుమెంటు, మీ చేతిలో ఉన్నా మీకు వచ్చినట్లు కాదు.
నోటీసు సిసలైనదే అయితే..
అప్పుడు ఏం చేయాలంటే, పోర్టల్‌లో లాగిన్ అవ్వండి. ‘ఈ–ప్రాసెసింగ్’ సెక్షన్‌కి వెళ్లండి. అక్కడ సెంట్రల్ ప్రాసెసింగ్ సెంటర్ (దీన్నే సీపీసీ అని అంటారు. ఇది బెంగళూరులో ఉంది) పోర్టల్‌కి వెళ్లి ‘పెండింగ్ యాక్షన్స్’ విండోలోకి వెళ్లండి. మీకొచి్చన నోటీసు కనిపిస్తుంది.
మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
🔹మీరు నోటీసుని పట్టించుకోండి. అలక్ష్యం, నిర్లక్ష్యం తగదు.
🔹డీఐఎన్ ఉందా లేదా చెక్ చేయండి.
🔹నోటీసుని చదవండి
🔹ఏ సెక్షన్ ప్రకారం జారీ చేశారో తెలుసుకోండి
🔹అర్థం చేసుకుని, జవాబుకు ప్రిపేరవ్వండి
🔹అది నిజమనిపిస్తే ఒప్పుకోండి
🔹అది తప్పనిపిస్తే ఒప్పుకోకండి
🔹ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా సరైన వివరణ ఇవ్వండి. వివరణతో పాటు డాక్యుమెంట్లు జతపరచండి.
🔹సకాలంలో జవాబు ఇవ్వండి
🔹సకాలంలో ఇవ్వలేని పరిస్థితి ఉంటే, అదనంగా గడువు అడగండి.
🔹మీకు ఏదైనా వివరణ కావాలన్నా, ఉదాహరణగా వాళ్ల ఉత్తర్వులు, అసెస్‌మెంట్ ఆర్డర్ల కాపీలు అడగండి.
🔹డిమాండు చెల్లించవలసిందన్న నోటీసు రాగానే మీరు భయపడి పన్ను చెల్లించనక్కర్లేదు. కొంత మంది డిపార్టుమెంటుతో ఎందుకొచి్చన తిప్పలని, చిన్న చిన్న మొత్తాల విషయంలో ఎటువంటి సంశయం లేకుండా ఒప్పుకుని ఆ డిమాండుని చెల్లిస్తారు. అదొక ఆలోచనా విధానం.
🔹 ఒప్పుకోకపోతే వివరణ, కాగితాలు ఇవ్వండి
🔹మీరు చెప్పేది నిజమైతే, డిపార్టుమెంటు వారు వారి తప్పుని సరిదిద్దుకుంటారు. డిమాండుని విత్‌డ్రా చేసుకుంటారు. ఉత్తర్వులను మారుస్తారు.
చివరగా..: ఆదాయం లెక్కల్లో మారవచ్చు.. పన్ను లెక్కింపుల్లో తప్పు రావొచ్చు.. డాక్యుమెంట్లు.. ముఖ్యంగా పన్ను చెల్లింపులు అప్‌డేట్ కాకపోవచ్చు.. ఎన్నో కారణాలు ఉంటాయి. అసెస్‌మెంట్ ఆర్డరులో ప్రతి అంశం చదవండి. అర్థం చేసుకోండి. నోటీసులు ఇచ్చినందుకు ఫిర్యాదులు చేయరాదు. అడిగే హక్కు వారికి.. చెప్పే బాధ్యత మనకు ఉంది.
Tags : 1