Breaking News

ఏటీఎం నుంచి మనీ విత్‌డ్రా.. EPFOనుంచి కీలక అప్‌డేట్‌ వచ్చేసింది

Published on Thu, 06/18/2026 - 18:29

ఈపీఎఫ్‌వో సభ్యులకు శుభవార్త. త్వరలోనే ఏటీఎం సెంటర్ల ద్వారా, అలాగే యూపీఐ యాప్‌ల ద్వారా పీఎఫ్‌ విత్‌డ్రా చేసుకునే అవకాశం అందుబాటులోకి రానుంది. జాతీయ మీడియా కథనాల ప్రకారం, ఈ నెలాఖరులో లేదా వచ్చే నెల ప్రారంభంలో ఈ సౌకర్యం అమలు కానుంది. ఇటీవల కార్మిక శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ కూడా ఒక కార్యక్రమంలో ఈ విషయాన్ని వెల్లడించారు. అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది.

ఈపీఎఫ్‌వో 3.0లో సభ్యులు తమ ఈపీఎఫ్‌ బ్యాలెన్స్‌లో 75 శాతం వరకు తక్షణ ఉపసంహరణ చేసుకునే అవకాశం ఉంటుంది. ఏటీఎం లేదా యూపీఐ ద్వారా రోజుకు రూ.10,000 వరకు ఉపసంహరించుకోవచ్చు. రూ.5 లక్షల వరకు క్లెయిమ్‌లు ఆటోమేటిక్‌గా మూడు రోజుల్లో ఆమోదం పొందుతాయి. ఇంతకు ముందు ఈ ప్రక్రియకు 7నుంచి 20 రోజుల సమయం పట్టేది. ఇప్పుడు ఏఐ ఆధారిత సిస్టమ్ ద్వారా వేగంగా క్లెయిమ్‌లు సెటిల్ అవుతాయి. అత్యవసర పరిస్థితుల్లో ఉద్యోగులకు తక్షణ ఆర్థిక సహాయం అందించడమే దీని లక్ష్యం.

ఉద్యోగం మారినప్పుడు పీఎఫ్‌ మొత్తాన్ని కొత్త ఖాతాకు మార్చుకోవడానికి ఇంతకు ముందు ఫారమ్‌ 13 నింపాల్సి వచ్చేది. ఇకపై ఈ ప్రక్రియ పూర్తిగా ఆటోమేటిక్‌గా జరుగుతుంది. ఉద్యోగి కొత్త సంస్థలో చేరిన వెంటనే పీఎఫ్‌ ఖాతా ఆటోమేటిక్‌గా ట్రాన్స్‌ఫర్ అవుతుంది. అదే విధంగా, సభ్యులు తమ పేరు, పుట్టిన తేదీ, ఇతర వ్యక్తిగత వివరాలను ఆధార్‌ ఆధారంగా స్వయంగా సరిచేసుకోవచ్చు. ఇంతకు ముందు ఈ మార్పులకు ఉద్యోగి,యజమాని ఇద్దరూ కలిసి జాయింట్‌ డిక్లరేషన్‌ ఇవ్వాల్సి వచ్చేది.

ఈ కొత్త సౌకర్యాలతో ఉద్యోగులకు పేపర్‌వర్క్ తగ్గుతుంది, క్లెయిమ్ సెటిల్‌మెంట్ వేగవంతమవుతుంది, పీఎఫ్‌ ట్రాన్స్‌ఫర్ సులభతరం అవుతుంది. పెన్షన్ చెల్లింపుల్లో కూడా పారదర్శకత పెరుగుతుంది. అయితే, అన్ని ఫీచర్లు దశలవారీగా అమలు అవుతున్నాయి. ప్రస్తుతం యూపీఐ ఆధారిత ఉపసంహరణలు కొంతమంది సభ్యులకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

పెన్షన్ ఉపసంహరణకు సంబంధించి కొత్త నియమాలు కూడా అమలులోకి వచ్చాయి. ఉదాహరణకు, 36 నెలల నిరుద్యోగం తర్వాత మాత్రమే పెన్షన్ ఉపసంహరణ చేసుకోవచ్చు. ఈపీఎఫ్‌వో 3.0తో ఉద్యోగులకు అత్యవసర పరిస్థితుల్లో తక్షణ ఆర్థిక సహాయం, వేగవంతమైన సేవలు, మరింత పారదర్శకత లభించనున్నాయి. 

Videos

5000 మంది చొరబాటుదారులకు చుక్కలు.. సరిహద్దుల్లో భారత ఆర్మీ విశ్వరూపం!

నైజర్‌లో ఉగ్రదాడి.. 13 మంది మృతి

వైఎస్ జగన్ రాకతో CI నాగరాజుపై కేసు నమోదు

సాయి కృష్ణ ఇంటికి ACP.. జగన్ దెబ్బకు దిగొచ్చిన పోలీసులు

తెలంగాణ కేబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే!

మహేశ్.. వారణాసి.. ఇలా అయిందేంటి?

సాయికృష్ణ కేసు వెనుక.. జనం తిరగబడితే తట్టుకోలేరు.. చివరికి జరిగేది ఇదే..

అనుమానపు మొగుడు.. చిత్రహింసలు పెట్టి చంపేశాడు

సాయికృష్ణ కేసులో కీలక పరిణామం.. సీఐ నాగరాజుపై మర్డర్ కేసు..!

అరేయ్ ప్రభాకర్.. నీకు నిజంగా దమ్ముంటే ఇప్పుడు రా ఈడ్పుగంటి శ్రీనివాసబాబు వార్నింగ్

Photos

+5

ఫిఫా వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో నటి నోరా ఫ‌తేహి సంద‌డి (ఫొటోలు)

+5

రాజసొబగులతో మెరిసిన రాయల్ ఆస్కట్ 2026 (ఫొటోలు)

+5

మొనాకో వేకేషన్‌లో లైగర్ భామ అనన్య పాండే.. ఫోటోలు

+5

డైమండ్‌లా మెరిసిపోతున్న డీజే టిల్లు భామ నేహా శెట్టి.. (ఫొటోలు)

+5

కడప గడపలో క్రికెట్ సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ పలు ప్రాంతాల్లో దంచికొట్టిన వర్షం (ఫొటోలు)

+5

సాయికృష్ణ తల్లి విజయలక్ష్మికి వైఎస్‌ జగన్‌ పరామర్శ (ఫొటోలు)

+5

హాలీడే ట్రిప్‌లో సినీ ప్రేమజంట (ఫొటోలు)

+5

హీరోయిన్ శ్రీదేవి ఇంట్లో శుభకార్యం (ఫొటోలు)

+5

పూరీ జగన్నాథ్ కూతురి లేటెస్ట్ లుక్ (ఫొటోలు)