వనజ చితాభస్మంలో సర్జికల్ సీజర్.. నర్సులే డెలివరీ చేశారా?
Breaking News
ఉద్యోగం పోయాక బంపరాఫర్.. డబుల్ శాలరీతో కొత్త జాబ్!
Published on Thu, 06/18/2026 - 17:32
ఉద్యోగం కోల్పోవడం అనేది చిన్న విషయం కాదు, సదరు వ్యక్తి ఆర్ధిక పరిస్థితి దెబ్బ తింటుంది. చాలా మందికి జీవితంలో ఒక పెద్ద షాక్ తగిలినట్లు అనిపిస్తుంది. కానీ కొన్నిసార్లు అదే పరిస్థితి కొత్త అవకాశాలకు కూడా తలుపులు తెరుస్తుంది. అలాంటి అనుభవాన్నే ఓ ఉద్యోగి సోషల్ మీడియాలో పంచుకుని నెటిజన్ల దృష్టిని ఆకర్షించాడు.
దాదాపు నాలుగున్నరేళ్లుగా ఒకే కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగి, తక్కువ జీతంతో కొనసాగుతున్నప్పటికీ.. సంస్థ పట్ల చాలా విధేయతతో వ్యవహరించాడు. అయితే కంపెనీ చేపట్టిన పునర్వ్యవస్థీకరణ (Restructuring) ప్రక్రియలో భాగంగా అతడిని ఉద్యోగం నుంచి తొలగించింది.
సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన విషయాల ప్రకారం.. అతను ఒక ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలో పనిచేస్తూ నెలకు సుమారు రూ.70 వేల జీతం పొందేవాడు. నాలుగున్నరేళ్ల సేవ చేసినప్పటికీ సరైన వేతన పెంపులు లేకపోవడంతో అదే జీతం వద్ద కొనసాగాడు. ఉద్యోగం కోల్పోయిన సమయంలో ఉద్యోగ విరమణ పరిహారం చెల్లింపు విషయంలో హెచ్‌ఆర్‌తో వాగ్వాదం కూడా జరిగిందని వెల్లడించాడు.

అయితే ఆశ్చర్యకరంగా, తన చివరి పని రోజునే మరో కంపెనీ నుంచి జాబ్ ఆఫర్ వచ్చింది. అది కూడా పూర్తిగా వర్క్ ఫ్రమ్ హోమ్. జీతం కూడా నెలకు రూ.1.58 లక్షలు అని వెల్లడించాడు. దీంతో అతని ఆదాయం ఒక్కసారిగా రెండింతలకు పైగా పెరిగింది. వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం ఉండటంతో ప్రయాణ ఖర్చులు, ఇతర ఖర్చులు కూడా తగ్గినట్లు పేర్కొన్నాడు. జీతం ఒక్కసారిగా అంత పెరుగుతుందని ఊహించలేదని ఉద్యోగి చెప్పాడు. ఇది కలలా అనిపిస్తోందని అన్నాడు.
ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. వేలాది మంది దీనిపై స్పందిస్తూ ఉద్యోగికి శుభాకాంక్షలు తెలిపారు. చాలామంది 'ఉద్యోగంలో విధేయత కంటే నైపుణ్యానికి సరైన విలువ దక్కే చోటుకు మారడం మంచిది' అని సూచించారు. ఒక నెటిజన్ 'ప్రతి రెండు లేదా రెండున్నరేళ్లకు ఉద్యోగం మార్చడం మంచిది. విధేయతకు ఈ రోజుల్లో పెద్దగా విలువ లేదు' అని వ్యాఖ్యానించగా, మరొకరు 'నేను కూడా రూ.50 వేల జీతం నుంచి ఉద్యోగం మారి ఇప్పుడు రూ.1.1 లక్షలు పొందుతున్నాను' అని తెలిపారు.
ఇదీ చదవండి: ట్రైన్ టికెట్ బుక్ చేస్తున్నారా.. ఈ విషయాలు తెలుసా?
Tags : 1