Breaking News

హెల్త్‌... లీసా రే ఆఫ్‌ హోప్‌

Published on Thu, 06/18/2026 - 03:12

లీసారే అనే పేరు వింటే వెంటనే గుర్తు రాక పోవచ్చేమో కానీ టక్కరి దొంగ’లో మహేశ్‌ బాబు హీరోయిన్‌ అంటే ఠక్కున గుర్తొస్తుంది. బోంబే డైయింగ్‌ బ్రాండ్‌ మోడల్‌గా ఒకనాడు ఫ్యాషన్‌ ప్రపంచపు క్వీన్‌గా వెలుగొందిన ఈ జన్మతః కెనడియన్‌ బ్యూటీ... బాలీవుడ్, హాలీవుడ్‌ నటిగా, టీవీ కార్యక్రమాల హోస్ట్‌గా, రచయిత్రిగా అనేక పాత్రల్లో నిర్విరామంగా రాణిస్తూనే ఉన్నారు.

చాలా చిన్న వయసులోనే బ్లడ్‌ క్యాన్సర్‌ బారిన పడిన లీసా రే దానిని జయించడంతో పాటు ఆ తర్వాత పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకు తల్లిగా మారి... రెట్టించిన ఉత్సాహంతో విభిన్న రంగాల్లో దూసుకు పోతున్నారు. వ్యక్తిగత జీవితానుభవాల నుంచి వచ్చిన ఆలోచనలతో ఇటీవలే మధ్య వయసు మహిళల ఆరోగ్య సమస్యలు చికిత్సా కార్యక్రమాల కోసం ‘నూహెర్‌’ను ప్రారంభించారు. ఈ సంస్థ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్‌ వచ్చిన సందర్భంగా ఆమె సాక్షితో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే...

నూహెర్‌’ ఆవిర్భావానికి ప్రేరణ అదే...
క్యాన్సర్‌ చికిత్స సమయంలో కీమోథెరపీ ఫలితంగా, 37 ఏళ్ల వయసులోనే మెనోపాజ్‌ దశలోకి ప్రవేశించాను. హార్మోన్ల మార్పుల సహా నా శరీరంలోకి చొచ్చుకుని వచ్చే అనారోగ్యాల్ని అర్థం చేసుకునే అవగాహన లేక అలసట, నిద్రలేమి, మతిమరుపు నీరసం వంటివన్నీ బతకడానికి చెల్లించాల్సిన మూల్యంలా మారాయి. అయితే పెరిమెనోపాజ్‌ను ఎదుర్కొంటున్న స్నేహితులతో సంభాషణల ద్వారా, చాలామంది  ఇదే గందరగోళంలో ఉన్నారని గ్రహించాను.

అప్పుడే ’నూహెర్‌’ ఆవిర్భవించింది. మన దగ్గర మధ్యవయస్సు ఆరోగ్యంపై మౌనం తరతరాల వారసత్వంగా మారింది. చర్చించడానికి ఇబ్బందిపడే  విషయాలలో మెనోపాజన్ ఒకటి. ఒక మహిళ విలువ ఆమె పునరుత్పత్తి వయస్సుతో ముడిపడి ఉంటుందనే భావన. అందుకే చాలామంది మహిళలు అసౌకర్యాన్ని భరించడానికి అలవాటుపడ్డారు.

శరీరంపై అవగాహన మార్చిన క్యాన్సర్‌...
నా శరీరంతో నాకున్న సంబంధాన్ని క్యాన్సర్‌ సమూలంగా మార్చేసింది. దానికిముందు, నా జీవితంలో ఎక్కువ భాగం బాహ్య రూపానికే ప్రాధాన్యతనిస్తూ గడిచింది. స్త్రీత్వం అనేది యవ్వనం, సంతానోత్పత్తి లేదా రూపంతో నిర్వచించేది కాదని గ్రహించాను. నిజమైన బలంలో భావోద్వేగ, మానసిక  శారీరక ఆరోగ్యం ఇమిడి ఉంటాయని నా అనుభవం నాకు నేర్పింది.

వృద్ధాప్యం సమస్య కాదు...
యవ్వనాన్నే అందానికి ఏకైక కొలమానంగా భావించే సంస్కృతిలో జీవిస్తున్నాం, కానీ అందం కాలక్రమేణా మారుతుందని నేను నమ్ముతాను. మహిళలు... వృద్ధాప్యం అనేది పరిష్కరించాల్సిన సమస్య కాదని గుర్తించడమే మొదటి అడుగు. మీ విలువ ఎప్పటికీ యవ్వనంగా కనిపించడంతోనే ముడిపడి లేదని అర్థం చేసుకోవడం నుంచే ఆత్మవిశ్వాసం వస్తుంది. అందుకే నేను  ‘వృద్ధాప్యాన్ని ప్రోత్సహించడం‘ గురించి మాట్లాడుతుంటాను, మనం అసాధ్యమైన ప్రమాణాలను వెంబడించడం కంటే జీవశక్తిని ఆస్వాదించాలని నమ్ముతాను.

మహిళలూ మిమ్మల్ని మీరు గుర్తించండి...
ఎంతోమంది మహిళలు దశాబ్దాల పాటు ఇతరుల అవసరాలకే ప్రాధాన్యతనిస్తూ, లక్షణాలు విస్మరించలేనంత తీవ్రమయ్యే వరకు తమ ఆరోగ్య సమస్యల్ని వాయిదా వేస్తూ ఉంటారు తమను తాము జాగ్రత్తగా చూసుకోవడం స్వార్థం కాదు, అది అత్యవసరం. మధ్యవయస్సు అనేది  మిమ్మల్ని మీరు పునఃసమీక్షించుకోవడానికి మీపై మీరు పెట్టుబడి పెట్టడానికి వచ్చిన సందర్భం. మీరు ప్రతిరోజూ ఇతరులకు ఇచ్చే అదే శ్రద్ధ, ఆప్యాయత, కరుణ  పొందడానికి మీరు కూడా అర్హులని గుర్తించండి.

నా మానసిక ఆరోగ్యం... వ్యాపకాల్లోనే...
యోగా, ధ్యానం ప్రకృతిలో  గడపడం వంటివి నాకు అమూల్యమైన సందర్భాలు.  ఇతరుల ఆమోదం కంటే సహజత్వాన్ని ఎంచుకోవడం నాకు అలవాటైంది. బాహ్య గుర్తింపు అశాశ్వతమైనదని జీవితం నాకు నేర్పింది. మిమ్మల్ని నిలబెట్టేది బలమైన అంతర్గత జీవితం, అర్థవంతమైన సంబంధాలు ఒక లక్ష్య స్పృహ.

విజయం అంటే?
కీర్తి అశాశ్వతమైనది. మనం ఎంచుకున్న విలువలకు అనుగుణంగా జీవిస్తున్నానా? నా పని అర్థవంతమైన మార్పును తీసుకువస్తుందా లేదా?అదే ఇప్పుడు నాకు ముఖ్యం. నేను అనుభవించిన లేదా పంచుకున్న ఏదైనా విషయం మరో మహిళ ఒంటరితనాన్ని తగ్గించుకోవడానికి, మరింత సమాచారం తెలుసుకోవడానికి లేదా మరింత సాధికారత పొందడానికి సహాయపడితే, అది అపారమైన సంతృప్తిని ఇస్తుంది. ప్రపంచానికి ఏదైనా అర్థవంతమైన దానిని అందిస్తూ, యథార్థంగా జీవించే స్వేచ్ఛను కలిగి ఉండటమే విజయం. ప్రస్తుతానికి, నా దృష్టి వినోదానికి అతీతంగా రచన, ‘నూహెర్‌’ ద్వారా మహిళల ఆరోగ్య పరిరక్షణ, వంటి ప్రాజెక్ట్‌లపైనే ఉంది. నాకు రచనపై కూడా చాలా ఆసక్తి ఉంది. నా కవితా సంకలనం త్వరలో ప్రచురితం కానుంది.
– సత్యబాబు, సాక్షి, హైదరాబాద్‌

Videos

Ambati: వీళ్ళందరూ హంతకులే..!

యుద్ధం మొదలవుతుంది..!చైనా వాడు పాకిస్థాన్ ను కుక్కలా పెంచుకుంటున్నాడు..!

సాయి కృష్ణను ఎలా ఎప్పుడు చంపారో మొత్తం చెప్పిన జడ శ్రవణ్

రూ.40 లక్షలు ఇప్పిస్తా, రాజీ చేసుకోండి అంటూ జనసేన నేతలు బెదిరించారు

రికార్డెన అసలు నిజం, విచారణలో బయటకు రాబోతున్న సంచలన నిజాలు..!

వనజ చితాభస్మంలో సర్జికల్ సీజర్.. నర్సులే డెలివరీ చేశారా?

గుడివాడకు నోటీస్ ఇచ్చిన హోం మంత్రి, సాయికృష్ణ కేసు మీద డీజీపీ, సీపీకి ఎందుకు ఇవ్వలేదు

సచిన్ దరిదాపుల్లోకి కూడా వైభవ్ రాలేడు ఎందుకంటే.. మాజీ సెలెక్టర్ సంచలన వ్యాఖ్యలు

హోటల్లో రెండు రోజులు చిత్రహింసలు పెట్టి CIకి అప్పగించారు..! అంబటి షాకింగ్ కామెంట్స్

అనితను ఛీ కొడుతున్న టీడీపీ కీలక నేతలు?

Photos

+5

విద్యార్థుల భద్రతపై దృష్టి సారించాలి: సీపీ సజ్జనార్‌ (ఫొటోలు)

+5

త్రిష కంటే ఎక్కువ హైలైట్.. సోషల్ మీడియాలోనూ ఈమెనే ట్రెండింగ్ (ఫొటోలు)

+5

'పెద్ది' రిజెక్ట్ చేసి.. ఇప్పుడు హీరోని డామినేట్ చేసి.. ఈమె ఎవరంటే? (ఫొటోలు)

+5

కాజల్ అగర్వాల్ బర్త్ డే.. ఫ్యామిలీతో క్యూట్ (ఫొటోలు)

+5

హీరోయిన్ సోనమ్ కపూర్ ఫ్యామిలీ మూమెంట్స్ (ఫొటోలు)

+5

సీతాకోక చిలుకలా డ్రాగన్ బ్యూటీ కయాదు లోహర్.. ఫోటోలు

+5

ఫిఫా వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో నటి నోరా ఫ‌తేహి సంద‌డి (ఫొటోలు)

+5

రాజసొబగులతో మెరిసిన రాయల్ ఆస్కట్ 2026 (ఫొటోలు)

+5

మొనాకో వేకేషన్‌లో లైగర్ భామ అనన్య పాండే.. ఫోటోలు

+5

డైమండ్‌లా మెరిసిపోతున్న డీజే టిల్లు భామ నేహా శెట్టి.. (ఫొటోలు)