Breaking News

ఆ చెట్లు కొట్టాలంటే... అటవీ శాఖ అనుమతి తప్పదు!

Published on Wed, 06/17/2026 - 01:25

మేము హైద్రాబాద్‌లోని ఒక సొసైటీలో ఉంటాము. ఇటీవల వచ్చిన గాలి వానలకు మా పక్క విల్లా ముందు రెండు చెట్లు పడిపోయాయి. మొత్తం కాలనీలో ఇంకా 25 చెట్లు ఉన్నాయి. అవి ఎవరి మీద అయినా పడితే గాయాలు కావచ్చనీ, వాటిని తీసేయమని సొసైటీ వారిని అడగగా, వారు అందుకు ప్రభుత్వం నుంచి పర్మిషన్‌ తీసుకోవాలి, చాలా ఆలస్యం అవుతుంది అంటున్నారు. నిజమేనా? మేం ఏం చేయాలి? సలహా ఇవ్వగలరు. 
– సావిత్రి, హైదరాబాదు

మీ సొసైటీ వారు చెప్పింది నిజమే. అడవిలోనే కాదు సిటీలో, మీ ఇంట్లో ఉన్న పెద్దచెట్లు ఏవి కొట్టించాలనుకున్నా కూడా వాటర్, ల్యాండ్‌ అండ్‌ ట్రీస్‌ యాక్ట్‌ (నీరు, భూమి, వృక్షాల చట్టం – WALTA) చట్టం కింద అటవీశాఖ వారి అనుమతి తీసుకోవాలి. కేవలం వృక్షాల కొమ్మలు కొట్టేయాలన్నా కూడా నగర పాలక సంస్థ అనుమతి తీసుకోవాలి. తెలంగాణ – ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలలో నీటి నిల్వలు, భూమి దుర్వినియోగం, వృక్ష సంరక్షణ కోసం ఏర్పాటు చేసిన మంచి చట్టం WALTA. అయితే ప్రతి ఒక్క వృక్షానికి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు. యూకలిప్టస్‌ (జామాయిలు), అశోకచెట్లు, తెలంగాణ ఫారెస్ట్‌ ప్రొడ్యూస్‌ (transi) రూల్స్, 1970 లోని చెట్లు/వృక్షాలు మినహాయించబడ్డాయి. 

ఇలా మినహాయింపు ఉన్న చెట్లను కొట్టేయాలి అంటే స్వీయ ధ్రువీకరణ పత్రం (self declaration) జత పరిచి, అటవీ శాఖకు నిర్దిష్ట ఫార్మ్‌ 13-A  ద్వారా తెలియజేయాలి. టేకు, ఎర్ర చందనం, రోజ్‌వుడ్‌ మొదలగు చెట్లు కొట్టేయాలంటే అటవీ శాఖకు దరఖాస్తు చేసి –ఆ శాఖవారు పర్యవేక్షించి అనుమతి ఇచ్చేంత వరకూ వేచి చూడాల్సిందే. మీరు ఎందుకు చెట్లు కొట్టేయాలి అనుకుంటున్నారు, కొట్టేస్తున్న చెట్లకు ప్రత్యామ్నాయంగా చెట్ల ఏర్పాటుకి రుసుము కట్టారా లేదా – అని కూడా చూపాల్సి వస్తుంది. కాబట్టి మీ కాలనీలోని చెట్లకు మినహాయింపు వుందేమో చూడండి. మినహాయించబడ్డ జాబితాలోని చెట్లయితే పైన సూచించిన సులభ పద్ధతి వుంటుంది.

– శ్రీకాంత్‌ చింతల, హైకోర్టు న్యాయవాది

మీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాల కోసం sakshifamily3@gmail.com కు మెయిల్‌ చేయవచ్చు. 
 

Videos

వైఎస్ జగన్ రాకతో CI నాగరాజుపై కేసు నమోదు

సాయి కృష్ణ ఇంటికి ACP.. జగన్ దెబ్బకు దిగొచ్చిన పోలీసులు

తెలంగాణ కేబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే!

మహేశ్.. వారణాసి.. ఇలా అయిందేంటి?

సాయికృష్ణ కేసు వెనుక.. జనం తిరగబడితే తట్టుకోలేరు.. చివరికి జరిగేది ఇదే..

అనుమానపు మొగుడు.. చిత్రహింసలు పెట్టి చంపేశాడు

సాయికృష్ణ కేసులో కీలక పరిణామం.. సీఐ నాగరాజుపై మర్డర్ కేసు..!

అరేయ్ ప్రభాకర్.. నీకు నిజంగా దమ్ముంటే ఇప్పుడు రా ఈడ్పుగంటి శ్రీనివాసబాబు వార్నింగ్

ఇక నా కొడుకు లేడయ్యా... సాయి కృష్ణ తల్లిని ఓదార్చిన YS జగన్

నా చావుకు CI నాగరాజే కారణం.. క్రాంతి కుమార్ సెల్ఫీ వీడియో

Photos

+5

మొనాకో వేకేషన్‌లో లైగర్ భామ అనన్య పాండే.. ఫోటోలు

+5

డైమండ్‌లా మెరిసిపోతున్న డీజే టిల్లు భామ నేహా శెట్టి.. (ఫొటోలు)

+5

కడప గడపలో క్రికెట్ సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ పలు ప్రాంతాల్లో దంచికొట్టిన వర్షం (ఫొటోలు)

+5

సాయికృష్ణ తల్లి విజయలక్ష్మికి వైఎస్‌ జగన్‌ పరామర్శ (ఫొటోలు)

+5

హాలీడే ట్రిప్‌లో సినీ ప్రేమజంట (ఫొటోలు)

+5

హీరోయిన్ శ్రీదేవి ఇంట్లో శుభకార్యం (ఫొటోలు)

+5

పూరీ జగన్నాథ్ కూతురి లేటెస్ట్ లుక్ (ఫొటోలు)

+5

అనార్కలి.. చీర.. కుర్తా.. ఏదైనా సరే మృణాల్ తర్వాతే (ఫొటోలు)

+5

ఈ హీరోయిన్‌ని గుర్తుపట్టారా? తెలుగులో ఒకే సినిమా చేసింది(ఫొటోలు)