5000 మంది చొరబాటుదారులకు చుక్కలు.. సరిహద్దుల్లో భారత ఆర్మీ విశ్వరూపం!
Breaking News
ఏరోస్పేస్ ఉద్యోగాన్ని వదిలి కేఫ్..! ఏడాదికి రూ. 1.44 కోట్లు..
Published on Tue, 06/16/2026 - 15:51
ఇస్రోలో ఏరోస్పేస్ ఇంజనీర్ ఉద్యోగాన్ని వదలుకుని మరి కేఫ్ పెట్టింది. అదికూడా ఆహార వృధాను అరికట్టేలా ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారం అందించేలా పెట్టడం విశేషం. అధిక జీతం వచ్చే మంచి ఉద్యోగానికి కాదనుకుని మరీ పర్యావరణ హితమైన వ్యాపారం మొదలుపెట్టడమే కాదు అందరూ శెభాష్ అని మెచ్చుకునేలా సక్సెస్‌ని అందుకుంది. పైగా పర్యావరణ హితమైన వ్యాపారాలు చేయడం ఎలాగో యువత తెలసుకునేలా ఆదర్శంగా నిలిచిందామె.
ఆ అమ్మాయే అహ్మదాబాద్‌కు చెందిన నిష్టా చౌహాన్. ఆమె గతంలో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రోలో ఏరోస్పేస్ ఇంజనీర్‌గా పనిచేసిందామె. ఆ ఉన్నతోద్యోగాన్ని వదిలి మరి మిల్లెట్ కేఫ్‌ని ప్రారంభించింది. ఆమె చిరుధాన్యాలు స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇస్తూ ఈ కేఫ్‌ని ప్రారంభించింది. ఆ కేఫ్ పేరే ఆరంభ్. విలువలను ప్రతిబింబించే వ్యాపారంతో అందర్నీ ఆకట్టుకుంటోందామే.
మొదట్లో ఆమె నిర్ణయాన్ని కుటుంబసభ్యులు వ్యతిరేకించినా..ఆమె అందుకున్న సక్సెస్‌ని చూసి సాధించావ్ అంటూ ప్రశంసించడం విశేషం. ఏ కేఫ్ అయిన ట్రెండీ మెనూలతో కస్టరమర్లను ఆకట్టుకుంటే..ఈ కేఫ్ మాత్రం ఆహారం గురించి ప్రజలు ఆలోచించే విధానాన్ని మార్చాలనే ఉద్దేశ్యంతో పెట్టింది నిష్టా. ఇక్కడ అన్ని డెజర్ట్‌లు హెల్దీగా చేసినవే. ముఖ్యంగా రాగులు, సజ్జలు వంటి చిరుధాన్యలతో చేసిన వంటకాలే కనువిందు చేస్తాయి.
అంతేగాదు ఆహార వ్యర్థాలను సైతం తిరిగి వినియోగించుకునేలా కిచెన్‌ని రూపొందించడం విశేషం. ఈ కేఫ్‌లో టన్నుల కొద్దీ చెత్త డంప్‌యార్డ్‌లకు వెళ్లదు. సింపుల్‌గా చెప్పాలంటే ఆహార వ్యర్థాల సంస్కృతిని సవాలు చేసే జీరో-వేస్ట్ కేఫ్ ఇది. లోపలకి అడుగుపెట్టగానే ఇది మాములు కేఫ్ కాదని ఇట్టే తెలిసిపోతుంది. ఇక్కడ మంచి ఆహార అలవాట్లను ప్రోత్సహిస్తూ..ప్రతి గింజను, ప్రతి ఆకును, ప్రతి నీటి చుక్కను అత్యంత గౌరవప్రదంగా ఉపయోగిస్తారు నిర్వాహకులు.
అలాగే ప్లాస్టిక్ వాడకం ఉండదు. నిష్టా కేఫ్ ఆరంభ్ చాలా సృజనాత్మకతతో పర్యావరణ హితంగా ఆహార వృధాకు తావులేకుండా వ్యర్థాలను పునర్వినియోగించడంతో కొద్దికాలంలోనే అత్యంత ప్రజాదరణ పొందింది. పైగా నెలకు రూ. 12 లక్షలు ఆర్జనతో ఏడాదికి రూ. 1.44 కోట్లు టర్నోవర్ పలుకుతుండటం విశేషం. అంతేగాదు ఈ కేఫ్ చిన్నారుల కోసం వర్క్‌షాపుల కూడా నిర్వహిస్తుంటుందట.
ఈ వర్క్‌షాపులలో యువతను ఆహారంతో ప్రత్యక్షంగా మమేకమయ్యేలా చేస్తూ..కూరగాయలు ఎలా పండుతాయ్, మట్టిని ఎలా కాపాడుకోవాలి, సుస్థిర వ్యవసాయ పద్ధతులను ఎలా అర్థం చేసుకోవాలి వంటి వాటి గురించి వివరిస్తుంటారు. పైగా వాళ్లకు చిరుధాన్యలతో స్వయంగా వంటకాలు ఎలా తయారు చేసుకోవాలో నేర్పిస్తుంటారట కూడా. అంతేగాదు విలువలకు అనుగుణంగా ఉండే వ్యాపారం ఏ నాటికైనా విజయం సాధిస్తుందని నిరూపించింది నిష్టా.
Most cafes chase menus.
This one chased a mission.
Inside a small cafe in Ahmedabad, something different is cooking.
Not just food. A mindset shift.
Nishtha Chauhan left a high-paying aerospace job.
To build something most people thought was risky — a zero-waste, millet-first… pic.twitter.com/fdf8mFOHhx— The Better India (@thebetterindia) June 12, 2026
(చదవండి: ఆ డ్రైవర్ ఊహించని 'రైడ్ మెనూ'..! ఆ 45 నిమిషాల రైడ్ ఆమెకు..)
Tags : 1