Breaking News

మోటోరోలా సరికొత్త ‘5జీ’ స్మార్ట్‌ఫోన్లు!

Published on Sun, 06/14/2026 - 09:50

న్యూఢిల్లీ: భారత్‌లో లీడింగ్‌ కృత్రిమ మేధ (ఏఐ) స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్‌ ‘మోటోరోలా’ దేశీయ మార్కెట్లోకి సరికొత్త ఫీచర్లతో రెండు 5జీ స్మార్ట్‌ఫోన్లను ప్రవేశపెట్టింది. ‘మోటో జీ37’, ‘మోటో జీ37 పవర్‌’ పేర్లతో వస్తున్న మోడళ్లపై పరిమిత కాల ప్రత్యేక ఆఫర్లను ప్రకటిస్తూ, భారీ డిస్కౌంట్లను అందుబాటులోకి తెచ్చింది. వినియోగదారుల బడ్జెట్‌కు తగినట్లుగా అత్యంత తక్కువ ధరకే ప్రీమియం తరహా ఫీచర్లు, అత్యుత్తమ బ్యాటరీ పర్ఫార్మెన్స్, మిలిటరీ గ్రేడ్‌ ల్యాబ్‌ సర్టిఫైడ్‌ రక్షణతో ఈ ఫోన్లను తీసుకొచి్చనట్లు కంపెనీ పేర్కొంది. ఈ స్మార్ట్‌ఫోన్లు ఆకర్షణీయమైన పాంటోన్‌ కలర్‌ ఆప్షన్లలో లభిస్తాయి.  

ఫీచర్లు ఇవే 
మోటో జీ37, మోటో జీ37 పవర్‌.. ఈ రెండు ఫోన్లలోనూ 120హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో కూడిన భారీ 6.7 అంగుళాల డిస్‌ప్లేను అందించారు. సినిమాటిక్‌ ఆడియో అనుభూతిని అందించే వినూత్నమైన ‘డాల్బీ అట్మోస్‌’ స్టీరియో స్పీకర్లు ఉన్నాయి. ఫోటోగ్రఫీ కోసం గూగుల్‌ ఏఐ ఎడిటింగ్‌ టూల్స్‌ సపోర్ట్‌ చేసే ‘50ఎంపీ క్వాడ్‌ పిక్సెల్‌ ఏఐ కెమెరా’ను ఈ రెండు మోడళ్లలోనూ అమర్చారు.  ముఖ్యంగా ‘మోటో జీ37 పవర్‌’ ఫోన్‌లో మూడు రోజుల పాటు నిరంతరాయంగా పనిచేసే భారీ 7000ఎంఏహెచ్‌ బ్యాటరీ, 33డబ్ల్యూ టర్బోపవర్‌ ఛార్జింగ్‌ సదుపాయం ఉన్నాయి. అలాగే ఇందులో శక్తివంతమైన మీడియాటెక్‌ డైమెన్సిటీ 6400 ప్రాసెసర్, 128జీబీ స్టోరేజ్, గరిష్టంగా 24జీబీ వరకు ర్యామ్‌ బూస్ట్‌ చేసుకునే ఆప్షన్‌ అందించారు. దీనికి రక్షణగా స్క్రీన్‌ పై గొరిల్లా గ్లాస్‌ 7ఐ, ఎంఐఎల్‌–ఎస్‌టీడీ–810 హెచ్‌ మిలిటరీ గ్రేడ్‌ సరి్టఫికేషన్,  ఐపీ64 వాటర్‌–రెసిస్టెంట్‌ డిజైన్‌ ఉన్నాయి. స్మార్ట్‌ యూజర్‌ అనుభూతి కోసం గూగుల్‌ ‘జెమిని’, ‘సర్కిల్‌ టు సెర్చ్‌’ వంటి ఏఐ ఫీచర్లు ఇందులో ఇన్‌బిల్ట్‌గా వస్తాయి.

ధరల విషయానికొస్తే: మోటో జీ37 బేసిక్‌ మోడల్‌ ప్రత్యేక పరిమిత కాల ఆఫర్‌ ధర రూ.13,999 గా ఉంది (దీని అసలు ధర రూ.14,999). ఇక ‘మోటో జీ37 పవర్‌’ మోడల్‌ 4జీబీ+128జీబీ వేరియంట్‌ ప్రారంభ ధర రూ.15,999 గా ఉండగా , దీని టాప్‌ వేరియంట్‌ (8జీబీ+128జీబీ) అసలు ధర రూ.21,999 కాగా.. రూ.2,000 బ్యాంక్‌ ఆఫర్‌తో రూ.19,999 కే లభిస్తుంది. వినియోగదారులు ఈ ఫోన్లను ఈ–కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌ ఫ్లిప్‌కార్ట్, మోటోరోలా అధికారిక వెబ్‌సైట్‌ తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న రిటైల్‌ స్టోర్ల ద్వారా కొనుగోలు చేయవచ్చు.  

Videos

AP BJP చీఫ్ లేఖ.. ఏమని ఉంది అంటే..!

YSRCP నేతలు మీడియాతో మాట్లాడద్దు..! కూటమి వింత ఆంక్షలు

22 ఏళ్లకే ఫేమస్.. ఎవరూ ఊహించని విధంగా మృతి

చిన్నారి కేసులో ఏం జరిగింది.. పాయింట్ టు పాయింట్

కాక్రోచ్ పార్టీ వ్యవస్థాపకుడు దీప్కేపై దాడి

మందేసి... చిందేసి ఏంటది..? చింతమనేని ఘటనపై అంబటి మాస్ రియాక్షన్

ఇసుక తుఫాన్ పట్టపగలే కమ్ముకున్న చీకట్లు ఎక్కడంటే

ఉపాధి హామీ కూలిలు ఏం చేశారో చూడండి..! వైరల్ అవుతున్న వీడియో

2026 నుంచి ప్రతి వాహనంలో ఇదే తప్పనిసరి!

SIR పేరుతో టార్గెట్ చేసి ఓటర్లును తొలగిస్తున్నారు

Photos

+5

సమంత 'బంగారం'.. పట్టుచీరలో రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ప్రసాద్ ఐమాక్స్ వద్ద భారీ అనంత పద్మనాభస్వామి (ఫొటోలు)

+5

‘ఓ..! సుకుమారి’ మూవీ టీజర్‌ లాంచ్‌లో ఐశ్వర్య రాజేష్ (ఫొటోలు)

+5

'అందరి చూపు అటువైపే' ఏముంది అక్కడ..(ఫొటోలు)

+5

ముంబై : 'ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్' 25 ఏళ్ల వేడుక (ఫొటోలు)

+5

‘సింగ్-గీతం’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

మహిళల జట్టు టి20 ప్రపంచకప్‌...పాకిస్తాన్‌పై భారత ఘనవిజయం (ఫొటోలు)

+5

సొంతూరిలో విజయ్-రష్మిక.. ఓ మంచి కార్యక్రమం (ఫొటోలు)

+5

యూరప్ ట్రిప్‌లో హీరోయిన్ కల్యాణి (ఫొటోలు)

+5

ఇందిరా పార్క్ ధర్నా చౌక్‌లో కాక్రోచ్‌ పార్టీ ధర్నా.. జెన్‌జీ భారీ మద్దతు (ఫొటోలు)