Breaking News

పెరుగుతున్న పసిడి ధరలు.. ఇంకా పెరుగుతాయ్‌!

Published on Sat, 06/13/2026 - 20:31

గత కొన్ని రోజులుగా తగ్గుముఖం పట్టిన బంగారం బంగారం ధరలు మళ్లీ ఊపందుకుంటున్నాయి. అయితే ఈ పెరుగుదల రానున్న రోజుల్లో ఇలాగే కొనసాగుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక, భౌగోళిక అనిశ్చితులు కొనసాగుతున్న నేపథ్యంలో బంగారం ధరలు రాబోయే రెండేళ్లలో కొత్త రికార్డులను నమోదు చేసే అవకాశం ఉందని జేపీ మోర్గాన్‌ గ్లోబల్‌ రీసెర్చ్‌ అంచనా వేసింది. తాజా నివేదిక ప్రకారం 2026 నాల్గవ త్రైమాసికంలో బంగారం సగటు ధర ఔన్స్‌కు 6,000 డాలర్లకు చేరుకుంటుందని, 2027 చివరి నాటికి 6,300 డాలర్ల స్థాయిని తాకే అవకాశం ఉందని పేర్కొంది.

ఇటీవలి నెలల్లో బంగారం ధరలు ఒడిదుడుకులకు లోనైనప్పటికీ దీర్ఘకాలిక ధోరణి మాత్రం బలంగానే ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం పెట్టుబడిదారుల ఆసక్తి కొంత తగ్గినట్లు కనిపించినా, ద్రవ్యోల్బణ భయాలు, ప్రపంచ ఆర్థిక మందగమనం ఆందోళనలు, అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ విధానాలపై అనిశ్చితి, మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు వంటి అంశాలు బంగారానికి ‘సేఫ్‌ హెవెన్‌’ డిమాండ్‌ను కొనసాగిస్తున్నాయని నివేదిక వెల్లడించింది.

ఈ ర్యాలీకి కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు ప్రధాన బలంగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా చైనా, ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలు తమ విదేశీ మారక నిల్వలను డాలర్‌పై ఆధారపడకుండా వైవిధ్యపరచడానికి బంగారం నిల్వలను పెంచుతున్నాయి. జేపీ మోర్గాన్‌ అంచనాల ప్రకారం కేంద్ర బ్యాంకుల బంగారం కొనుగోళ్లు వచ్చే ఏడాదిలో కూడా బలంగానే కొనసాగనున్నాయి.

ప్రస్తుత ధరలు
ప్రస్తుతం (జూన్‌ 13 నాటికి) అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు సరికొత్త రికార్డు స్థాయిల వద్ద ట్రేడ్ అవుతున్నాయి. గ్లోబల్ కమోడిటీ మార్కెట్ (COMEX)లో స్పాట్ గోల్డ్ ధర ప్రస్తుతం ఔన్స్‌కు సుమారు 4,238 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ఇక దేశీయంగా ఢిల్లీ ప్రాంతంలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,49,230 పలుకుతోంది.

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి. అలాగే ఇక్కడ నిపుణులు, విశ్లేషకులు పేర్కొన్న అంచనాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. పాఠకులు స్వయంగా పరిశీలించుకున్న మీదటే పెట్టుబడుల నిర్ణయం తీసుకుకోవాల్సినదిగా సూచన.)

Videos

AP BJP చీఫ్ లేఖ.. ఏమని ఉంది అంటే..!

YSRCP నేతలు మీడియాతో మాట్లాడద్దు..! కూటమి వింత ఆంక్షలు

22 ఏళ్లకే ఫేమస్.. ఎవరూ ఊహించని విధంగా మృతి

చిన్నారి కేసులో ఏం జరిగింది.. పాయింట్ టు పాయింట్

కాక్రోచ్ పార్టీ వ్యవస్థాపకుడు దీప్కేపై దాడి

మందేసి... చిందేసి ఏంటది..? చింతమనేని ఘటనపై అంబటి మాస్ రియాక్షన్

ఇసుక తుఫాన్ పట్టపగలే కమ్ముకున్న చీకట్లు ఎక్కడంటే

ఉపాధి హామీ కూలిలు ఏం చేశారో చూడండి..! వైరల్ అవుతున్న వీడియో

2026 నుంచి ప్రతి వాహనంలో ఇదే తప్పనిసరి!

SIR పేరుతో టార్గెట్ చేసి ఓటర్లును తొలగిస్తున్నారు

Photos

+5

సమంత 'బంగారం'.. పట్టుచీరలో రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ప్రసాద్ ఐమాక్స్ వద్ద భారీ అనంత పద్మనాభస్వామి (ఫొటోలు)

+5

‘ఓ..! సుకుమారి’ మూవీ టీజర్‌ లాంచ్‌లో ఐశ్వర్య రాజేష్ (ఫొటోలు)

+5

'అందరి చూపు అటువైపే' ఏముంది అక్కడ..(ఫొటోలు)

+5

ముంబై : 'ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్' 25 ఏళ్ల వేడుక (ఫొటోలు)

+5

‘సింగ్-గీతం’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

మహిళల జట్టు టి20 ప్రపంచకప్‌...పాకిస్తాన్‌పై భారత ఘనవిజయం (ఫొటోలు)

+5

సొంతూరిలో విజయ్-రష్మిక.. ఓ మంచి కార్యక్రమం (ఫొటోలు)

+5

యూరప్ ట్రిప్‌లో హీరోయిన్ కల్యాణి (ఫొటోలు)

+5

ఇందిరా పార్క్ ధర్నా చౌక్‌లో కాక్రోచ్‌ పార్టీ ధర్నా.. జెన్‌జీ భారీ మద్దతు (ఫొటోలు)