Breaking News

వడ్డీరేట్లు యథాతథం.. రూపాయి రక్షణకే ప్రాధాన్యం 

Published on Sat, 06/06/2026 - 05:45

ముంబై: ఎవరూ ఊహించని విధంగా మానిటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ) రూపాయికి భారీ బూస్ట్‌నిస్తూ విదేశీ పెట్టుబడులను ఆకట్టుకునే విధంగా ఆరు ప్రధాన చర్యలు ప్రకటించింది. మరోపక్క రూపాయికి దన్నునిస్తూ ప్రభుత్వం సైతం విదేశీ ఇన్వెస్టర్లకు ప్రభుత్వ బాండ్లలో పన్ను రిలీఫ్‌ను ప్రకటించింది. వెరసి రూపాయి గత రెండు నెలల్లోలేని విధంగా బలపడింది. వీటితోపాటు ఆర్‌బీఐ గవర్నర్‌ అధ్యక్షతన సమావేశమైన ఎంపీసీ యథాతథ రేట్ల అమలుకు ఏకగ్రీవంగా ఓటు వేసింది.  ఆర్థికవేత్తలు అంచనా వేసినట్లే ఆర్‌బీఐ గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా అధ్యక్షతన సమావేశమైన ఎంపీసీ యథాతథ పాలసీ అమలుకే కట్టుబడింది. 

ఓవైపు ద్రవ్యోల్బణ అంచనాలు పెంచడం, మరోపక్క వృద్ధి అంచనాలలో కోత పెట్టినప్పటికీ వడ్డీ రేట్లకు కీలకమైన రెపోను 5.25 శాతంవద్దే కొనసాగించేందుకు ఏకగ్రీవంగా నిర్ణయించింది. అయితే ఈసారి కొద్ది రోజులుగా డాలరుతో మారకంలో బక్కచిక్కుతున్న దేశీ కరెన్సీకి బలాన్నివ్వడంపై అత్యధికంగా దృష్టి పెట్టింది. ఇందుకు అనుగుణంగా ఆరు ప్రధాన విధాన నిర్ణయాలను ప్రకటించింది. వీటికి జతగా ప్రభుత్వం సైతం ఒక చెయ్యివేస్తూ విదేశీ ఇన్వెస్టర్లకు పన్ను సంబంధ ఉపశమనాన్ని ప్రకటించింది. వెరసి రూపాయి  జోరందుకుని 56 పైసలు బలపడింది.  

ఆర్‌బీఐ తాజా అంచనాలివీ.. 
→ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2026–27)లో ఆర్థిక(జీడీపీ) పురోభివృద్ధి 6.6 శాతానికి పరిమితంకావచ్చు. ఏప్రిల్‌లో ప్రకటించిన 6.9 శాతం అంచనాలను తగ్గించింది. రిటైల్‌ ద్రవ్యోల్బణం అంచనాలను 5.1 శాతానికి పెంచింది. మూడో త్రైమాసికంలో గరిష్టంగా 5.9 శాతానికి చేరవచ్చు. పూర్తి ఏడాదికి ఇంతక్రితం 4.6 శాతంగా ఊహించింది. పెరుగుతున్న వ్యయాలు ధరలను ఎగదోసే వీలుంది.  స్థూల ఆర్థిక మూలాలు గతంకంటే పటిష్టంగా ఉన్నప్పటికీ ప్రపంచ రాజకీయ, భౌగోళిక ఆందోళనలు, బలపడుతున్న కమోడిటీ ధరలు, సరఫరా అవాంతరాలు, రుతుపవనాలు ఆర్థిక పురోగతిని ప్రభావితం చేయవచ్చని గవర్నర్‌ మల్హోత్రా చెప్పారు.    

Videos

SBI క్రెడిట్ కార్డులు వాడేవారికి షాక్.. జులై 1 నుంచి కొత్త రూల్స్

RCBలోకి హార్దిక్ పాండ్యా? డీకేతో రహస్య భేటీ!

జగనే మీ కన్నానయం.. నువ్వు రెండు సంవత్సరాలకే రాష్ట్రాన్ని నాశనం చేసావ్..

భారీగా తగ్గుతున్న బంగారం ధరలు.. ఒక్కరోజులోనే రూ.3,000లు ఢమాల్

సిగ్గుండాలి... చంద్రబాబు “విశాఖ బీచ్ షాక్స్” పై మహిళల ఫైర్

ఇది కాదు వేరే అకౌంట్ ఇస్తా దానికి రూ.25 లక్షలు సెండ్ చేసి... బయటపడ్డ షాకింగ్ నిజాలు

వైరల్ గా మరీనా కేశినేని నాని పోస్ట్, సొంత పార్టీ నేతలను కూడా వదలని కేశినేని చిన్ని

బాబుకు ఇల్లు గిఫ్ట్.. పవన్ కు ల్యాండ్ గిఫ్ట్.. లింగమనేనికి RS సీటు గిఫ్ట్..

యుద్దానికి సిద్ధంగా ఉండు... మా దమ్మెంటో చూపిస్తాం

బానిస బతుకు బతకడానికి మేము గొర్రెలం కాదు, ప్రకాష్ రాజ్ కౌంటర్

Photos

+5

కదం తొక్కిన కాక్రోచ్‌.. జంతర్‌ మంతర్‌ వద్ద ధర్నా (చిత్రాలు)

+5

రామ్ చరణ్‌ ‘పెద్ది’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

పంజగుట్టలో అందాల నటి రాశీసింగ్‌ సందడి (ఫొటోలు)

+5

నాగచైతన్య దూత వెబ్ సిరీస్ సీక్వెల్ ప్రారంభం.. ఫోటోలు

+5

'బిగ్‌బాస్' కీర్తిభట్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

ఒకప్పటి స్టార్ హీరోయిన్ రంభ బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)

+5

తమన్నా ఇంట్లో లింగభైరవి పుణ్యపూజ (ఫొటోలు)

+5

పింక్ బ్యూటీలా మృణాల్ ఠాకుర్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : మళ్లీ పలకరించిన వరుణుడు (ఫొటోలు)

+5

బుట్టబొమ్మ పూజా హెగ్డే స్మైలీ లుక్స్.. ఫోటోలు