Breaking News

ఫ్రిజ్ వాడుతున్నారా? ఈ టిప్స్ పాటిస్తే కరెంటు బిల్లు భారీగా ఆదా..

Published on Sat, 05/30/2026 - 16:21

భానుడి భగభగలతో మే నెల వచ్చేసరికి ఉష్ణోగ్రతలు గరిష్ఠ స్థాయికి చేరుకుంటున్నాయి. ఈ వేసవి కాలంలో దాహం తీర్చుకోవడానికి చల్లటి నీరు, అలాగే పండ్లు, కూరగాయలు, వండిన ఆహార పదార్థాలు పాడవకుండా ఉండటానికి ప్రతి ఇంట్లోనూ రిఫ్రిజిరేటర్లు రోజుకు 24 గంటల పాటు నిరంత రాయంగా పనిచేస్తుంటాయి. అయితే, చాలా ఇళ్లలో ఫ్రిజ్ సరిగ్గా పనిచేస్తున్నప్పటికీ.. ఈ మధ్యకాలంలో కూలింగ్ తగ్గడం, అదే సమయంలో విద్యుత్ బిల్లులు విపరీతంగా పెరగడం వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. మనం చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్ల వల్లే ఫ్రిజ్ లోపల కంప్రెసర్‌పై అదనపు భారం పడి, విద్యుత్ వినియోగం పెరుగుతుందని ఇంధన సామర్థ్య బ్యూరో నిపుణులు చెబుతున్నారు. రోజువారీ అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా ఫ్రిజ్ సామర్థ్యాన్ని పెంచడంతో పాటు.. కరెంట్ బిల్లును 25 శాతం వరకు ఎలా ఆదా చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం..

చేయకూడని పొరపాట్లు ఇవే..

వేసవిలో చల్లటి నీటి కోసం ఇంట్లో పిల్లలు, పెద్దలు తరచూ ఫ్రిజ్ డోర్ తెరుస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల లోపలి చల్లటి గాలి బయటకు పోయి, గదిలోని వేడి గాలి లోపలికి ప్రవేశిస్తుంది. ఫలితంగా ఫ్రిజ్ మళ్లీ చల్లబడటానికి కంప్రెసర్ ఎక్కువ సమయం శ్రమించాల్సి వస్తుంది. కాబట్టి అవసరమైన వస్తువులను ఒకేసారి బయటకు తీయడం అలవాటు చేసుకోవాలి. వండిన అన్నం, కూరలు లేదా పాలు పూర్తిగా చల్లారక ముందే నేరుగా ఫ్రిజ్‌లో పెట్టడం చాలా మందికి అలవాటు. దీనివల్ల లోపలి ఉష్ణోగ్రత అకస్మాత్తుగా పెరుగుతుంది. దాన్ని సమం చేయడానికి యంత్రంపై తీవ్ర ఒత్తిడి పడుతుంది. అందుకే ఏ పదార్థమైనా గది ఉష్ణోగ్రతకు చల్లారిన తర్వాతే లోపల ఉంచాలి. ఫ్రిజ్ వెనుక భాగం నుంచి వెలువడే వేడి గాలి బయటకు పోవడానికి తగినంత స్థలం ఉండాలి. వెంటిలేషన్ సరిగ్గా లేకపోతే కంప్రెసర్ త్వరగా వేడెక్కి కూలింగ్ తగ్గిపోతుంది. అందుకే ఫ్రిజ్‌ను గోడకు కనీసం 4 నుండి 6 అంగుళాల దూరంలో ఉంచాలి. ఫ్రిజ్ నిండా వస్తువులను ఇరుకైన పద్ధతిలో సర్దితే లోపల చల్లటి గాలి ప్రసరణకు ఆటంకం కలుగుతుంది. దీనివల్ల అన్ని అరలకు సమానంగా కూలింగ్ అందదు.

ఫ్రిజ్ లోపలి భాగంతో పాటు వెనుక వైపు ఉండే కాయిల్స్, వెంట్లను కూడా శుభ్రం చేయాలి. అక్కడ దుమ్ము పేరుకుపోతే హీట్ ఎక్స్ఛేంజ్ సామర్థ్యం తగ్గి, కరెంట్ ఎక్కువగా కాలుతుంది. నెలకు ఒకసారైనా వెనుక భాగాన్ని శుభ్రం చేయడం మేలు.  ఫ్రిజ్ తలుపునకు ఉండే రబ్బరు పట్టీ అంటే గాస్కెట్ వదులైనా లేదా దెబ్బతిన్నా లోపలి చల్లదనం నిరంతరం బయటకు లీక్ అవుతుంది. డోర్ సరిగ్గా లాక్ అవ్వడం లేదని గమనిస్తే వెంటనే గాస్కెట్‌ను మార్చడం ఉత్తమం. ఫ్రిజ్‌ను ఎప్పుడూ నేరుగా ఎండ తగిలే చోట లేదా గ్యాస్ స్టవ్ వంటి వేడి వస్తువుల పక్కన పెట్టకూడదు. విద్యుత్ సరఫరా నిలిచిపోయినప్పుడు ఫ్రిజ్ డోర్‌ను అస్సలు తెరవద్దు. దీనివల్ల లోపల దాదాపు గంటల తరబడి చల్లదనం అలాగే ఉంటుంది. ఫ్రిజ్‌లో ఐస్ పేరుకుపోకుండా చూసుకోవడానికి 'ఆటో డీఫ్రాస్ట్' ఫీచర్‌ను ఉపయోగించాలి. కొత్తగా కొనుగోలు చేసేటప్పుడు ఎక్కువ స్టార్ రేటింగ్ ఉన్న ఇన్వర్టర్ మోడల్ రిఫ్రిజిరేటర్లను ఎంచుకుంటే దీర్ఘకాలంలో విద్యుత్ బిల్లును మరింతగా తగ్గించుకోవచ్చు.

Videos

9 నెలలుగా జీతం ఇవ్వకపోతే ఎలా బ్రతకాలి.. ఏయూలో దళితులపై వివక్ష

ఐపీఎల్ ఫైనల్ సమరానికి సర్వం సిద్ధం

డీఎస్సీలో తప్పుల మీద తప్పులు.. బాబు సర్కార్ ఉక్కిరిబిక్కిరి

పవన్ అసలు రంగు.. 14 ఏళ్ల బాలిక మరణంతో రాజకీయం

ఘోర రోడ్డు ప్రమాదం.. నుజ్జు నుజ్జు అయిన ఆర్టీసీ బస్సు

MPకి ఘోర అవమానం కోడి గుడ్లతో కొట్టిన గ్రామస్థులు

దారుణంగా YSRCP నేతపై దాడి..రక్తంతో

REEL సీఎం కి REAL సీఎంకి తేడా అదే

భూములు ఇవ్వం అని చెప్తే.. పొలాల్లోకి నీళ్ళు వదిలిన కూటమి ప్రభుత్వం

రాజస్థాన్ లో ఇసుక తుఫాన్ బీభత్సం.. వణికిపోయిన ప్రజలు

Photos

+5

హైదరాబాద్ లో మండుతున్న ఎండలు (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మే 31 - జూన్ 07)

+5

విరూపతో వివాహ బంధానికి 11 ఏళ్లు.. అల్లరి నరేశ్ సతీమణి ఏం చేస్తుందో తెలుసా? (ఫొటోలు)

+5

చిన్నతనం నుంచే చిచ్చరపిడుగు.. వైభవ్ సూర్యవంశీని ఇలా చూశారా? (ఫొటోలు)

+5

ఏపీలో పలు జిల్లాలో గాలివాన బీభత్సం (ఫొటోలు)

+5

విశాఖపట్నం : ఆకట్టుకున్న ఏయూ ఫైన్‌ ఆర్ట్స్‌ (ఫొటోలు)

+5

సిస్టమ్‌ మూవీ బాలనటితో జ్యోతిక పోజులు (ఫొటోలు)

+5

హీరోయిన్ మీనాక్షి చౌదరి స్మైలీ లుక్స్ (ఫొటోలు)

+5

ఫ్యామిలీ ట్రిప్‌లో సింహాద్రి హీరోయిన్ అంకిత (ఫొటోలు)

+5

టాలీవుడ్ నటి పూర్ణ బక్రీద్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)