Breaking News

ఛాయ్‌ చటుక్కున తాగరా భాయ్‌..!

Published on Thu, 05/21/2026 - 14:08

అలసిన క్షణాన అందరికీ గుర్తుకొచ్చేది చాయ్‌.. అందుకే ప్రతీ ఇంట్లో ప్రతీ రోజు ఉయదం చాయ్‌ ఉండాల్సిందే. ప్రయాణం ముగిసిన వెంటనే.. స్నేహితులు కలిసిన వెంటనే.. ఎవరైనా ఇంటికొచ్చిన వెంటనే అడిగే మొదటి ప్రశ్న చాయ్‌ తాగుతారా.. అని. అంత‘టీ’ ప్రాధాన్యత కలిగిన చాయ్‌కూ ఓ రోజుంది. 2005 నుంచి ప్రతీ ఏడాది మే 21న  అంతర్జాతీయ ‘టీ’ దినోత్సవం నిర్వహిస్తున్నారు.

కౌటాల: తాగాల్సిందే టీ.. పొద్దునో టీ.. సాయంత్రమో టీ.. దోస్తులతో టీ.. చుట్టాలతో టీ.. పని ఆపి ఒక టీ.. పనయ్యాకో టీ.. అని టీ ప్రియులు అంటున్నారు.  చెమటలు కక్కే వేడిలో పొగలుకక్కే చాయ్‌ తాగాల్సిందే. ఛాయ్‌ చటుక్కున తాగరా భాయ్‌.. ఛాయ్‌ ఖరీదులో చీపురా భాయ్‌.. ఛాయ్‌ ఖు షీలనే చూపుఆ భాయ్‌ అంటూ చాయ్‌ చమక్కుల ను .. చాయ్‌ కలిగించే కిక్కులను పేద, ధనిక వ్య త్యాసం లేకుండా ఆస్వాధిస్తుంటారు. ఎంత పేదలైనా ఇంటికి వెళ్లామంటే.. ఓ గాస్లు మంచినీళ్లు, కప్పు టీ ఇవ్వాల్సిందే. ఇది అనాదిగా ఉన్న అలవాటు. 

1793 నుంచే.. 
ఎంతో చరిత్ర కలిగిన టీని తేనీరు, చా అని పిలుస్తారు.. దైనందిన కార్యక్రమాలు టీతోనే మొదలువుతున్నాయంటే ఆశ్చర్యం కాదు. 15వ శతాబ్దంలో నాగరిక ప్రపంచానికి టీ పరిచయం అయింది. మొట్ట మొదటిసారిగా మనదేశంలో 1793లో కలకత్తాలోని బొటానికల్‌ గార్డెన్‌లో లార్డ్‌ మెకార్డినీ టీ మొక్కలు పెంచడం ప్రారంభించాడు. మెల్లమెల్లగా మన దేశంలో తేనీరు సేవించడం మొదలు పెట్టారు. ఇప్పుడు ఇంటింటి టీ చేరింది. ప్రపంచ టీ ఉత్పత్తిలో చైనా తర్వాతి స్థానం భారత్‌దే. అంతర్జాతీయంగా 30 శాతం టీ పొడిని ఒక్క భారతీయులే వాడేస్తున్నారు. 

టీ తోనే రోజు మొదలు
ప్రతీ రోజూ ఉదయం పొద్దునే న్యూస్‌ పేపర్‌ చదడం అలవాటు. అదికూడా చాయ్‌ తాగుతానే.. చాయ్‌ లేదంటే పేపర్‌ చదవడం కూడా ఇష్టం ఉండదు. సమావేశాలు, సభలకు వెళ్లిన ప్రతీ చోట టీ తప్పనిసరిగా ఇస్తున్నారు. స్నేహితులు కలిసి ప్రతిసారి టీ 
తాగుతుంటాం. 
– మోర్లె పాండురంగ్, కన్నెపల్లి

 

Videos

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రోజా

మృత్యు మేఘాలు వచ్చేసాయ్.. జాగ్రత!

క్లైమాక్స్ చూస్తే షాక్ అవుతారు.. ఉప్పెన కి మించి TWIST

గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డులో భారీ అగ్నిప్రమాదం

పుల్వామా ఉగ్రదాడి మాస్టర్ మైండ్ హమ్జా హతం

గుర్తుపెట్టుకో చంద్రబాబు.. ఇవే నీకు చివరి ఎన్నికలు..

నిప్పుల కుంపటి..! తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరిగిన ఉష్టోగ్రతలు

బండి భగీరథ్ సరెండర్ కాలేదు.. అరెస్ట్ చేశాం : రేవంత్ రెడ్డి

బొంతు శ్రీదేవితో మాకు ప్రాణహాని.. సీఎం సార్ మమ్మల్ని కాపాడండి

మరో వివాదంలో సీఎం విజయ్

Photos

+5

డేవిడ్ రెడ్డి టీమ్‌తో మంచు మనోజ్ బర్త్‌ డే సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

వడ్డే నవీన్ రీ ఎంట్రీ.. త్రిమూర్తులు టీజర్ లాంఛ్‌ (ఫోటోలు)

+5

వాటికన్ సిటీలో నయనతార దంపతుల సందడి.. ఫోటోలు

+5

చిరంజీవి 158వ మూవీ లాంచ్‌ (ఫోటోలు)

+5

తెలుగు రాష్ట్రాల్లో డేంజర్ ఎండలు.. అల్లాడిపోతున్న జనం (ఫొటోలు)

+5

‘పెద్ది’ కష్టం చూశారా? అయితే ఈ ఫోటోలు చూడాల్సిందే

+5

సింప్లీ సూపర్బ్‌ అనిపించేలా మహేశ్‌బాబు మేనకోడలు (ఫోటోలు)

+5

తిరుమలకు పోటెత్తుతున్న భక్తులు (ఫొటోలు)

+5

ఫుల్ హ్యాపీగా త్రిష.. అటు విజయ్ ఇటు సూర్య (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్ కూతురి బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)