Breaking News

మా ఆయన రాత్రంతా నిద్రపోడు.. నన్ను నిద్ర పోనివ్వడు!

Published on Thu, 05/21/2026 - 08:56

నా వయసు 32 సంవత్సరాలు. నాకు పెళ్లై 10 సంవత్సరాలు అయ్యింది. పెళ్లైన మొదటి నుంచే నా భర్తకు నా మీద అనుమానం ఉండేది.  రెండు సంవత్సరాలుగా  ఎక్కువైంది. ఆయన రాత్రంతా పడుకోకుండా మెలకువగానే ఉంటారు. నేను బయటికి వెళ్లి వచ్చినా, బాత్రూమ్‌కి వెళ్లి వచ్చినా, ఎక్కడికి వెళ్లినా గొడవ చేస్తారు.పెద్దలు సంపాదించిన ఆస్తి ఉండటం వల్ల ఆయనకు పెద్దగా పనిచేయాల్సిన అవసరం లేదు. అందుకే ఉదయం పూటంతా ఇంట్లోనే ఉంటారు. రాత్రి పూట మాత్రం పడుకోకుండా నన్ను గమనిస్తూ ఉంటారు. అలాగే మా బంధువులు, నా అన్నదమ్ములు ఎవరైనా నా దగ్గరకు వచ్చి మాట్లాడినా కూడా అనుమానిస్తారు. ఎవరితోనూ మాట్లాడనివ్వరు. కొన్నిసార్లు ఇంటికి తాళం వేసుకుని కూడా వెళ్తారు. ఆయనను హాస్పిటల్‌కి తీసుకువెళ్లడం  కూడా చాలా కష్టంగా మారింది. మా అత్తమామలు కూడా ‘సర్దుకుపోమ్మా’ అని మాత్రమే అంటున్నారు. కానీ నా వల్ల ఇక కావడంలేదు. కేవలం కౌన్సిలింగ్‌ ద్వారా ఆయనను మార్చవచ్చా? ఎందుకంటే ఆయన మందులు వేసుకోవడానికి ఒప్పుకోరు. ఆయనను హాస్పిటల్‌కి తీసుకువచ్చి చికిత్స చేయించడానికి ఏదైనా మంచి సలహా ఇవ్వండి.
– స్వర్ణ, నల్గొండ

మీ భర్త ప్రవర్తన కేవలం మామూలు పొసెసివ్‌ నేచర్‌’ మాత్రమే కాదు. ఇది ఒక తీవ్రమైన మానసిక సమస్య అయ్యే అవకాశం ఉంది. ఆధారాలు లేకపోయినా భార్యపై అనుమానం ఉండడం, రాత్రుళ్లు మెలకువగా ఉండడం, హింసించడం, ఎవరితో మాట్లాడనివ్వకపోవడం, బయటకు వెళ్లనివ్వకుండా ఇంటికి తాళాలు వేసుకుని వెళ్లడం వంటి లక్షణాలు‘అనుమానం జబ్బు’ లేదా ‘ఒథెల్లో సిండ్రోమ్‌’ అనే మానసిక సమస్యలో భాగంగా కనిపించవచ్చు. ఇలాంటి సమస్యలు మెదడులో వచ్చే కొన్ని రసాయన మార్పులవల్ల రావచ్చు. అలాగే చిన్నతనంలో జరిగిన ట్రామా లేదా మనుషులపై నమ్మకం కోల్పోయే అనుభవాల వల్ల కూడా ఈవిధమైన సమస్యలు పెరగవచ్చు. 

ఇది కేవలం కౌన్సిలింగ్‌ ద్వారా మాత్రమే తగ్గిపోయే సమస్యకాదు. కొన్నిసార్లు ఇలాంటి అనుమానాలు తీవ్రమై హింస, కొట్టడం, లేదా ప్రాణహాని వరకు వెళ్లే ప్రమాదం కూడా ఉంటుంది. ఖచ్చితంగా ఆయనకు చికిత్స అవసరం. ‘హాస్పిటల్‌కి వెళ్దాం’ అంటే ఆయన ఒప్పుకోకపోవచ్చు. అందుకే మొదట ‘స్ట్రెస్‌ ఎక్కువగాఉంది’ ‘నిద్ర సరిగ్గా రావట్లేదు కాబట్టి ఒకసారి డాక్టర్‌కు చూపించుకుందాం’ అనే విధంగా తీసుకురావడానికి ప్రయత్నించండి. హాస్పిటల్‌కి వచ్చిన తర్వాత డాక్టర్లు మాట్లాడి అవసరమైన మందులు  ప్రారంభించే అవకాశం ఉంటుంది. మందులు కొంతకాలం క్రమంగా వాడితే, తర్వాత కౌన్సిలింగ్‌కు కూడా ఒప్పుకునే అవకాశం ఉంటుంది.

 ఒకవేళ మందులు లేదా కౌన్సిలింగ్‌కు పూర్తిగా నిరాకరిస్తూ, హింసాత్మకంగా ప్రవర్తిస్తే, అవసరమైతే కుటుంబ సభ్యుల సహాయంతో బలవంతంగానైనా హాస్పిటల్‌లో చేర్చి చికిత్స చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. మీరు నిరుత్సాహ పడకండి. మీ కుటుంబ సభ్యులు, మీ అమ్మ తరపువాళ్లు, అలాగే మీ అత్తగారిని కూడా ఇందులో భాగస్వామ్యం చేయండి. సరైన వైద్యంతో ఈ సమస్య నుంచి మీ భర్తను పూర్తిగా బయట పడేయవచ్చు. షేక్‌ స్పియర్‌ రాసిన ఒథెల్లో నాటకంలో కూడా క«థ ఇలాంటిదే. అందుకే ఈ సమస్యను ‘కాంజుగల్‌ పారనోయియా’ లేదా ‘ఒథెల్లో సిండ్రోమ్‌’ అని అంటారు.


డా. ఇండ్ల విశాల్‌ రెడ్డి, 
సీనియర్‌ సైకియాట్రిస్ట్, విజయవాడ.  
మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన 
మెయిల్‌ ఐడీ: sakshifamily3@gmail.com

 

#

Tags : 1

Videos

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రోజా

మృత్యు మేఘాలు వచ్చేసాయ్.. జాగ్రత!

క్లైమాక్స్ చూస్తే షాక్ అవుతారు.. ఉప్పెన కి మించి TWIST

గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డులో భారీ అగ్నిప్రమాదం

పుల్వామా ఉగ్రదాడి మాస్టర్ మైండ్ హమ్జా హతం

గుర్తుపెట్టుకో చంద్రబాబు.. ఇవే నీకు చివరి ఎన్నికలు..

నిప్పుల కుంపటి..! తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరిగిన ఉష్టోగ్రతలు

బండి భగీరథ్ సరెండర్ కాలేదు.. అరెస్ట్ చేశాం : రేవంత్ రెడ్డి

బొంతు శ్రీదేవితో మాకు ప్రాణహాని.. సీఎం సార్ మమ్మల్ని కాపాడండి

మరో వివాదంలో సీఎం విజయ్

Photos

+5

డేవిడ్ రెడ్డి టీమ్‌తో మంచు మనోజ్ బర్త్‌ డే సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

వడ్డే నవీన్ రీ ఎంట్రీ.. త్రిమూర్తులు టీజర్ లాంఛ్‌ (ఫోటోలు)

+5

వాటికన్ సిటీలో నయనతార దంపతుల సందడి.. ఫోటోలు

+5

చిరంజీవి 158వ మూవీ లాంచ్‌ (ఫోటోలు)

+5

తెలుగు రాష్ట్రాల్లో డేంజర్ ఎండలు.. అల్లాడిపోతున్న జనం (ఫొటోలు)

+5

‘పెద్ది’ కష్టం చూశారా? అయితే ఈ ఫోటోలు చూడాల్సిందే

+5

సింప్లీ సూపర్బ్‌ అనిపించేలా మహేశ్‌బాబు మేనకోడలు (ఫోటోలు)

+5

తిరుమలకు పోటెత్తుతున్న భక్తులు (ఫొటోలు)

+5

ఫుల్ హ్యాపీగా త్రిష.. అటు విజయ్ ఇటు సూర్య (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్ కూతురి బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)