Breaking News

అమ్మా? భార్యా? మధ్య నలిగిపోతున్న ఐటీ ఉద్యోగి

Published on Thu, 05/07/2026 - 12:53

నేను ఐటీ ఉద్యోగిని. రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాను. మా నాన్న గారు నా చిన్నప్పుడే చనిపోయారు. మా అమ్మే నన్ను పెంచి పెద్ద చేసింది. నేను ఒక్కడినే ఆమెకు. తనకు నచ్చిన అమ్మాయినే నేను పెళ్లి చేసుకోవాలని మా అమ్మ కోరిక. అలా అయితే వచ్చిన కోడలు తన మాట వింటుందని, తనకు అనుకూలంగా ఉంటుందని ఆమె భావించింది. కానీ నేను ఆఫీసులో నాతోపాటు పనిచేసే ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. పైగా మాది కులాంతర వివాహం! మా పెళ్లి మా అమ్మకి మొదటి నుంచీ ఇష్టం లేదు. రెగ్యులర్‌గా మా అమ్మ నా భార్యతో గొడవపడుతూ ఉండేది. 

మొదట్లో నా భార్య మా అమ్మతో మంచిగా ఉండేందుకు చాలా ప్రయత్నించింది. కానీ మా అమ్మ ప్రవర్తన వల్ల ఆమె క్రమంగా దూరంగా ఉండటంప్రారంభించింది. మా అత్తమామలు కూడా మా అమ్మ ప్రవర్తనతో విసిగిపోయారు. ఈ మధ్యకాలంలో మా అమ్మ అకస్మాత్తుగా మాట్లాడలేకపోయింది. చాలా పరీక్షలు చేయించాను, చాలా హాస్పిటల్స్‌కి తీసుకెళ్లాను. ఎక్కడ చూపించినా పెద్దగా ఏ సమస్య లేదని చెప్పారు. ఎక్కువ స్ట్రెస్‌ వల్ల ఇలా జరుగుతోందని చెప్పారు. కొన్ని రోజుల తర్వాత మళ్లీ కొద్దికొద్దిగా మాట్లాడటం ప్రారంభించింది. ఆ తర్వాత కాలు, చేయి పని చేయట్లేదని చెప్పడం మొదలు పెట్టింది. అప్పుడు కూడా పరీక్షలు చేయించగా అన్నీ నార్మల్‌గానే వచ్చాయి. ఇప్పుడు మా అమ్మ ఏమంటుందంటే, నేను తన దగ్గరే ఉండాలి, తన మాటే వినాలి అని. మా అమ్మ వల్ల నా భార్య చాలా ఇబ్బందులు పడుతోంది. ఇప్పుడు ఆమె ప్రెగ్నెంట్‌ కూడా. ఈ పరిస్థితులలో నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. సలహా ఇవ్వగలరు. 
– సుభాష్,ప్రోద్దుటూరు

ఒక వైపు కన్నతల్లి, మరోవైపు గర్భవతి అయిన భార్య. ఈ ఇద్దరి మధ్య నలిగిపోతున్న మీ మానసిక వేదన స్పష్టంగా అర్థమవుతోంది. మీరు వివరించిన లక్షణాలను బట్టిచూస్తే, మీ అమ్మగారికి ఉన్నది మొండితనం, శారీరక సమస్యలే కాకుండా, మానసిక ఒత్తిడి కూడా అనిపిస్తుంది. మానసిక వైద్య పరిభాషలో దీనిని ‘కన్వర్షన్‌ డిజార్డర్‌’ అంటాము. అంటే తీవ్రమైన ఒత్తిడితో బాధపడుతున్నపుడు కొన్నిసార్లు శారీరక లక్షణాల రూపంలో బయటపడతాయి. ఉదాహరణకు మాట పడిపోవడం, కాళ్లు చేతులు పని చేయకపోవడం, కనిపించకపోవడం, ఫిట్స్‌లా రావడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. పరీక్షల్లో అన్నీ నార్మల్‌గా ఉంటాయి. అంటే ఆమె కావాలనే ఇలా చేస్తున్నారని కాదు, ఆమె మనసులోని ఒత్తిడి శరీరం ద్వారా వ్యక్తమవుతోంది. 

మీ నాన్నగారు లేకపోవడం, ఆమెకు మీరు ఒక్కగానొక్క కొడుకు కావడం వల్ల మీ అమ్మగారు మీపై చాలా భావోద్వేగంగా ఆధారపడిపోయి ఉండవచ్చు. మీరు తనకు దూరమవుతారేమో, మీ జీవితంలో తనప్రాధాన్యం తగ్గిపోతుందేమో అనే భయం ఆమెలో ఉండొచ్చు. ఈ భయం కొన్నిసార్లు ఇలాంటి అనారోగ్య లక్షణాల రూపంలో బయటపడుతుంది. అదే సమయంలో మీ భార్య ప్రెగ్నెంట్‌ కావడంతో ఆమెకు ఈ సమయంలో శారీరక విశ్రాంతి మాత్రమే కాదు, మానసిక ప్రశాంతత కూడా చాలా అవసరం. ఇంట్లో గొడవలు, ఒత్తిడి పెరిగితే అది ఆమె ఆరోగ్యంపైనే కాదు, గర్భంలోని బిడ్డపై కూడా ప్రభావం చూపవచ్చు. కాబట్టి, ఇప్పుడు మీరు చేయాల్సింది ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు అని నిర్ణయించడం కాదు. ఇద్దరికీ న్యాయం జరిగేలా చూడడం. ముఖ్యంగా మీ అమ్మ గారిని ఒక మంచి సైకియాట్రిస్టు దగ్గరికి తీసుకువెళ్లండి. ‘మీకు మానసిక సమస్య ఉంది’ అని కాకుండా, ‘మీకు ఒత్తిడి ఎక్కువగా ఉంది, దాన్ని తగ్గించుకోవడానికి ఒకసారి మాట్లాడుకుందాం’అని చెప్పండి. మాటల ఎంపిక ముఖ్యం.

 ఇద్దరికీ భరోసా ఇవ్వండి
ఇటు మీ భార్యకు... అటు మీ అమ్మగారికి... ఇద్దరికీ భరోసా ఇవ్వండి. ‘నేను నీకు అండగా ఉన్నాను’ అనే భావన ఇద్దరికీ చాలా ముఖ్యం. ఆమె సంతోషంగా ఉన్నప్పుడు, మీతో సాధారణంగా మాట్లాడినప్పుడు ఎక్కువ సమయం ఇవ్వండి. దాంతో ‘‘నేను బాగుంటే నా కొడుకు కూడా సంతోషంగా ఉంటాడు’’అనే భావన ఏర్పడుతుంది. ఇబ్బంది ఎక్కువగా ఉంటే ఒక సహాయకురాలిని పెట్టడం గురించి ఆలోచించండి. అవసరమైతే మీ భార్యను కొంతకాలం ఆమె పుట్టింట్లో ఉంచడం కూడా మంచిదే, ముఖ్యంగా డెలివరీ వరకు. ఒక్కోసారి మనుషుల మధ్య దూరం కూడా కొన్ని సమస్యలకు మంచి మందులా పనిచేస్తుంది. ప్రతిరోజూ యుద్ధం కంటే ఇది మెరుగైన పరిష్కారం. ఇక్కడ మీరు మీఅమ్మగారిని వదలకండి. అలాగే మీ భార్యను కూడా నిర్లక్ష్యం చేయకండి. ఇద్దరికీ మీరే ఆధారం కాబట్టి ఇద్దరికీ మీరు దగ్గరగానే ఉన్నారనే భావన కలిగించండి. అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ ఒత్తిడిలో మీరు కూడా మీ మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. మీ కుటుంబం త్వరలో ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నాను. 
ఆల్‌ ది బెస్ట్‌! .

Videos

సాయంత్రానికి రూ.2 వేల పతనం.. బంగారం ధరల మిస్టరీ!

మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చరణ్, సుకుమార్ సినిమా..

బంగాళాఖాతంలో అల్పపీడనం మరో రెండు రోజులు భారీ వర్షాలు

విజయకి కాన్వాయ్ రద్దు DGPపై గవర్నర్ సీరియస్

నడి రోడ్డుపై మహిళా ఎమ్మెల్యేను బలవంతంగా...

ప్రెస్ మీట్ మధ్యలో ఏడుస్తూ వెళ్లిపోయిన వర్మ...

జగన్ పై తప్పుడు కథనం పరువు పోగొట్టుకున్న జావా డిస్కవరీ ఛానల్

చంద్రబాబు కాన్ఫరెన్స్ లు కాదు.. రైతుల కష్టాలు చూడు

TVK విజయ్ పై కుట్ర పోసాని సంచలన రియాక్షన్

వస్తావా? నీ రేట్ ఎంత? పోకిరీలకు మిడ్ నైట్ సినిమా చూపించిన లేడీ కమిషనర్

Photos

+5

శారీలో డెకాయిట్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ అందాలు.. (ఫొటోలు)

+5

‘గోదారి గట్టుపైన..’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

‘అగ్లీ స్టోరీ’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

SRH vs PBKS : ఉప్పల్‌లో ఫుల్‌ జోష్‌.. తారల సందడి (ఫొటోలు)

+5

మహేశ్ బాబు సోదరుడి కుమారుడి మూవీ సాంగ్ షూట్ (ఫొటోలు)

+5

నిర్మాత ఆర్‌బీ చౌదరి భౌతిక కాయానికి సినీ ప్రముఖుల నివాళులు (ఫొటోలు)

+5

బర్త్ డే బ్యూటీ.. అందాల భాగ్యశ్రీ బోర్సే (ఫొటోలు)

+5

'టీవీకే' విజయ్‌ని ఇలా ఎప్పుడూ చూసుండరు (ఫొటోలు)

+5

తిరుపతి గంగమ్మ జాతర ప్రారంభం (ఫొటోలు)

+5

శ్రీకాకుళం : అంగరంగ వైభవంగా భద్రమహంకాళి అనుపు ఉత్సవం (ఫొటోలు)