Breaking News

విజయానికి మంత్రం ఇదే..

Published on Thu, 05/07/2026 - 10:07

నేటి వేగవంతమైన ప్రపంచంలో విజయం సాధించాలంటే కేవలం మేధస్సు, వనరులు ఉంటే సరిపోదు.. అంతకుమించి వేగం అత్యంత అవసరమని ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆర్పీజీ గ్రూప్ ఛైర్మన్ హర్ష్ గోయెంకా స్పష్టం చేశారు. ఇటీవల సోషల్ మీడియా వేదికగా ఆయన పంచుకున్న ఒక ఆలోచనాత్మకమైన కోట్ ఇప్పుడు వ్యాపార వర్గాల్లో చర్చనీయాంశమైంది.

అతిగా ఆలోచించకండి..

విజయవంతమైన వ్యక్తుల జీవనశైలిని నిశితంగా గమనించిన గోయెంకా వారిలో ఒకే రకమైన సామాన్య లక్షణం కనిపిస్తుందని పేర్కొన్నారు. ‘విజయవంతమైన వ్యక్తులు అతిగా ఆలోచించరు, అతిగా ప్లాన్ చేయరు లేదా సరైన సమయం కోసం వేచి ఉండరు. వారు కేవలం ముందుకు సాగిపోతుంటారు. ఇతరులు చర్చలు, పరిశోధనలతో సమయం గడుపుతున్నప్పుడు.. వీరు ఇప్పటికే పని మొదలుపెట్టి, అందులో ఎదురయ్యే సవాళ్లను నేర్చుకుంటూ, సర్దుబాటు చేసుకుంటూ ముందుకు సాగిపోతుంటారు’ అని ఆయన వివరించారు.

పరిపూర్ణత కంటే కార్యాచరణే మిన్న

చాలామంది పర్ఫెక్ట్ ప్లాన్ కోసం ఎదురుచూస్తూ నెలల తరబడి సమయాన్ని వృథా చేస్తారని, దానివల్ల అవకాశాలు చేజారిపోయే ప్రమాదం ఉందని గోయెంకా హెచ్చరించారు. ఆరు నెలల తర్వాత అమలు చేసే పరిపూర్ణ ప్రణాళిక కంటే ఈరోజే అమలు చేసే మంచి ప్రణాళికే అత్యుత్తమ ఫలితాలను ఇస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇదీ చదవండి: కాగ్నిజెంట్ 15 వేల మందికి ఉద్వాసన

Videos

వాళ్లకు ఛాన్స్ ఇవ్వను.. విజయ్ కి గవర్నర్ గుడ్ న్యూస్

పవన్ పరువు పాయే.. చిట్టచివరన అటవీ.. పర్యావరణ శాఖ

రసవత్తరంగా తమిళ రాజకీయం గవర్నర్ ను కలిసిన పళనిస్వామి

కేరళ సీఎం పీఠంపై తొలగని సస్పెన్స్

మిస్ చేసుకుంటే విజయ్ CM కాలేడు..!

మంచి మనసు చాటుకుంటున్న అక్కినేని హీరోస్..!

విజయ్ ప్రమాణ స్వీకారం రద్దు

ఏమయ్యా చంద్రబాబు.. అకాల వర్షం వస్తే రైతుల పరిస్థితి ఏంటి?

నాకు ఏ పార్టీలోనూ సభ్యత్వం లేదు

118 మందితో రా.. విజయ్ కి గవర్నర్ భరోసా..

Photos

+5

శారీలో డెకాయిట్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ అందాలు.. (ఫొటోలు)

+5

‘గోదారి గట్టుపైన..’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

‘అగ్లీ స్టోరీ’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

SRH vs PBKS : ఉప్పల్‌లో ఫుల్‌ జోష్‌.. తారల సందడి (ఫొటోలు)

+5

మహేశ్ బాబు సోదరుడి కుమారుడి మూవీ సాంగ్ షూట్ (ఫొటోలు)

+5

నిర్మాత ఆర్‌బీ చౌదరి భౌతిక కాయానికి సినీ ప్రముఖుల నివాళులు (ఫొటోలు)

+5

బర్త్ డే బ్యూటీ.. అందాల భాగ్యశ్రీ బోర్సే (ఫొటోలు)

+5

'టీవీకే' విజయ్‌ని ఇలా ఎప్పుడూ చూసుండరు (ఫొటోలు)

+5

తిరుపతి గంగమ్మ జాతర ప్రారంభం (ఫొటోలు)

+5

శ్రీకాకుళం : అంగరంగ వైభవంగా భద్రమహంకాళి అనుపు ఉత్సవం (ఫొటోలు)