Breaking News

అమ్మకాల్లో రికార్డ్‌.. ఒక్క నెలలో 26 లక్షల వాహనాలు!

Published on Wed, 05/06/2026 - 16:52

భారత ఆటోమొబైల్‌ రంగం 2026-27 ఆర్థిక సంవత్సరాన్ని ఘనంగా ప్రారంభించింది. దేశీయంగా వాహన రిటైల్‌ విక్రయాలు ఈ ఏప్రిల్‌లో ఆల్‌టైమ్‌ రికార్డును సృష్టించాయి. గత నెలలో మొత్తం 26,11,317 వాహనాలు అమ్ముడయ్యాయి. గత ఏడాది (2025) ఇదే నెలలో నమోదైన 23,12,221 యూనిట్లతో పోలిస్తే ఇది 12.94 శాతం వృద్ధి అని ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆటోమొబైల్‌ డీలర్స్‌ అసోసియేషన్స్‌ (ఫాడా) మంగళవారం వెల్లడించింది. జీఎస్టీ 2.0 అమలు, ఆర్‌బీఐ వడ్డీ రేట్ల తగ్గింపు, రబీ పంటల వల్ల గ్రామీణ ప్రాంతాల్లో పెరిగిన నగదు లభ్యత, వివాహాల సీజన్‌ వంటి అంశాలు ఈ వృద్ధికి ప్రధాన కారణాలని ఫాడా వివరించింది.

రికార్డుల జోరుతో ఆటో రంగం బోణీ: ఫాడా ఉపాధ్యక్షుడు
భారత ఆటో రిటైల్‌ రంగం 2026–27 ఆర్థిక సంవత్సరాన్ని బలంగా ప్రారంభించిందని ఫాడా ఉపాధ్యక్షుడు సాయి గిరిధర్‌ తెలిపారు. 2026 ఏప్రిల్‌లో మునుపెన్నడూ లేని విధంగా 26,11,317 యూనిట్ల విక్రయాలతో దాదాపు 13 శాతం వృద్ధిని నమోదు చేయడం విశేషమన్నారు. ఈ గణాంకాలు కేవలం సంఖ్యలు మాత్రమే కావని, భారత వినియోగ మార్కెట్‌లో వస్తున్న కీలక మార్పులకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘గత కొన్నాళ్లుగా మెట్రో నగరాలకే పరిమితమైన వాహనాల జోరు ఇప్పుడు పల్లెలకు పాకింది. పట్టణ ప్రాంతాల్లో 7.11 శాతం వృద్ధి నమోదైతే, గ్రామీణ ప్రాంతాల్లో ఏకంగా 20.40 శాతం వృద్ధి కనిపించడం విశేషం. ఎస్‌యూవీల హవా కొనసాగుతున్నప్పటికీ, చిన్న కార్ల విభాగంలో మళ్లీ కొనుగోళ్లు పెరగడంతో ‘వ్యక్తిగత మొబిలిటీ’ విభాగం పుంజుకుంది. వినియోగదారులు కేవలం పెట్రోల్, డీజిల్‌పైనే ఆధారపడకుండా ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు మొగ్గు చూపుతున్నారు. విక్రయాల్లో సీఎన్‌జీ (సీఎన్‌జీ) వాటా 22.62% ఉండగా, ఎలక్ట్రిక్‌ వాహనాల (ఈవీ) వాటా 5.77 శాతానికి మెరుగుపడటం సానుకూల పరిణామం’’ అని వెల్లడించారు.

అప్రమత్తతతో కూడిన ఆశావాదం: ఫాడా అంచనాలు
రాబోయే మూడు నెలల్లో వాహన విక్రయాల వృద్ధిపై సగానికి పైగా (50.90 శాతం) డీలర్లు ధీమాతో ఉన్నారని ఫాడా తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన నగదు లభ్యత, ఖరీఫ్‌ సీజన్‌ సానుకూలతలు ద్విచక్ర వాహన విభాగానికి ఊతమిస్తాయని అంచనా వేసింది. మే నెలలో వివాహాల సీజన్‌ కారణంగా ప్యాసింజర్‌ వాహనాల బుకింగ్‌లు బలంగా ఉంటాయని, జూన్‌–జూలై నెలల్లో విక్రయాలు సాధారణ స్థితికి చేరుకోవచ్చని పేర్కొంది. అయితే, తీవ్రమైన వడగాల్పులు, పశి్చమ ఆసియా ఉద్రిక్తతల వల్ల పెరిగే ఇంధన ధరలు మరియు వాణిజ్య వాహనాల విభాగంలో నగదు లభ్యత (లిక్విడిటీ) వంటి సవాళ్లను నిశితంగా గమనించాల్సి ఉంటుందని ఫాడా స్పష్టం చేసింది.

#

Tags : 1

Videos

విజయ్ కి అడుగడుగునా అడ్డంకులు, గవర్నర్ తీరుపై సీపీఐ, కాంగ్రెస్ సీరియస్

VCK నిర్ణయంపై స్టాలిన్ ఆగ్రహం

వర్మ ఏంటి ఈ కర్మ.. ఇంచార్జి పదవి నుంచి తొలగింపు

ప్రభుత్వం ఏర్పాటుపై క్లారిటీ..! KSR డీటెయిల్ అనాలసిస్

తమిళనాడు సీఎం విజయ్..?

కరీంనగర్‌లోని BRS క్యాంప్ కార్యాలయంపై BJP దాడి

మైనర్ అమ్మాయిలే టార్గెట్.. వెలుగులోకి ఇన్ స్టాగ్రామ్ చీటర్ అర్జున్ అరాచకాలు

సోషల్ మీడియా యాక్టివిస్ట్ పై టీడీపీ గుండాల దాడి

చంద్రబాబు అండతో భారీ భూ కబ్జా... గీతంకు హైకోర్టు నోటీసులు..

ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వాహనంపై బీజేపీ శ్రేణుల దాడి

Photos

+5

‘గోదారి గట్టుపైన..’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

‘అగ్లీ స్టోరీ’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

SRH vs PBKS : ఉప్పల్‌లో ఫుల్‌ జోష్‌.. తారల సందడి (ఫొటోలు)

+5

మహేశ్ బాబు సోదరుడి కుమారుడి మూవీ సాంగ్ షూట్ (ఫొటోలు)

+5

నిర్మాత ఆర్‌బీ చౌదరి భౌతిక కాయానికి సినీ ప్రముఖుల నివాళులు (ఫొటోలు)

+5

బర్త్ డే బ్యూటీ.. అందాల భాగ్యశ్రీ బోర్సే (ఫొటోలు)

+5

'టీవీకే' విజయ్‌ని ఇలా ఎప్పుడూ చూసుండరు (ఫొటోలు)

+5

తిరుపతి గంగమ్మ జాతర ప్రారంభం (ఫొటోలు)

+5

శ్రీకాకుళం : అంగరంగ వైభవంగా భద్రమహంకాళి అనుపు ఉత్సవం (ఫొటోలు)

+5

హైదరాబాద్ : నెహ్రూ జూ పార్క్... ‘జూ’లకాలాటలలో పులి (ఫొటోలు)