Breaking News

డీలాపడ్డ టెక్స్‌టైల్స్‌ ఎగుమతులు: కారణం ఇదే!

Published on Sun, 05/03/2026 - 16:19

పత్తి వంటి కీలక ఉత్పత్తుల రవాణా (షిప్‌మెంట్‌లు)లో తగ్గుదల కారణంగా టెక్స్‌టైల్స్, గార్మెంట్‌ ఎగుమతులు 2025–26లో 2.2% తగ్గి 35.8 బిలియన్‌ డాలర్లకు పరిమితమయ్యాయి. గ్లోబల్‌ ట్రేడ్‌ రీసెర్చ్‌ ఇనిషియేటివ్‌(జీటీఆర్‌ఐ) ఈ విషయాలు వెల్లడించింది. రూపాయిపరంగా కూడా గత ఆర్థిక సంవత్సరంలో ఎగుమతులు 2.1% తగ్గాయి.

ఆర్థిక సంవత్సరంలో పత్తి టెక్స్‌టైల్స్‌ (–3.9%), రెడీమేడ్‌ దుస్తులు (–1.4%), కార్పెట్లు (–5.3%) వంటి ప్రధాన విభాగాల్లో తగ్గుదల ధోరణి కనిపించింది. అయితే హస్తకళల ఎగుమతులు మాత్రం స్వల్పంగా 1.5% పెరిగాయి. ‘‘రూపాయి, డాలర్‌ మారకం వృద్ధిలో వ్యత్యాసం ఒక వ్యవస్థాత్మక సమస్యకు సంకేతం.

భారత్‌ విలువపరంగా ఎక్కువగా ఎగుమతులు చేస్తున్నప్పటికీ, అంతర్జాతీయంగా డాలర్ల రూపంలో తక్కువ ఆదాయం ఆర్జిస్తోంది. ఉదాహరణకు, మ్యాన్‌–మేడ్‌ టెక్స్‌టైల్స్‌ రూపాయి పరంగా 3.6%  పెరిగినా, డాలర్‌ పరంగా 0.8% తగ్గాయి. అలాగే, గార్మెంట్స్‌ ఎగుమతులు రూపాయి పరంగా 2.9% పెరిగినా, డాలర్‌ పరంగా 1.4% క్షీణించాయి’’ అని జీటీఆర్‌ఐ వ్యవస్థాపకుడు అజయ్‌ శ్రీవాస్తవ తెలిపారు.

కరెన్సీ క్షీణత వల్లే వృద్ధి కనిపిస్తోందే తప్ప పోటీ సామర్థ్యాల వల్ల కాదని ఆయన పేర్కొన్నారు. వాస్తవానికి కీలకమైన గ్లోబల్‌ మార్కెట్లలో భారత్‌ విస్తరించలేకపోవడమో, లేదా మార్కెట్‌ వాటాను కోల్పోవడమో జరుగుతోందని, ముఖ్యంగా కారి్మక శక్తి ఎక్కువగా ఉండే రంగాల్లో ఇది ప్రస్ఫుటంగా ఉంటోందని వివరించారు. 

Videos

మంత్రి టీజీ భరత్ అనుచరుడు వేధింపులకు యువకుడు బలి

వెరీ సాడ్.. ఒకే కుటుంబం ఆఖరి ప్రయాణం.. AI వీడియో..

స్టాఫ్ చేతులు కట్టేసి.. సంచుల నిండ బంగారంతో పరార్..

ఇంట్లో మొగుడు.. ఫోన్లో ప్రియుడు.. కొంపముంచుతున్న డేటింగ్ యాప్‌లు..

అయ్యో పాపం.. సాయి పల్లవి.. మొదటి అడుగే ఇలా అయ్యిందేంటి?

పాకిస్తాన్ లో ఉగ్రవాదులు ఖతం.. దురంధర్ పనేనా..?

ఒక్కటైన పాత మిత్రులు..

కరీంనగర్ జువెల్లరీ షాప్ లో దోపిడీ Live వీడియో

YSRCP నేత దశరథరామిరెడ్డితో పాటు పలువురిపై మంత్రి అనుచరుల దాడి

ఘటనకు ముందు నేను అక్కడే ఉన్న? కాల్పులపై బండి సంజయ్ రియాక్షన్

Photos

+5

గోపీచంద్ కొత్త సినిమా లాంచ్.. దర్శకుడిగా ఫైట్ మాస్టర్ (ఫొటోలు)

+5

ఉప్పల్‌ స్టేడియంలో ఐపీఎల్‌ మ్యాచ్‌..సెలబ్రిటీల సంద‌డి (ఫొటోలు)

+5

కుర్ర హీరోయిన్లకు పోటీ ఇచ్చేలా స్నేహ (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మే 03-10)

+5

నిర్మాత కూతురి పెళ్లి రిసెప్షన్‌లో టాలీవుడ్ స్టార్స్ సందడి (ఫొటోలు)

+5

రోజురోజుకీ మరింత అందంగా కాజల్ అగర్వాల్ (ఫొటోలు)

+5

యాంకర్ రష్మి ప్రీ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

చరణ్ అతిథిగా మెగా కోడలి సినిమా ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ సావిత్రి కుమార్తె 21 రోజుల వేడుక (ఫొటోలు)

+5

మిస్ యూనివర్స్ ఇండియా టు హీరోయిన్‌.. ఎవరీ రియా సింఘా? (ఫొటోలు)