Breaking News

నవ్వుల జల్లు కురిపిద్దామా..

Published on Sun, 05/03/2026 - 11:52

నవ్వడం ఒక భోగం.. నవ్వించడం ఒక యోగం.. నవ్వకపోవడం ఒక రోగం అన్నాడో కవి. ఒకప్పుడు నవ్వు నాలుగు విధాలా చేటు అనేవారు. కానీ కాలం మారింది. ఇప్పుడు నవ్వు నలభై విధాలా మేలు అంటున్నారు. చిన్న చిరునవ్వు స్నేహపరిమళాలనూ వెదజల్లుతుంది. మానసిక వేదనను దూరం చేస్తుంది. నేడు ‘ప్రపంచ నవ్వుల దినోత్సవం’ సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం.

సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: వేగవంతమైన ఆధునిక జీవన విధానంలో నిద్రలేచింది మొదలు రాత్రి పడుకునే వరకు బిజీబిజీగా గడుపుతుంటాం. వృత్తిపర, వ్యక్తిగత, కుటుంబపరమైన ఒత్తిళ్లు సరేసరి. వీటికి తోడు మారిన ఆహారపు అలవాట్లు మనిషి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. చిన్న వయసులోనే బ్రెయిన్‌ స్ట్రోక్, హార్ట్‌ స్ట్రోక్‌ బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఉదయం, సాయంత్రం వాకింగ్, జాగింగ్, రన్నింగ్‌తోపాటు వివిధ ఆటలు ఆడుతున్నారు. వీటికి తోడు నవ్వడం కూడా ఒక అంశంగా ఉంటే మరిన్ని మంచి ఫలితాలిస్తాయని చెబుతున్నారు. అయితే, సందర్భం లేకుండా నవ్వడం, ఎదుటివారిని అపహాస్యం చేస్తూ వెకిలిగా నవ్వడం వంటి వాటిని ఉద్దేశించి ‘నవ్వు నాలుగు విధాల చేటు’ అనేది కూడా ఉంది. కాగా, నవ్వుల్లోనూ అనేక రకాలున్నాయి. నోరు మూసుకొని లోలోపలే నవ్వుకోవడాన్ని ముసిముసి నవ్వు అంటుంటారు. పెదవులు విప్పకుండా వచ్చే ప్రశాంతమైన నవ్వును చిరునవ్వు అని, మందహాసం అని కూడా అంటారు. పగలబడి నవ్వడం, గట్టిగా నవ్వడాన్ని పకపక నవ్వు అంటారు. ఎగతాళి చేసేలా పెద్దగా నవ్వడాన్ని వికటాట్టహాసం అంటారు. అపహాస్యం చేసే నవ్వును వెకిలి నవ్వుగా పేర్కొంటారు.

సామాజిక మాధ్యమాల్లో పుట్లకొద్ది కామెడీ
ఫోన్‌ వాడుతున్న వారిలో దాదాపు అందరూ సామాజిక మాధ్యమాల ప్రభావంలో ఉంటారు. యూట్యూబ్, ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌ వంటి వాటితోపా టు వాట్సాప్‌లో కామెడీ కోసం కొన్ని గ్రూపులు ఏ ర్పాటు చేసుకొని అందులో రకరకాల హాస్య సన్నివేశాలను పోస్ట్‌ చేస్తుంటారు. ఈమధ్య కాలంలో చాలా మంది సామాజిక మాధ్యమాల్లో హాస్యం పండించే వీడియోలను ఎక్కువగా చూస్తున్నట్టు తెలుస్తోంది.

నలుగురు దోస్తులు కలిస్తే..
నలుగురు దోస్తులు కలిస్తే చాలు ఏదో ఒ క కామెడీ పండిస్తారు. ఇది మనకు తెలియకుండానే మనసుకు ఎంతో ఉల్లాసాన్నిస్తుంది. చా య్‌ తాగుతూ, అల్పాహారం తింటూనో మా ట్లాడుకుంటారు. అదే సందర్భంలో ఎవరినో ఉద్దేశించి కామెడీగా నవ్వుకోవడం పరిపాటి. వాకింగ్‌ చేస్తూ మాట్లాడడం, మధ్యమధ్యలో నవ్వులతో ఉల్లాసం పొందుతారు. అలాంటి నవ్వుల కోసమైనా దోస్తులతో కలవాల్సిందే. 

#

Tags : 1

Videos

మంత్రి టీజీ భరత్ అనుచరుడు వేధింపులకు యువకుడు బలి

వెరీ సాడ్.. ఒకే కుటుంబం ఆఖరి ప్రయాణం.. AI వీడియో..

స్టాఫ్ చేతులు కట్టేసి.. సంచుల నిండ బంగారంతో పరార్..

ఇంట్లో మొగుడు.. ఫోన్లో ప్రియుడు.. కొంపముంచుతున్న డేటింగ్ యాప్‌లు..

అయ్యో పాపం.. సాయి పల్లవి.. మొదటి అడుగే ఇలా అయ్యిందేంటి?

పాకిస్తాన్ లో ఉగ్రవాదులు ఖతం.. దురంధర్ పనేనా..?

ఒక్కటైన పాత మిత్రులు..

కరీంనగర్ జువెల్లరీ షాప్ లో దోపిడీ Live వీడియో

YSRCP నేత దశరథరామిరెడ్డితో పాటు పలువురిపై మంత్రి అనుచరుల దాడి

ఘటనకు ముందు నేను అక్కడే ఉన్న? కాల్పులపై బండి సంజయ్ రియాక్షన్

Photos

+5

ఉప్పల్‌ స్టేడియంలో ఐపీఎల్‌ మ్యాచ్‌..సెలబ్రిటీల సంద‌డి (ఫొటోలు)

+5

కుర్ర హీరోయిన్లకు పోటీ ఇచ్చేలా స్నేహ (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మే 03-10)

+5

నిర్మాత కూతురి పెళ్లి రిసెప్షన్‌లో టాలీవుడ్ స్టార్స్ సందడి (ఫొటోలు)

+5

రోజురోజుకీ మరింత అందంగా కాజల్ అగర్వాల్ (ఫొటోలు)

+5

యాంకర్ రష్మి ప్రీ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

చరణ్ అతిథిగా మెగా కోడలి సినిమా ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ సావిత్రి కుమార్తె 21 రోజుల వేడుక (ఫొటోలు)

+5

మిస్ యూనివర్స్ ఇండియా టు హీరోయిన్‌.. ఎవరీ రియా సింఘా? (ఫొటోలు)

+5

తెలంగాణలో గుహ మధ్య అద్భుతమైన ఆలయం (ఫొటోలు)