Breaking News

రిలయన్స్ రిటైల్ చేతికి ప్రియాంక చోప్రా అనోమలి

Published on Thu, 04/30/2026 - 18:26

రిలయన్స్ రిటైల్ లిమిటెడ్ (RRL) సంస్థ.. ప్రియాంక చోప్రాకు చెందిన గ్లోబల్ హెయిర్‌కేర్ బ్రాండ్ 'అనోమలి'(Anomaly)ని, దాని ట్రేడ్‌మార్క్‌లు, బ్రాండ్ ఆస్తులు, డిజిటల్ ప్రాపర్టీలతో సహా కొనుగోలు చేసినట్లు ప్రకటించింది. దీనికి సంబంధించిన ట్వీట్ కూడా కంపెనీ తన ఎక్స్ ఖాతాలో వెల్లడించింది.

అనోమలి కొనుగోలు.. రిలయన్స్ రిటైల్ బ్యూటీ పోర్ట్‌ఫోలియోను గణనీయంగా విస్తరించనుంది. అంతేకాకుండా, భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సంస్థ తన వృద్ధిని సాధించే బ్రాండ్‌లను నిర్మించి, విస్తరించాలనే దాని నిబద్ధతను కూడా ఇది బలపరుస్తుంది.

అనోమలి బ్రాండ్‌ను 2021లో ప్రముఖ నటి, వ్యాపారవేత్త ప్రియాంక చోప్రా ప్రారంభించారు. ఇది అందుబాటు ధరలో లభించే ఒక పాపులర్ హెయిర్‌కేర్ బ్రాండ్. ప్రారంభం నుంచే అత్యధిక ప్రజాదరణ పొందిన ఈ బ్రాండ్.. కొద్ది కాలంలోనే బలమైన అంతర్జాతీయ ఉనికిని ఏర్పరచుకుంది.

ఈ కొనుగోలుతో రిలయన్స్ రిటైల్ తమ బ్యూటీ అండ్ పర్సనల్ కేర్ రంగంలో ఉన్న పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరించింది. ఈ సంస్థ ఇప్పటికే భారతదేశంలో పెద్ద రిటైల్ నెట్‌వర్క్, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లను కలిగి ఉంది. ముఖ్యంగా టీరా వంటి ఓమ్నీచానల్ బ్యూటీ ప్లాట్‌ఫారమ్ ద్వారా వినియోగదారులకు విభిన్న బ్రాండ్లను అందిస్తోంది. ఇప్పుడు అనామలీ కూడా ఈ వ్యవస్థలో చేరడంతో, బ్రాండ్ మరింత వేగంగా విస్తరించే అవకాశం ఉంది.

రిలయన్స్ రిటైల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇషా అంబానీ ఈ కొనుగోలు గురించి మాట్లాడుతూ.. అనోమలి తమ బ్యూటీ పోర్ట్‌ఫోలియోలో ఒక ముఖ్యమైన భాగమవుతుందని చెప్పారు. ప్రత్యేకంగా భారత మార్కెట్‌పై దృష్టి పెట్టి.. జుట్టు, చర్మ అవసరాలకు అనుగుణంగా కొత్త ఉత్పత్తులను అభివృద్ధి చేస్తామని తెలిపారు. కాగా ప్రియాంక చోప్రా బ్రాండ్‌ క్రియేటివ్ డైరెక్టర్‌గా కొనసాగుతారని వెల్లడించారు.

Videos

ఎగ్జిట్ పోల్ ఇవ్వలేం, Axis My India రియాక్షన్

కూటమి నేతల ఆర్గనైజ్డ్ క్రైమ్! అక్షరం మార్పు లేకుండా మక్కికి మక్కీ

Sir పేరుతో అధికార పక్షం చేసే అవకతవకలు, మరింత జాగ్రత్తగా ఉండాలి

టీడీపీ ఆఫీసులకు భూ కేటాయింపు.. అమరావతి పేరుతో ఏపీ సర్కార్ మరో దుబారా

ప్రైవేట్ హ్యాకర్లను తెచ్చి ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు

తిరుమలలో కొత్త జంట సందడి

మంగ్లీ తమ్ముడి అకౌంట్ ఫ్రీజ్.. బయటపడ్డ షాకింగ్ నిజాలు

అది జగనన్న బ్రాండ్. మీరు ఎంత గింజుకున్నా అది అవ్వదు

ఆరెంజ్ అలర్.. ఢిల్లీలో వడగళ్ల వాన

విజయ్ దే గెలుపు.. 120 సీట్ల విజయం ఖాయం!

Photos

+5

తిరుచానూరు : వైభవంగా శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు (ఫోటోలు)

+5

మల్లెపూల దండలతో సురేఖవాణి బర్త్ డే వేడుక.. ఢిఫరెంట్‌ లుక్‌లో కనిపించిన నటి (ఫోటోలు)

+5

రికార్డుల రారాజు రోహిత్ శర్మకు బర్త్‌డే విషెస్ (ఫోటోలు)

+5

తిరుమలలో ఘనంగా బెల్లంకొండ శ్రీనివాస్, కావ్యల పెళ్లి (ఫోటోలు)

+5

ఎపిక్.. మూవీ టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

హీరోయిన్ మెహ్రీన్ మెహందీ వేడుక (ఫొటోలు)

+5

అభిమానులతో కలిసి సమంత బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

సొంతూరిలో పూజాహెగ్డే.. భక్తిలో మునిగిపోయి (ఫొటోలు)

+5

'గాయపడ్డ సింహం' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

పెళ్లి వేడుకల్లో టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ (ఫొటోలు)