Breaking News

రైలు టికెట్‌ బుకింగ్‌లోకి ఫ్లిప్‌కార్ట్‌ ‘క్లియర్‌ట్రిప్‌’

Published on Thu, 04/30/2026 - 13:16

ముంబై: ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన ఆన్‌లైన్‌ ట్రావెల్‌ ప్లాట్‌ఫారమ్‌ క్లియర్‌ట్రిప్‌ రైలు టికెట్‌ బుకింగ్‌ విభాగంలోకి ప్రవేశించింది. ఇందుకోసం ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ టూరిజం కార్పొరేషన్‌(ఐఆర్‌సీటీసీ)తో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు ట్రైన్‌ టికెటింగ్‌ సెగ్మెంట్‌లో సింగిల్‌ డిజిట్‌ మార్కెట్‌ వాటా సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఒప్పందం ద్వారా దేశవ్యాప్తంగా అన్ని రూట్లలో ప్రయాణికులు రైలు టికెట్లు బుక్‌ చేసుకునే వీలు కల్పించింది.

రైల్వే మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల మేరకు జనరల్, తత్కాల్‌ కోటాల్లో కూడా టికెట్లు అందుబాటులో ఉంటాయని సంస్థ తెలిపింది. అలాగే రియల్‌టైమ్‌ సీట్ల లభ్యత, చార్జీల వివరాలు, పీఎన్‌ఆర్‌ స్టేటస్‌ ట్రాకింగ్, బెర్త్‌ ఎంపికలు, సురక్షిత డిజిటల్‌ చెల్లింపులు వంటి సేవలను ఒకే ప్లాట్‌ఫారమ్‌పై అందుబాటులోకి తీసుకొచ్చింది. దేశంలో ప్రతి ఏటా 80 కోట్లకు పైగా రిజర్వేషన్‌ ప్రయాణికులు రైళ్లలో ప్రయాణిస్తున్న నేపథ్యంలో ఇది భారీ మార్కెట్‌ అవకాశమే కాకుండా, వినియోగదారులకు భిన్నమైన సేవా అనుభవాన్ని అందించే అవకాశం కూడా ఉందని క్లియర్‌ట్రిప్‌ ఎయిర్‌ విభాగం చీఫ్‌ బిజినెస్‌ ఆఫీసర్‌ గౌరవ్‌ పట్వారీ తెలిపారు.

ఈ ఏడాది ముగిసేలోపు ఆన్‌లైన్‌ ట్రావెల్‌ సర్వీసెస్‌ (ఓటీఎస్‌) విభాగంలో సింగిల్‌ డిజిట్‌ మార్కెట్‌ వాటా సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. రైలు ప్రయాణం భారత మొబిలిటీ ఎకోసిస్టమ్‌లో కీలక భాగమని, ఈ ప్రారంభం సమగ్ర బహుళ రవాణా సేవల వేదికగా ఎదగాలన్న సంస్థ లక్ష్యానికి కీలక అడుగని సంస్థ చీఫ్‌ బిజినెస్‌ ఆఫీసర్‌ మంజరీ సింఘాల్‌ తెలిపారు. దీంతో సంస్థ వృద్ధి వేగవంతమవడంతో పాటు పోటీ సామర్థ్యం పెరుగుతుందన్నారు. మొత్తం వ్యాపారంలో రైలు టికెట్‌ బుకింగ్‌ వాటా 5 నుంచి 10 శాతానికి చేరుతుందని, రాబోయే కొన్నేళ్లలో ఈ విభాగంలో వేగవంతమైన వృద్ధి నమోదవుతుందని సింఘాల్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

Videos

ఎగ్జిట్ పోల్ ఇవ్వలేం, Axis My India రియాక్షన్

కూటమి నేతల ఆర్గనైజ్డ్ క్రైమ్! అక్షరం మార్పు లేకుండా మక్కికి మక్కీ

Sir పేరుతో అధికార పక్షం చేసే అవకతవకలు, మరింత జాగ్రత్తగా ఉండాలి

టీడీపీ ఆఫీసులకు భూ కేటాయింపు.. అమరావతి పేరుతో ఏపీ సర్కార్ మరో దుబారా

ప్రైవేట్ హ్యాకర్లను తెచ్చి ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు

తిరుమలలో కొత్త జంట సందడి

మంగ్లీ తమ్ముడి అకౌంట్ ఫ్రీజ్.. బయటపడ్డ షాకింగ్ నిజాలు

అది జగనన్న బ్రాండ్. మీరు ఎంత గింజుకున్నా అది అవ్వదు

ఆరెంజ్ అలర్.. ఢిల్లీలో వడగళ్ల వాన

విజయ్ దే గెలుపు.. 120 సీట్ల విజయం ఖాయం!

Photos

+5

తిరుచానూరు : వైభవంగా శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు (ఫోటోలు)

+5

మల్లెపూల దండలతో సురేఖవాణి బర్త్ డే వేడుక.. ఢిఫరెంట్‌ లుక్‌లో కనిపించిన నటి (ఫోటోలు)

+5

రికార్డుల రారాజు రోహిత్ శర్మకు బర్త్‌డే విషెస్ (ఫోటోలు)

+5

తిరుమలలో ఘనంగా బెల్లంకొండ శ్రీనివాస్, కావ్యల పెళ్లి (ఫోటోలు)

+5

ఎపిక్.. మూవీ టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

హీరోయిన్ మెహ్రీన్ మెహందీ వేడుక (ఫొటోలు)

+5

అభిమానులతో కలిసి సమంత బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

సొంతూరిలో పూజాహెగ్డే.. భక్తిలో మునిగిపోయి (ఫొటోలు)

+5

'గాయపడ్డ సింహం' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

పెళ్లి వేడుకల్లో టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ (ఫొటోలు)