Breaking News

నా భర్త చనిపోయి ఏడాది.. ఇన్సూరెన్స్‌పై ఇప్పుడు అత్త కేసు!

Published on Wed, 04/29/2026 - 09:24

నా భర్త చనిపోయి ఏడాది కావస్తుంది. నాకు ఒక కూతురు. ఆయన పేరుతో లైఫ్‌ ఇన్సూరెన్స్ పాలసీలు ఉన్నాయి. అన్నిటిలో నామినీగా నేనే ఉన్నాను. కానీ ఇప్పుడు మా అత్తగారు కన్జ్యూమర్‌ కోర్టులో కేసు వేసి ఆ ఇన్సూరెన్స్‌ క్లెయిమ్‌లో తనకు కూడా భాగం ఉంది అని అంటుంది. నేనంటే ఆవిడకి అస్సలు పడదు. లీగల్‌ హేర్‌ కోసం కూడా కేసు వేసింది. తన పేరును రాయకపోయినా మా అత్తగారికి ఇన్సూరెన్స్‌లో భాగం ఉంటుందా?
– శ్రేష్ఠ, వికారాబాద్‌

మీరు చెప్పిన అంశాలను రెండు భాగాలుగా విడదీసి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మొదటిది మీ అత్తగారికి ఉన్న చట్టపరమైన హక్కు. మీ భర్తకు తల్లిగా, ఎటువంటి వీలునామా లేని పక్షంలో మీ భర్తకి చెందిన ప్రతి ఆస్తిలోనూ, లబ్ధిలోను తనకు సమానమైన వాటా ఉంటుంది. అలాగే మీ కూతురికి కూడా వాటా వస్తుంది. దానిపై మీకు హక్కు ఉండదు. కాబట్టి తను అడుగుతున్న లీగల్‌ హేర్‌ కేసులో అన్ని ఆస్తులకుగాను తన కూడా సమాన భాగస్తురాలే అని కోర్టు తీర్పు ఇచ్చే అవకాశం ఉంది. ఒకవేళ మీ భర్త వీలునామా రాసి ఉంటే ఆ వీలునామా ప్రకారం మాత్రమే ఆస్తి పంపకాలు జరుగుతాయి. అప్పుడు లీగల్‌ హేర్‌ అనేది వర్తించదు. 

ఇక రెండవ అంశం... మీ భర్త ఇన్సూరెన్స్ ఎప్పుడు తీసుకున్నారో చెప్పలేదు. ఏది ఏమైనా, ఇన్సూరెన్స్ చట్టం, 2015లో జరిగిన సవరింపు తర్వాత ఇన్సూరెన్స్ తీసుకున్న వ్యక్తి ‘‘బెనిఫిషియల్‌ నామిని’’గా ఎవరైనా ఒక కుటుంబ సభ్యుల పేరు (తల్లి, భార్య, భర్త, పిల్లలు మాత్రమే) ప్రత్యేకంగా నిర్దేశించినట్లయితే కేవలం ఆ కుటుంబ సభ్యులకి మాత్రమే ఇన్సూరెన్స్  తాలూకా నగదు చెందుతుంది. ఇతరులకు ఎవరికీ ఆ నగదులో హక్కు ఉండదు. నామినీగా ఎవరి పేరునీ నిర్దేశించకపోతే చట్టపరంగా లీగల్‌ హేర్లు ఎంతమంది ఉంటే అంతమందికి సమాన వాటా వస్తుంది. 

మీరు చెప్పే దాన్ని బట్టి చూస్తుంటే, 2015 చట్ట సవరణ మీకు వర్తించవచ్చు. ఎందుకంటే మీ భర్త చనిపోయింది 2015 సవరింపు తర్వాతే గనుక! ఒకసారి ఇన్సూరెన్స్ పేపర్లు మొత్తం క్షుణ్ణంగా పరిశీలించండి. మిమ్మల్ని ఏ విధమైన బెనిఫిషియల్‌ గా నిర్ధారించారో చూడండి. మీ భర్త కోరిక మేరకు మాత్రమే ఆ నగదు ఎవరికి దక్కాలో వారికి దక్కుతుంది. మీ అత్తగారితో సామరస్యంగా పరిష్కారం సాధ్యమేమో చూడండి. ఆ దిశలో కూడా కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకుంటే కుటుంబ బంధాలు సాఫీగా సాగే అవకాశం ఉంటుంది. 


శ్రీకాంత్‌ చింతల
హైకోర్టు న్యాయవాది
మీకున్న న్యాయపరమైన 
సమస్యలు, సందేహాల కోసం sakshifamily3@gmail.comకు మెయిల్‌ చేయవచ్చు.  

Videos

ఎగ్జిట్ పోల్ ఇవ్వలేం, Axis My India రియాక్షన్

కూటమి నేతల ఆర్గనైజ్డ్ క్రైమ్! అక్షరం మార్పు లేకుండా మక్కికి మక్కీ

Sir పేరుతో అధికార పక్షం చేసే అవకతవకలు, మరింత జాగ్రత్తగా ఉండాలి

టీడీపీ ఆఫీసులకు భూ కేటాయింపు.. అమరావతి పేరుతో ఏపీ సర్కార్ మరో దుబారా

ప్రైవేట్ హ్యాకర్లను తెచ్చి ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు

తిరుమలలో కొత్త జంట సందడి

మంగ్లీ తమ్ముడి అకౌంట్ ఫ్రీజ్.. బయటపడ్డ షాకింగ్ నిజాలు

అది జగనన్న బ్రాండ్. మీరు ఎంత గింజుకున్నా అది అవ్వదు

ఆరెంజ్ అలర్.. ఢిల్లీలో వడగళ్ల వాన

విజయ్ దే గెలుపు.. 120 సీట్ల విజయం ఖాయం!

Photos

+5

తిరుచానూరు : వైభవంగా శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు (ఫోటోలు)

+5

మల్లెపూల దండలతో సురేఖవాణి బర్త్ డే వేడుక.. ఢిఫరెంట్‌ లుక్‌లో కనిపించిన నటి (ఫోటోలు)

+5

రికార్డుల రారాజు రోహిత్ శర్మకు బర్త్‌డే విషెస్ (ఫోటోలు)

+5

తిరుమలలో ఘనంగా బెల్లంకొండ శ్రీనివాస్, కావ్యల పెళ్లి (ఫోటోలు)

+5

ఎపిక్.. మూవీ టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

హీరోయిన్ మెహ్రీన్ మెహందీ వేడుక (ఫొటోలు)

+5

అభిమానులతో కలిసి సమంత బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

సొంతూరిలో పూజాహెగ్డే.. భక్తిలో మునిగిపోయి (ఫొటోలు)

+5

'గాయపడ్డ సింహం' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

పెళ్లి వేడుకల్లో టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ (ఫొటోలు)