కల్లోల మార్కెట్లకు క్రమశిక్షణే జవాబు

Published on Mon, 04/27/2026 - 05:14

ఒక్క ట్వీట్‌తో మార్కెట్లు ఒకటిరెండు శాతం పడిపోవటం... అలాగే పెరిగిపోవటం జరుగుతోంది. అసలు మార్కెట్ల డైరెక్షన్‌ ఎటో ఎవరికీ అర్థం కావటం లేదు. ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా సాగిస్తున్న యుద్ధం ఎలా ముగుస్తుందో, ఎప్పటికి ముగుస్తుందో ఇప్పటికైతే క్లారిటీ లేదు. చమురు ధరలు బీభత్సంగా పెరుగుతున్నాయి. రూపాయి దారుణంగా పడిపోయింది. చాలామంది ఇన్వెస్టర్లు ఇప్పటికే నష్టపోయారు. ఈ తరహా ఊగిసలాటలో సొమ్ము చేసుకోవాలనుకుంటే చిన్న ఇన్వెస్టర్లకది సాధ్యం కాదు. మరేం చెయ్యాలి? దీన్నుంచి పోర్టుఫోలియోను కాపాడుకోవటమెలా? దీనిపై ఫోకస్‌ చేస్తున్నదే ఈ ‘సాక్షి వెల్త్‌’ స్టోరీ...

మ్యూచ్‌వల్‌ ఫండ్ల ద్వారా కావచ్చు... నేరుగా కావచ్చు. మార్కెట్లలో ఇన్వెస్ట్‌ చేస్తున్న వారు గుర్తుంచుకోవాల్సిందొక్కటే. ఊగిసలాటలు, కల్లోలాలు మార్కెట్‌కు సహజం. అసాధారణమేమీ కాదు. మనం ఆలోచించాల్సిందేంటంటే మార్కెట్లు ఇంకా ఎంత పడతాయనేది కాదు. దానికి మనమెలా స్పందించాలనేదే.  

మార్కెట్లు శాశ్వతం... హెచ్చుతగ్గులు తాత్కాలికం 
మార్కెట్‌ కరెక్షన్లు నాటకీయంగా ఉంటాయి. ఇక కోలుకోవేమో అనేంత భయం పుట్టిస్తాయి. పోర్టుఫోలియో విలువ పడిపోతుంది. వార్తలన్నీ నిరాశాజనకంగానే ఉంటాయి. ఇదిగో... ఇలాంటి దశలోనే చాలామంది ఇన్వెస్టర్లు తమ సిస్టమాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్లను (సిప్‌) తాత్కాలికంగానో, శాశ్వతంగానో నిలిపేస్తుంటారు. కాకుంటే ఇది చాలా ఖరీదైన పొరపాటు. ఎందుకంటే తెలివైన ఇన్వెస్టరుకు ఇవన్నీ తాత్కాలికమని, సంపద సృష్టి అనేది దీర్ఘకాలికమని స్పష్టమైన అవగాహన ఉంటుంది. ఎందుకంటే మార్కెట్లు పతనమైనపుడే సిప్‌ బలంగా మారుతుంది.  
→ అదే మొత్తానికి ఎక్కువ యూనిట్లు వస్తాయి. 
→ దీనివల్ల సగటు ఖరీదు ధర తగ్గుతుంది.  
→ మార్కెట్లు రికవరీ అవుతున్నపుడు పెరుగుదల వేగంగా ఉంటుంది.  
→ ఈ రుపీ కాస్ట్‌ యావరేజింగ్‌ అనేదే దీర్ఘకాలిక సంపద సృష్టికి ఇంజిన్‌లా పనిచేస్తుంది.

అసలైన మంత్రం... అసెట్‌ అలొకేషన్‌ 
డైవర్సిఫైడ్‌ పోర్టుఫోలియో ఉంటే రిస్కు పూర్తిగా పోకున్నా తగ్గుతుంది. ఎందుకంటే ఈ అసెట్లు రకరకాలుగా పనిచేస్తాయి. ఈక్విటీ వృద్ధికి తోడయితే డెట్‌ ఫండ్లు స్థిరత్వాన్ని ఇస్తాయి. బంగారం అనేది ఈ రెండింటికీ హెడ్జ్‌గా పనిచేస్తుంది. దీర్ఘకాలిక ఇన్వెస్టర్లకు ఈ డైవర్సిఫికేషన్‌ అనేది ఆప్షనల్‌ కాదు. తప్పనిసరి.  
లైఫ్‌సైకిల్‌ ఫండ్స్‌లో క్రమశిక్షణే ‘పెట్టుబడి’ 
లైఫ్‌సైకిల్‌ ఫండ్స్‌... ఇవి ఏం చేస్తాయనేది వీటి పేరులోనే ఉంది. ఇవి మన జీవితానికి తగ్గట్టుగా ఇన్వెస్ట్‌మెంట్‌ చేస్తాయి. అంటే.. తొలినాళ్లలో ఈక్విటీల్లో ఎక్కువ మొత్తాన్ని పెడతాయి. మెల్లగా తగ్గించుకుంటూ వెళతాయి. లక్ష్యానికి చేరువయ్యే కొద్దీ... డెట్‌లో మొత్తాన్ని పెంచుకుంటూ వెళతాయి. ఉదాహరణకు... 
→ లక్ష్యంలోని తొలి 20–30 ఏళ్లలో ఈక్విటీల్లో ఎక్కువ ఇన్వెస్ట్‌ చేస్తాయి.  
→ తరువాతి 5–10 ఏళ్లు బ్యాలెన్స్‌డ్‌గా ముందుకెళతాయి.  
→ మెచ్యూరిటీకి దగ్గరయ్యేటపుడు డెట్‌పై ఫోకస్‌ పెంచుతాయి. 
→ ఇలా ఆటోమేటిక్‌ రీబ్యాలెన్సింగ్‌ ద్వారా ఇన్వెస్ట్‌మెంట్ల సమయంలో భావోద్వేగాలకు తావుండదు.  
→ అలాగని ఇవేమీ రిసు్కలేకుండా ఉండవు. లైఫ్‌సైకిల్‌ ఫండ్స్‌లో ఫండ్‌ మేనేజర్‌ అలొకేషన్‌ నిర్ణయాలను ఇన్వెస్టర్లు గమనిస్తూ ఉండాలి. ఖర్చుల నిష్పత్తిని, పన్ను ప్రభావాన్ని, మెచ్యూరిటీకి దగ్గర పడుతున్నపుడు పోర్టుఫోలియో తీరును నిశితంగా పరిశీలించాలి. ఎందుకంటే ఒకేరకమైన స్ట్రక్చర్‌ ఉన్నా... ఫండ్‌ మేనేజర్ల కారణంగా ఫండ్ల పనితీరు మాత్రం వేరుగా ఉండొచ్చు.  

సిప్‌ నిలిపేయటమే అసలు తప్పు
అన్నిటికన్నా సంపద సృష్టికి అడ్డంపడేది మార్కెట్ల పతనం కాదు. ఇన్వెస్టర్ల వైఖరే. ఎందుకంటే భయం తారస్థాయికి వెళ్లినపుడు... 
→ ఇన్వెస్టర్లు సిప్‌ను నిలిపేస్తారు. 
→ ఈక్విటీ ఫండ్ల నుంచి పూర్తిగా వైదొలుగుతారు. 

క్లారిటీ కోసం దీర్ఘకాలం వేచిచూస్తారు.  కాకపోతే... ఈ క్లారిటీ వచ్చేసరికి మార్కెట్లు పెరిగిపోయి ఉంటాయి. సింపుల్‌గా చెప్పాలంటే సాధారణ ఇన్వెస్టర్లెపుడూ తక్కువ ఖరీదులో అమ్మేసి బాగా పెరిగాక కొంటుంటారు. తెలివైన ఇన్వెస్టర్లు మాత్రం దీనికి వ్యతిరేకంగా చేస్తారు. అదే తేడా.

మార్కెట్‌ టైమింగ్‌ ముఖ్యమేనా? 
చాలామంది ఇన్వెస్టర్లు మార్కెట్లలో ఎంట్రీ, ఎగ్జిట్ల కోసం సరైన సమయం కోసం చూస్తుంటారు. నిజానికి నిపుణులకు కూడా ఇవి సరిగ్గా తెలుసుకోవటం సాధ్యం కాదు. అందుకే ఇన్వెస్ట్‌మెంట్లను కొనసాగిస్తూ ఉండటం... క్రమం తప్పకుండా ఇన్వెస్ట్‌ చేస్తూ పోవటం... మన అసెట్‌ అలొకేషన్‌కు కట్టుబడి ఉండటం తప్పనిసరి. నిపుణులు చెప్పేదేంటంటే మార్కెట్లలో సమయం కోసం ఎదురుచూడటం కన్నా... ఎక్కువ సమయం ఉండటమే లాభాన్నిస్తుందని.

ఇన్వెస్టర్లు ఇప్పుడేం చెయ్యాలి? 
ఇప్పుడు పరిస్థితులేమీ అంత స్థిరంగా లేవు. క్రమశిక్షణతోనే దీనికి చెక్‌ పెట్టడం సాధ్యమవుతుంది. అందుకని చేయాల్సిందేంటంటే... 
→ సిప్‌లను ఆపేయకుండా నిరంతరం కొనసాగించండి.  
→ పోర్టుఫోలియో విలువను చూడకుండా... అసెట్‌ అలొకేషన్‌ను సమీక్షించుకోండి.  
→ భావోద్వేగాలతో నిర్ణయాలు తీసుకోవద్దు. ఎందుకంటే భయం, ఆశ సంపద సృష్టికి శత్రువులుగా మారతాయి.  
→ లక్ష్యాలకు తగ్గట్టుగా ఇన్వెస్ట్‌మెంట్లు కొనసాగించండి. షార్ట్‌టర్మ్‌ ట్రెండ్‌ను బట్టి కాకుండా దీర్ఘకాల పనితీరు ఆధారంగా ఫండ్లను ఎంచుకోండి.  
→ మీకు క్రమశిక్షణ లేదని మీరు భావిస్తే లైఫ్‌సైకిల్‌ ఫండ్స్‌ను ఎంచుకోండి. వాటిలో ఆటోమేటిక్‌ రీబ్యాలెన్సింగ్‌ ఉంటుంది... భావోద్వేగాల పరమైన తప్పులు జరగవు. 

Videos

పెట్రోల్, డీజిల్ కొరత.. బంక్ ల వద్ద బారులు తీరిన వాహనదారులు

భయపడొద్దు.. జగన్ మనకు తోడుగా ఉన్నారు..!

24 గంటల్లో 2 హత్యలు.. కేతిరెడ్డి పెద్దారెడ్డి సంచలన వ్యాఖ్యలు

గోల్డ్ మార్కెట్ లో ఊహించని ప్రళయం.. మళ్లీ లక్ష రూపాయలకు బంగారం ధర?

BRS ఆవిర్భావ దినోత్సవం.. కవిత కొత్తపార్టీ పై కేసీఆర్..!?

జగనన్నతోనే సంక్షేమం అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా.. అని సోషల్ మీడియాలో పోస్టులు

క్రిమినల్ గా మారిన బెస్ట్ టీచర్.. కోల్ అలెన్ కి ఏమైంది?

No పెట్రోల్.. No డీజిల్.. ఈ పాపం సర్కారుదే!

ఆ వీడియోలతో బెదిరించి కోట్లు.. TDP నేతల గలీజ్ దందాలో పోలీసులపై యాక్షన్

మా డాడీని కొట్టి లాక్కెళ్లారు.. పోలీసుల ఓవర్ యాక్షన్

Photos

+5

హైదరాబాద్ : ఆకట్టుకున్న ‘సాక్షి’ హ్యాపీ కిడ్స్‌ ఈవెనింగ్‌ (ఫొటోలు)

+5

హనీ ఈజ్‌ ది బెస్ట్‌.. పెళ్లి చేసుకున్న నటి మోహరీన్‌ (ఫోటోలు)

+5

ఈవెంట్‌లో జంటగా అల్లు శిరీష్-నయనిక (ఫొటోలు)

+5

ఫ్రెండ్స్‌తో నైట్ పార్టీలో హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

అంబానీ ఇంట పాప్ స్టార్ రిహన్నా సందడి.. ఆటపాటలతో కోలాహలం (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఏప్రిల్ 26-మే 03)

+5

‘వాలా 2’ మూవీ సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)

+5

'గాయపడ్డ సింహం' ట్రైలర్ లాంచ్‌ (ఫొటోలు)

+5

మాళవిక మోహనన్ గ్లామర్ ధమాకా (ఫొటోలు)

+5

అందమైన అంబానీ ఫ్యామిలీ.. ఐకానిక్‌ ఫొటోలు