Breaking News

అందం కోసం ఫేస్‌ప్యాక్‌గా రొట్టెల పిండి..!

Published on Sun, 04/26/2026 - 16:48

వయసుతో పాటు వచ్చే ముడతలను తగ్గించడానికి బ్యూటీ క్లినక్స్‌లో సాధారణంగా గాఢమైన యాసిడ్లను వాడుతుంటారు. కానీ, ‘బీక్‌మన్‌ 1802’ సంస్థ ‘బెటర్‌–ఏజింగ్‌’ అనే కొత్త విధానంతో ముందుకు వచ్చింది. ఈ సంస్థ తాజా ఆవిష్కరణ మిల్క్‌ ఆర్‌ఎక్స్‌ కంప్రెస్‌. ఇది మాస్క్‌లా మాత్రమే కాకుండా, మెడికల్‌ గ్రేడ్‌ ట్రీట్‌మెంట్‌లా పనిచేస్తుంది. చాలా షీట్‌ మాస్క్‌లు నీళ్లలా ఉండే పల్చని సీరమ్‌లతో తయారవుతాయి. ఇవి త్వరగా ఆరిపోతాయి. కానీ మిల్క్‌ ఆర్‌ఎక్స్‌ కంప్రెస్, క్రీమ్‌తో నిండిన సాంకేతికతతో రూపొందించినది. 

రెనెక్సోసోమ్‌ కాంప్లెక్స్, మేకపాలు, మొండో గ్రాస్‌ పదార్థాలు ఈ మాస్క్‌కి ప్రత్యేకం. రెనెక్సోసోమ్‌ కాంప్లెక్స్‌ రెటినాల్‌ కంటే నాలుగు రెట్లు వేగంగా కొలాజెన్‌ను ఉత్పత్తి చేసి, చర్మంపై ముడతలను తగ్గిస్తుంది. మేకపాలలో ఉండే విటమిన్లు, ఖనిజ లవణాలు, ప్రీబయోటిక్స్‌చర్మం పీహెచ్‌ స్థాయిని సమతుల్యం చేసి, దెబ్బతిన్న చర్మాన్ని కేవలం 20 నిమిషాల్లోనే రిపేర్‌ చేస్తాయి. మొండో గ్రాస్‌ చర్మానికి అవసరమైన తేమను అందించి, రక్షణ కవచంలా పనిచేస్తుంది.

ఈ మాస్క్‌ ముఖానికి వేసుకున్నప్పుడు చల్లటి అనుభూతిని ఇస్తుంది. మంచు నీటిలో ముఖాన్ని ఉంచినట్లుగా చల్ల బరుస్తూ, రక్తనాళాలను కుంచించుకుపోయేలా చేస్తుంది. దీనివల్ల చర్మంపై ఉండే ఎరుపుదనం తగ్గి ఉపశమనం కలుగుతుంది. చర్మంపై దీర్ఘకాలిక వాపును కూడా ఇది సమర్థంగా అడ్డుకుంటుంది. ఈ మిల్క్‌ ఆర్‌ఎక్స్‌ కంప్రెస్‌ డిజైన్‌ కూడా భిన్నంగా ఉంటుంది. ఇందులో ప్రత్యేకమైన చిన్‌ స్ట్రాప్‌ ఉంటుంది. ఇది గడ్డం కింద చర్మాన్ని పట్టి ఉంచి, ముఖానికి తీరైన ఆకారాన్ని ఇస్తుంది. ఈ మాస్క్‌ను వారానికి ఒకసారి వాడటం వల్ల కొలాజెన్‌ స్థాయి గణనీయంగా పెరిగి, చర్మం యవ్వనంగా, కాంతి మంతంగా మారుతుంది.

రొట్టెల పిండి ఫేస్‌ప్యాక్‌
ప్రాచీన రోమన్‌ ప్రజలు రొట్టెల పిండిని ఫేస్‌ప్యాక్‌గా ఉపయోగించేవారు. రొట్టెల పిండిని ముఖానికి పట్టించుకోవడం వల్ల ముఖం ముడతలు పడకుండా ఉంటుందని నమ్మేవారు. క్రీస్తుశకం ఒకటో శతాబ్దికి చెందిన రోమన్‌ చక్రవర్తి ఓథో ప్రతిరోజూ స్నానానికి ముందు గడ్డం మీసం నున్నగా గీసేసుకుని, ముఖానికి రొట్టెల పిండి పట్టించుకునేవాడట!

తాజా మెంతి ఆకులను మెత్తగా రుబ్బి  రాత్రి పడుకునే ముందు ముఖానికి పట్టించి ఉదయం కడగాలి. మెంతి ఆకులను వాడేటప్పుడు వాటిని ముందుగా శుభ్రం చేయాలి. వాటి మీద చల్లిన క్రిమిసంహారక మందుల అవశేషాలు లేకుండా శుభ్రం చేసిన తర్వాత మాత్రమే గ్రైండ్‌ చేయాలి. ఈ ప్యాక్‌ క్రమం తప్పకుండా  మూడు వారాల పాటు వేస్తే మొటిమలు, బ్లాక్‌హెడ్స్, వైట్‌హెడ్స్‌ తొలగి చర్మం నునుపుగా మారుతుంది. 

#

Tags : 1

Videos

కాల్చింది మెకానికల్ ఇంజనీర్, ఉన్నత విద్యాంతుడు కూడా.. ఎందుకు చేశాడంటే..!

పడకపై కాటు - షాకింగ్ ఘటన! వేసవిలో సర్పాల ముప్పు

మాలీవుడ్ న్యూ ఇండస్ట్రీ హిట్ గా వాలా 2.!

విశాఖలో కుప్పకూలిన రైల్వే బ్రిడ్జి

"కాల్పులు అయిపోయాయి ఇక తినండి.." ట్రంప్ షాకింగ్ రియాక్షన్

వరుణాస్త్రతో భారత్ సత్తా.. ఇక సముద్రంలో శత్రుదుర్భేద్యం

పవన్ కళ్యాణ్ అనారోగ్యంపై పేర్ని నాని రియాక్షన్

No పెట్రోల్.. No డీజిల్.. APలో వాహన దారుల కష్టాలు

లేస్తే మనిషిని కాను

ఏపీలో డీజిల్, పెట్రోల్ కొరత.. తండ్రి, కొడుకు ఏం పీకుతున్నారు

Photos

+5

ఈవెంట్‌లో జంటగా అల్లు శిరీష్-నయనిక (ఫొటోలు)

+5

ఫ్రెండ్స్‌తో నైట్ పార్టీలో హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

అంబానీ ఇంట పాప్ స్టార్ రిహన్నా సందడి.. ఆటపాటలతో కోలాహలం (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఏప్రిల్ 26-మే 03)

+5

‘వాలా 2’ మూవీ సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)

+5

'గాయపడ్డ సింహం' ట్రైలర్ లాంచ్‌ (ఫొటోలు)

+5

మాళవిక మోహనన్ గ్లామర్ ధమాకా (ఫొటోలు)

+5

అందమైన అంబానీ ఫ్యామిలీ.. ఐకానిక్‌ ఫొటోలు

+5

తిరుమల శ్రీవారి సేవలో 'ఉయ్యాల జంపాలా' నటి (ఫొటోలు)

+5

తెలంగాణ ప్రజలకు అమ్మగా మారాలనుకుంటున్నా.. కవిత పార్టీ ప్రకటన (ఫొటోలు)