Breaking News

బెస్టే ఫస్ట్‌

Published on Sun, 04/26/2026 - 01:44

‘చేసే ప్రతి పనిలోనూ బెస్ట్‌ ఇస్తే అదే మనల్ని ఒకరోజు అందరిముందు గొప్పగా నిలుపుతుంది’ అంటున్నారు. హైదరాబాద్‌ వాసి చిలకలపూడి ఇందు ఫల్గుణి. 
ఈ నెల ఫెమినా మిస్‌ ఇండియా సౌత్‌ కిరీటం గెలుచుకొని దక్షిణాది అందాల భామగా నిలిచారు. ఈ సందర్భంగా ఇందు ఫల్గుణి పంచుకున్న విశేషాలు...

బ్యూటీ రంగంలో రాణించాలనుకుంటున్నాను. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఆంధ్ర మహిళాసభలో ఎల్‌ఎల్‌బి థర్డ్‌ ఇయర్‌ చదువుతున్నాను. వృత్తిరీత్యా జడ్జిగా ఎదగాలనుకుంటున్నాను. తెలుగు భాషపైన పట్టు సాధించాలనే ఆలోచనతో సాహిత్యాన్నీ చదువుతుంటాను. – ఇందు ఫల్గుణి

‘‘కలలను నెరవేర్చుకోవడానికి ప్రతి ఒక్కరూ కృషి చేస్తుంటారు. నేనూ చిన్నప్పటి నుంచి మోడలింగ్‌లోకి వెళ్లాలి, అందాలపోటీలలో పాల్గొనాలి, సినిమాలలో నటించాలి, జాతీయస్థాయి బ్యూటీ కాంటెస్ట్‌ వేదికపైన నించోవాలి.. అనుకునేదానిని. ఈ కల చిన్నప్పటి నుంచి ఉన్నా ‘నేను చేయగలనా?’ అనే సందేహం ఎప్పుడూ ఉండేది. ఆ సందేహాన్ని తీసేసి, ‘చేయగలను..’ అని ఎప్పుడైతే అనుకున్నానో ఆ రోజు నుంచి కృషి చేయడం మొదలుపెట్టాను. నా చూపు బ్యూటీ కాంటెస్ట్‌ల వైపు ఉండేది కాబట్టి నన్ను నేను మెరుగ్గా చేసుకోవడానికి వరల్డ్‌ బ్యూటీస్‌గా పేరొందిన ఐశ్వర్యా రాయ్, లారాదత్తా, సుస్మితాసేన్‌ ల గురించి సమగ్రంగా తెలుసుకునేదానిని.  

ప్రోత్సాహంతో ముందడుగు...
మా తమ్ముడు యాడ్‌ ఫిల్మ్‌లో పాల్గొనేవాడు. నేను ఆ యాడ్‌ ఫిల్మ్‌మేకింగ్‌కి వెళ్లి, దూరంగా కూర్చొని చూస్తుండేదాన్ని. కొన్ని రోజులకు ఆసక్తిగా అనిపించి, నేనూ ఆ యాడ్స్‌లో పాల్గొన్నాను. అలా తొమ్మిదేళ్ల వయసు నుంచి మోడలింగ్‌ చేస్తున్నాను. మధ్యలో కొంత గ్యాప్‌ వచ్చింది. కాలేజీకి వచ్చాక అమ్మ నాగలక్ష్మి, నాన్న మహేష్‌ ప్రోత్సాహంతో మళ్లీ మోడలింగ్‌ మొదలుపెట్టాను. కూచిపూడి డ్యాన్సర్‌గానూ సాధన చేస్తున్నాను. మధ్యతరగతి కుటుంబం నేపథ్యం నాకున్న కలను నెరవేర్చుకోవడానికి అమ్మానాన్నలకు భారం కాకూడదు అనుకున్నాను. అందుకు, యూ ట్యూబ్‌లో మేకప్, మేకోవర్‌ గురించి రెండేళ్లపాటు  ప్రాక్టీస్‌ చేశాను. అది సరిపోదని, ముంబైకి వెళ్లి అక్కడి అకాడమీలో చేరి శిక్షణ తీసుకున్నాను.

గ్లామర్‌ మాత్రమే కాదు
అందాలపోటీలు అంటే గ్లామర్‌ మాత్రమే అనుకుంటారు చాలామంది. క్యాన్సర్, ఆటిజం సమస్య ఉన్న చిల్డ్రన్‌ కోసం ఫండ్‌ రైజ్‌ చేస్తుంటాను. అంటే.. సేవాగుణం, ఆత్మవిశ్వాసం, ప్రతిభ, వ్యక్తిత్వం, ఆలోచన, కమ్యూనికేషన్‌ స్కిల్స్, సాధన.. అన్నీ ఈ కేటగిరీలోకి వస్తాయి. స్టేజ్‌పైన వాక్‌ కోసం ఆరు ఇంచుల హీల్‌ మీద గంటలు గంటలు నిల్చోవాలి. తర్వాత నేల మీద కాలు పెట్టి, నిలబడటానికిæఎంత నొప్పి ఉంటుందో చెప్పలేం. ఎంతో సహనం కూడా ఉండాలి. ఇంత తపన పడుతున్నా చుట్టుపక్కలవారి నుంచి, బంధువుల నుంచి విమర్శలు కూడా ఎదురయ్యాయి. అవన్నీ పట్టించుకోకుండా ఏం సాధించాలనుకున్నామో ఆ లక్ష్యంవైపే దృష్టి పెట్టాలనుకున్నాను.

ప్రతి రాష్ట్రంలో ఓ ఇల్లు..
భువనేశ్వర్‌లోని క్విట్‌ యూనివర్శిటీలో ఈ బ్యూటీ కాంటెస్ట్‌ జరిగింది. నలబైవేల మందికి పైగా విద్యార్థులు, లెక్చరర్లు పువ్వులతో మాకు స్వాగతం పలికారు. ఆ అనుభూతి మాటల్లో చెప్పలేనంత గొప్పది. ఈ అందాలపోటీకి దేశంలోని ప్రతి రాష్ట్రం నుంచి ఒక్కొక్కరు చొప్పున ముప్పైమందిమి ఎంపికయ్యాం. ఇరవై ఐదు రోజుల పాటు ముప్పైమందిమి తోబుట్టువుల్లా కలిసిపోయాం. అన్ని రాష్ట్రాల విభిన్న రుచులు, సంస్కృతులు.. మాకు పరిచయం అయ్యాయి. మేం ఉన్న రోజుల్లోనే ఒడిస్సా, కేరళ, తమిళనాడు నూతన సంవత్సరాది వేడుకలు కూడా జరిగాయి.

పండగలు జరుపుకోవడం, ఒకరికొకరం సాయం చేసుకోవడం, అక్కచెల్లెళ్లలా సరదాగా గడపడం.. ప్రతిరోజూ ఒక వేడుకే. మేం ఇప్పుడు ఏ రాష్ట్రానికి వెళ్లినా, అక్కడ మాకో ఇల్లు ఉంది. అంతగా కలిసిపోయాం. లక్షలాది మంది ఈ బ్యూటీ కాంటెస్ట్‌కుపోటీ పడుతుంటారు. అంతమందితోపోటీపడి వేదికపై వరకు వెళ్లడమే గొప్ప అనుకున్నాను. అలాంటిది తెలుగు అమ్మాయిగా ఈ గౌరవం దక్కడం ఎంతో ఆనందంగా ఉంది’’ అంటూ పట్టువదలకుండా చేసిన కృషిని వివరించింది ఈ బ్యూటీ.
– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్‌ ప్రతినిధి

Videos

కాల్చింది మెకానికల్ ఇంజనీర్, ఉన్నత విద్యాంతుడు కూడా.. ఎందుకు చేశాడంటే..!

పడకపై కాటు - షాకింగ్ ఘటన! వేసవిలో సర్పాల ముప్పు

మాలీవుడ్ న్యూ ఇండస్ట్రీ హిట్ గా వాలా 2.!

విశాఖలో కుప్పకూలిన రైల్వే బ్రిడ్జి

"కాల్పులు అయిపోయాయి ఇక తినండి.." ట్రంప్ షాకింగ్ రియాక్షన్

వరుణాస్త్రతో భారత్ సత్తా.. ఇక సముద్రంలో శత్రుదుర్భేద్యం

పవన్ కళ్యాణ్ అనారోగ్యంపై పేర్ని నాని రియాక్షన్

No పెట్రోల్.. No డీజిల్.. APలో వాహన దారుల కష్టాలు

లేస్తే మనిషిని కాను

ఏపీలో డీజిల్, పెట్రోల్ కొరత.. తండ్రి, కొడుకు ఏం పీకుతున్నారు

Photos

+5

ఈవెంట్‌లో జంటగా అల్లు శిరీష్-నయనిక (ఫొటోలు)

+5

ఫ్రెండ్స్‌తో నైట్ పార్టీలో హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

అంబానీ ఇంట పాప్ స్టార్ రిహన్నా సందడి.. ఆటపాటలతో కోలాహలం (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఏప్రిల్ 26-మే 03)

+5

‘వాలా 2’ మూవీ సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)

+5

'గాయపడ్డ సింహం' ట్రైలర్ లాంచ్‌ (ఫొటోలు)

+5

మాళవిక మోహనన్ గ్లామర్ ధమాకా (ఫొటోలు)

+5

అందమైన అంబానీ ఫ్యామిలీ.. ఐకానిక్‌ ఫొటోలు

+5

తిరుమల శ్రీవారి సేవలో 'ఉయ్యాల జంపాలా' నటి (ఫొటోలు)

+5

తెలంగాణ ప్రజలకు అమ్మగా మారాలనుకుంటున్నా.. కవిత పార్టీ ప్రకటన (ఫొటోలు)