Breaking News

'పని ఇష్టం లేనప్పుడే.. వర్క్ లైఫ్ బ్యాలెన్స్'

Published on Thu, 04/23/2026 - 21:22

గత కొన్నేళ్లుగా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా బూప హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ సీఈవో 'ఇనాకీ ఎరెనో' తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

ఇనాకీ ఎరెనో ప్రకారం.. జెన్ జీ తరానికి చెందిన యువత ఎక్కువగా పని ఒత్తిడిని తగ్గించుకుని, వ్యక్తిగత జీవితం, మానసిక ఆరోగ్యం, కుటుంబ సమయం వంటి విషయాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. అయితే కొంతమంది పెద్ద వ్యాపార నాయకులు ఈ ఆలోచనతో ఏకీభవించడం లేదు.

ఒక ఉద్యోగి తరచుగా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కావాలి అని ఆలోచిస్తే.. అది ఆ ఉద్యోగం తనకు సరిపడటం లేదని అర్థం. ఒక వ్యక్తి తన పనిని నిజంగా ఇష్టపడితే, పని - జీవితం మధ్య కఠినమైన సరిహద్దులు పెట్టుకోవాల్సిన అవసరం ఉండదని ఎరెనో పేర్కొన్నారు.

ఎరెనో తన అనుభవాన్ని కూడా ఉదాహరణగా చెప్పారు. ఆయన ఒక పెద్ద కంపెనీని నిర్వహిస్తున్నప్పటికీ.. వీకెండ్స్‌లో నా కుమారుడితో కలిసి జిమ్‌కు వెళ్తున్నప్పుడు కూడా వ్యాపార ఆలోచనలు చేయడం, ఈమెయిల్స్ చూడడం వంటివి తనకు ఒత్తిడిగా అనిపించదని చెప్పారు. తన పనిని ఆనందంగా చేసుకుంటే, దాన్ని బ్యాలెన్స్ చేయాల్సిన భారంగా చూడాల్సిన అవసరం ఉండదని ఆయన అభిప్రాయం. తమకు నచ్చిన పని ఎంచుకుంటేనే పని–జీవిత సమతుల్యత అనే సమస్యే ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇక స్కేల్ ఏఐ కో-ఫౌండర్ లూసీ గువో (Lucy Guo) కూడా ఇదే తరహా అభిప్రాయం చెప్పారు. పని–జీవిత సమతుల్యత అవసరం అనిపిస్తే, ఆ ఉద్యోగం సరైనది కాకపోవచ్చు అని అన్నారు. తాను తన పనిని ఎంతో ఇష్టపడతానని, అందుకే అలాంటి సమస్య ఎదురుకాదని చెప్పారు.

Videos

90 శాతం ఓటింగ్.. ఫుల్ జోష్ బెంగాల్ బీజేపీ

సెన్స్ లేదా..? జనసేన నేతలపై నాగబాబు సీరియస్

భారీగా తగ్గిన బంగారం ధర.. తులం ఎంతంటే..?

జపాన్ లో మరి కొద్ది రోజుల్లో.. మెగా సునామీ...

నా కొడుకు తప్పేం మాట్లాడలేదు.. TDP పై MLA కోనేటి ఆదిమూలం సంచలన వ్యాఖ్యలు

ఓటు వేసిన సూర్య, జ్యోతిక

ప్రభుత్వం స్పందించడంలేదని డ్రైవర్ పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం

బాబుగారి మరో క్రెడిట్ చోరీ.. కొంచమైనా సిగ్గుగా లేదా.. నీ ఖాతాలో వేసుకోవడానికి..

చంద్రబాబు నన్ను ఇంటికి పిలిచి బెదిరించారు

ఏపీలో మండిపోతున్న ఎండలు

Photos

+5

ప్రముఖ ఎగ్జిబిషన్‌లో టాలీవుడ్ యాంకర్‌ లాస్య సందడి (ఫోటోలు)

+5

ఫ్యామిలీతో బుల్లితెర బ్యూటీ మంజుల సమ్మర్ చిల్ (ఫోటోలు)

+5

హీరో విష్ణు విశాల్, గుత్తా జ్వాల ఇంట డబుల్ సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో జయం రవి, సింగర్ కెనీషా (ఫోటోలు)

+5

సంజనా గల్రానీ కూతురు బర్త్‌డేలో పాపులర్‌ ఎమ్మెల్యే (ఫోటోలు)

+5

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు.. పొద్దుపొద్దున్నే ఓటేసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

జర్నీ జామ్‌ ఫుల్‌.. ఆర్టీసీ సమ్మెతో ప్రయాణికుల నిలువు దోపిడీ, ఇక్కట్లు (ఫొటోలు)

+5

‘జెట్లీ’ మూవీ ట్రైలర్ లాంచ్‌ (ఫొటోలు)

+5

రెడ్‌ రోజ్‌లా మెరిసిపోతున్న హీరోయిన్ మానస వారణాసి (ఫొటోలు)

+5

రానా సతీమణి మిహికా బజాజ్ ఆర్ట్‌ షో.. సందడి చేసిన టాలీవుడ్ తారలు (ఫొటోలు)