Breaking News

ప్రపంచంలోనే టాప్‌ కంపెనీకి కొత్త బాస్‌

Published on Tue, 04/21/2026 - 12:43

ప్రపంచంలోనే నం 1 టెక్ కంపెనీ యాపిల్ తన నాయకత్వంలో మార్పులు ప్రకటించింది. దశాబ్ద కాలానికిపైగా సంస్థను విజయపథంలో నడిపించిన టిమ్ కుక్ ఈ ఏడాది చివర్లో సీఈఓ బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు. ఆయన వారసుడిగా ప్రస్తుతం హార్డ్‌వేర్ ఇంజినీరింగ్ విభాగం బాధ్యతలు చూస్తున్న జాన్ టెర్నస్ సీఈఓగా పగ్గాలు చేపట్టనున్నారు. అదే సమయంలో యాపిల్ చిప్ డిజైన్లలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన జానీ స్రూజీకి సంస్థ అత్యంత కీలకమైన చీఫ్ హార్డ్‌వేర్ ఆఫీసర్ బాధ్యతలను అప్పగించింది. ఈ మార్పులు తక్షణమే అమలులోకి వస్తాయని కంపెనీ వర్గాలు వెల్లడించాయి.

ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా టిమ్ కుక్

సుమారు రెండు దశాబ్దాలుగా యాపిల్‌లో అంతర్భాగంగా ఉన్న జాన్ టెర్నస్ ఐఫోన్, ఐప్యాడ్, మాక్ వంటి ఫ్లాగ్‌షిప్ ఉత్పత్తుల రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. టిమ్ కుక్ వారసుడిగా ఆయన ఎంపిక సంస్థ అంతర్గత వారసత్వ ప్రణాళికలో భాగమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఏడాది చివర్లో టెర్నస్ సీఈఓగా బాధ్యతలు చేపడతారు. పదవీ విరమణ తర్వాత కుక్ పూర్తిగా తప్పుకోకుండా ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా ఉంటూ దిశానిర్దేశం చేయనున్నారు.

హార్డ్‌వేర్‌ చీఫ్‌గా జానీ స్రూజీ

యాపిల్ చిప్‌ల సృష్టికర్తగా పేరొందిన జానీ స్రూజీ పాత్ర ఇప్పుడు మరింత విస్తృతమైంది. ఇప్పటివరకు హార్డ్‌వేర్ టెక్నాలజీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్న ఆయన ఇకపై చీఫ్ హార్డ్‌వేర్ ఆఫీసర్ హోదాలో పూర్తిస్థాయి హార్డ్‌వేర్ విభాగాన్ని పర్యవేక్షిస్తారు. ఈ హోదాలో ఆయన బాధ్యతలు వెంటనే అమల్లోకి వస్తాయని కంపెనీ తెలిపింది.

ఇదీ చదవండి: టిఫిన్‌, కర్రీ ప్యాకెట్‌ ధర 50 శాతం పెంపు!

స్రూజీ పర్యవేక్షణలో ఉండే విభాగాలు

  • సిలికాన్, ప్రాసెసర్లు: ఏ-సిరీస్ (iPhone), ఎం-సిరీస్ (Mac) చిప్‌ల అభివృద్ధి.

  • డిస్‌ప్లేలు, కెమెరా సెన్సార్లు, బ్యాటరీ టెక్నాలజీ, స్టోరేజ్ కంట్రోలర్లు.

  • సెల్యులార్ మోడెమ్‌ల తయారీ, ఇంటిగ్రేషన్.

Videos

ఛాలెంజ్ చేసి చెప్తున్నా... బాబు కంటే జగన్ ప్రభుత్వమే మంచిది

పెండెం దొరబాబుకు వర్మ మాస్ వార్నింగ్

AI రోబో స్పీడ్ రికార్డు బీజింగ్ లో హవా

అన్న క్యాంటీన్‌పై రిపోర్టర్ ప్రశ్న,అంబటి అదిరిపోయే రిప్లై

పాక్ ధురంధర్ కి పోటీగా సినిమా ట్రోలింగ్ జోరు

MGNREGA అమలులో నిర్లక్ష్యం.. చంద్రబాబుపై జగన్ ఫైర్

కాళ్లు చూపిస్తే కాసుల వర్షం.. ఈ కొత్త బిజినెస్ గురించి మీకు తెలుసా..?

నన్ను డిస్మిస్ చేసినంత మాత్రాన నేను భయపడే ప్రసక్తే లేదు

పిఠాపురంలో వర్మని కొట్టడానికి దూసుకెళ్లిన జనసేన నేతలు

తమిళ రాజకీయాల్లో హై టెన్షన్ విజయ్ డబుల్ పోటీపై కమల్ సెటైర్లు

Photos

+5

కాలేజీ అమ్మాయిలా హీరోయిన్ అనన్య నాగళ్ల (ఫోటోలు)

+5

పశ్చిమగోదావరి : నరసాపురంలో సినీనటి అనసూయ సందడి (ఫొటోలు)

+5

'కపుల్‌ ఫ్రెండ్లీ' బ్యూటీ మానస వారణాసి లేటెస్ట్‌ ఫోటోలు

+5

రేంజ్‌ రోవర్‌ కొన్న నితీశ్.. పెద్ద‌మ్మ గుడిలో కాయిన్‌ పెట్టి పూజ‌లు (ఫొటోలు)

+5

సింహాచలం : స్వామి నిజరూప దర్శనం.. భక్తులకు అష్టకష్టాలు (ఫొటోలు)

+5

యజ్ఞం ప్రారంభిస్తున్నా.. తెలంగాణకు మంచి జరగాలనే బయటకు రాలేదు (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఉప్పల్ లో ఢిల్లీతో ఢీ... మైదానంలో విస్తృతంగా ప్రాక్టీస్ (ఫొటోలు)

+5

అమీర్‌పేట్‌లో సందడి చేసిన హీరోయిన్ దక్ష నాగర్కర్ (ఫొటోలు)

+5

కొడుకు బర్త్ డే సెలబ్రేషన్స్.. కాజల్ ఫుల్ హ్యాపీస్ (ఫొటోలు)

+5

కశ్మీరీ అమ్మాయిలా ఐశ్వర్య రాజేశ్.. మనాలి ట్రిప్ (ఫొటోలు)