Breaking News

బ్లింకిట్ డెలివరీ బాయ్‌గా 66 ఏళ్ల రిటైర్డ్ క్లర్క్..!

Published on Sun, 04/19/2026 - 11:05

పదవీ విరమణ తర్వాత కూడా ఉద్యోగిగా కొనసాగడం అత్యంత అరుదు. అందులోనూ పిల్లలు స్థిరపడ్డాక, ఎలాంటి చీకు చింత లేకుండా పదవీ విరణమ చేశాక ఎవ్వరైన రెస్ట్‌ తీసుకుంటారు. కానీ ఈ తాతగారు అందుకు విభిన్నం. అదికూడా యువకులు చేసే గిగ్‌వర్క్‌ జాబ్‌లో జాయిన్‌ అవ్వడం..పైగా ఎన్ని డెలివరీలు కంప్లీట్‌ చేశారో తెలిస్తే..తాతగారు మీరు సూపర్‌ అని ప్రశంసించకుండా ఉండలేరు. మరి ఎందుకు ఆయన ఇంత వయసులో ఇంత కష్టపడుతున్నారంటే..

అహ్మదాబాద్‌కు చెందిన 66 ఏళ్ల వ్యక్తి, మాజీ క్లర్క్ దినేష్ మహంత్ ఠాకోర్దాస్ మంచి స్థిరపడ్డ కుటుంబం. ఆయనకు ముగ్గురపిల్లలు వాళ్లు కూడా బాగా స్థిరపడ్డారు. ఆయనకు ఏమి అంత ఆర్థిక బాధ్యతలు కూడా ఏమిలేవు. కానీ తన పరిసర ప్రాంతంలో ఒక బ్లింకిట్ డెలివరీ పార్టనర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు అదొక ఆసక్తికరమైన ఉద్యోగంలా అనిపించి చేయాలనకున్న జాబ్‌ కాస్తా సాధారణ కార్యకలాపంగా మారింది. అందుకు సంబంధించిన పోస్ట్‌​ సోషల్‌ మీడియా ఎక్స్‌లో న్యూస్ ఆల్జీబ్రా ఖాతా నుంచి షేర్‌ అవ్వడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. 

ఆయన రోజు ఉదయం 5.00లతో రోజు ప్రారంభించి ఉదయం 6.00లకు కంపెనీ స్థానిక డార్క్‌ స్టోర్‌కు చేరుకుంటారట. తన ఇష్టపడే షిఫ్ట్‌ సుమారు రూ. 11.30 గంటలకు మొదలవుతుందట. ఆ తర్వాత దీన్ని కొనసాగించాలా లేదా ముగించాలా అని నిర్ణయించుకుంటారట. ఇలా గత రెండేళ్లలో సుమారు 10,220 డెలివరీలను పూర్తి చేశారట. అయితే ఈ సంపాదన మాత్రం ఇంటి ఖర్చుల కోసం కాదట. కొత్త నగరాలు, రాష్ట్రాలు, దేశాలు సందర్శించడానికి వినియోగిస్తారట. 

అంతేగాదు ఆయన అనుభవమే గొప్ప గురువు అనే సిద్ధాంతాన్ని గట్టిగా నమ్ముతారట. ఈ పోస్ట్‌ నెటిజన్లను అమితంగా ఆకర్షించడమే కాదు..మన పాత తరం వారి వృత్తిపరమైన నిబద్దతత చూసి ఎంతగానో ఆశ్చర్యం కలిగిందంటూ ..పోస్టులు పెట్టారు. కొందరు మాత్రం ఈ వయసులో ఇంత శారీరక శ్రమ అనారోగ్య సమస్యల బారిన పడేలా చేస్తుందంటూ హెచ్చరిస్తూ పోస్టులు పెట్టారు.

 

(చదవండి: ‘వార్‌’ఇంటీ వాకిట్లో... కష్టాల చెట్లు!)

 

#

Tags : 1

Videos

ఇజ్రాయెల్ పై ట్రంప్ ప్రశంసల వర్షం

పెళ్లి తర్వాత వన్స్ మోర్..!

తెలంగాణలో రెడ్ బుక్ అంటే తాట తీస్తాం.. అబ్బా కొడుకులకు జర్నలిస్టులు వార్నింగ్

అక్షయ తృతీయ ఆఫర్స్.. కిక్కిరిసిన బంగారం షాపులు

ఓటర్ జాబితాలో అక్రమాలు.. పరకాల సంచలన వ్యాఖ్యలు

కాపు టైగర్ దీక్ష అంటే ఆ మాత్రం ఉండాలి..

జర్నలిస్ట్ KVRపై కేసులు.. బాబును ఏకిపారేసిన జగన్

ప్రళయ కాలం వచ్చేసింది! మానవాళికి ఆఖరి రోజా

నా వ్యాఖ్యలను వక్రీకరించారు.. నేను శ్రీ రాముడిని అలా అనలేదు

KGF డైలాగుతో దడదడలాడించిన శ్యామల

Photos

+5

ఫెమినా మిస్ ఇండియా వరల్డ్‌గా గోవా బ్యూటీ..! (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఏప్రిల్ 19-26)

+5

చిరుజల్లుల చల్లదనం (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో టాలీవుడ్ హీరోయిన్స్‌ (ఫొటోలు)

+5

ప్రముఖ ఆభరణాల షోరూం ప్రారంభించిన నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

కంట్రీ క్లబ్‌లో గ్రాండ్‌గా ఫ్యాషన్‌ షో (ఫొటోలు)

+5

SRH Vs CSK Match : సన్‌రైజర్స్‌ను చీర్‌ చేసిన సెలబ్రిటీ ఫ్యాన్స్‌ (ఫొటోలు)

+5

నయన్ ఫ్యామిలీ టైమ్.. కొడుకులతో కలిసి (ఫొటోలు)

+5

ముంబైలో INCA అవార్డ్స్‌.. ఉత్తమ నటుడిగా నాగచైతన్య (ఫోటోలు)

+5

సిద్ధార్థ్‌ బర్త్‌డే.. స్పెషల్‌ ఫోటోలు షేర్‌ చేసిన అదితి రావు హైదరి (ఫొటోలు)