Breaking News

స్మార్ట్‌ఫోన్‌ షిప్‌మెంట్లు డౌన్‌ 

Published on Sun, 04/19/2026 - 06:21

న్యూఢిల్లీ: దేశీ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌ ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో (జనవరి–మార్చి) మందగించింది. కౌంటర్‌ పాయింట్‌ రీసెర్చ్‌ నివేదిక ప్రకారం, క్యూ1లో స్మార్ట్‌ఫోన్‌ షిప్‌మెంట్లు (కంపెనీ నుంచి డీలర్లకు రవాణా) గత ఏడాదితో పోలిస్తే 3 శాతం తగ్గాయి. గత 6 ఏళ్లలో బలహీనమైన పనితీరు ఇది. పెరిగిన తయారీ ఖర్చులు, ముఖ్యంగా మెమొరీ చిప్‌ల ధరలు పెరిగిపోవడం తెలిసిందే. దీంతో వినియోగదారుల నుంచి డిమాండ్‌ తగ్గడం (ముఖ్యంగా రూ.15,000 లోపు ఫోన్లకు).. మొత్తం మార్కెట్‌ పనితీరును ప్రభావితం చేసినట్టు కౌంటర్‌ పాయింట్‌ రీసెర్చ్‌ నివేదిక తెలిపింది. 

ఏప్రిల్‌–జూన్‌ త్రైమాసికంలో స్మార్ట్‌ఫోన్‌ షిప్‌మెంట్లు డబుల్‌ డిజిట్‌ స్థాయిలో తగ్గొచ్చని కౌంటర్‌ పాయింట్‌ రీసెర్చ్‌ డైరెక్టర్‌ తరుణ్‌ పాఠక్‌ పేర్కొన్నారు. ‘‘2026 పూర్తి సంవత్సరానికి స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌ సుమారు 10 శాతం తగ్గొచ్చని అంచనా. ‘‘విడిభాగాల ధరలు గణనీయంగా పెరిగాయి. ముఖ్యంగా మెమొరీ ధరలు గత 9 నెలల్లో 4 రెట్లు పెరిగిపోయాయి. దీంతో వినియోగదారులు ఫోన్లను వెంటనే మార్చకుండా, ఉన్న వాటినే ఎక్కువ కాలం వినియోగిస్తున్నారు’’అని పాఠక్‌ వివరించారు. పశ్చిమాసియలో సంక్షోభంతో జీవన వ్యయాలు పెరిగాయని, ఈ పరిస్థితుల్లో ప్రజలు స్మార్ట్‌ఫోన్ల వంటి వాటి కంటే ముఖ్యమైన అవసరాలకే ప్రాధాన్యం ఇస్తున్నారని ఈ నివేదిక పేర్కొంది. కనుక ఈ మార్కెట్‌ నెమ్మదిగా కోలుకోవచ్చని అభిప్రాయపడింది.  

వివో నంబర్‌ 1 
→ దేశీ మార్కెట్లో 21 శాతం వాటాతో వివో మొదటి స్థానంలో నిలిచింది. కొత్త ఉత్పత్తుల ఆవిష్కరణతో పోర్ట్‌ఫోలియో విస్తరణ ద్వారా తన ఆధిపత్యాన్ని కాపాడుకుంది.  
→ శామ్‌సంగ్‌ రెండో స్థానంలో ఉంది. ముఖ్యంగా ఎ–సిరీస్‌ మోడళ్లకు మంచి డిమాండ్‌ ఉంది. 
→ ఒప్పో 14 శాతం వాటాతో మూడో స్థానంలో నిలిచింది. మార్చి త్రైమాసికంలో 8 శాతం వృద్ధిని (2025 క్యూ1తో పోల్చితే) సాధించింది. 
→ షావోమీ నాలుగో స్థానంలో ఉంది. రూ.10,000–20,000 ధరల శ్రేణిలో రడబుల్‌ డిజిట్‌ వృద్ధిని నమోదు చేసింది.  
→ ఆన్‌లైన్‌ మార్కెట్‌లో రూ.10,000–20,000 ధరల విభాగంలో రియల్‌మీ బలమైన బ్రాండ్‌గా నిలిచింది.  
→ నథింగ్‌ 47 శాతం వృద్ధిని నమోదు చేసింది. 
→ ప్రీమియం ఫోన్ల సెగ్మెంట్‌లో (రూ.45,000కు పైన) గూగుల్‌ 39 శాతం వృద్ధిని సాధించింది. 
→ అందుబాటు ధరల ఫోన్ల విభాగంలో (రూ.30,000–45,000) ప్రముఖ బ్రాండ్‌గా వన్‌ప్లస్‌ ముందంజలో ఉంది. నార్డ్‌ సిరీస్‌కు మంచి స్పందన లభిస్తోంది.  
 

Videos

ఇజ్రాయెల్ పై ట్రంప్ ప్రశంసల వర్షం

పెళ్లి తర్వాత వన్స్ మోర్..!

తెలంగాణలో రెడ్ బుక్ అంటే తాట తీస్తాం.. అబ్బా కొడుకులకు జర్నలిస్టులు వార్నింగ్

అక్షయ తృతీయ ఆఫర్స్.. కిక్కిరిసిన బంగారం షాపులు

ఓటర్ జాబితాలో అక్రమాలు.. పరకాల సంచలన వ్యాఖ్యలు

కాపు టైగర్ దీక్ష అంటే ఆ మాత్రం ఉండాలి..

జర్నలిస్ట్ KVRపై కేసులు.. బాబును ఏకిపారేసిన జగన్

ప్రళయ కాలం వచ్చేసింది! మానవాళికి ఆఖరి రోజా

నా వ్యాఖ్యలను వక్రీకరించారు.. నేను శ్రీ రాముడిని అలా అనలేదు

KGF డైలాగుతో దడదడలాడించిన శ్యామల

Photos

+5

ఫెమినా మిస్ ఇండియా వరల్డ్‌గా గోవా బ్యూటీ..! (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఏప్రిల్ 19-26)

+5

చిరుజల్లుల చల్లదనం (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో టాలీవుడ్ హీరోయిన్స్‌ (ఫొటోలు)

+5

ప్రముఖ ఆభరణాల షోరూం ప్రారంభించిన నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

కంట్రీ క్లబ్‌లో గ్రాండ్‌గా ఫ్యాషన్‌ షో (ఫొటోలు)

+5

SRH Vs CSK Match : సన్‌రైజర్స్‌ను చీర్‌ చేసిన సెలబ్రిటీ ఫ్యాన్స్‌ (ఫొటోలు)

+5

నయన్ ఫ్యామిలీ టైమ్.. కొడుకులతో కలిసి (ఫొటోలు)

+5

ముంబైలో INCA అవార్డ్స్‌.. ఉత్తమ నటుడిగా నాగచైతన్య (ఫోటోలు)

+5

సిద్ధార్థ్‌ బర్త్‌డే.. స్పెషల్‌ ఫోటోలు షేర్‌ చేసిన అదితి రావు హైదరి (ఫొటోలు)