Breaking News

కలిసొచ్చిన జీఎస్‌టీ 2.0: భారీగా పెరిగిన వాహన విక్రయాలు

Published on Wed, 04/15/2026 - 02:37

దేశీయంగా గత ఆర్థిక సంవత్సరం (2025–26)లో ద్విచక్ర, త్రిచక్ర, వాణిజ్య, ప్రయాణిక వాహనాలన్నీ కలిపి రికార్డు స్థాయిలో 2,82,65,519 యూనిట్లు అమ్ముడయ్యాయి. 2024–25లో నమోదైన 2,56,09,399 యూనిట్లతో పోలిస్తే ఇవి 10.4 శాతం అధికం అని వాహన తయారీదారుల సమాఖ్య సియామ్‌ మంగళవారం తెలిపింది.

జీఎస్‌టీ 2.0 అమలు, ఆర్‌బీఐ రెపో రేట్ల కోతలు ఈ వృద్ధికి ప్రధాన కారణాలుగా నిలిచాయని సియామ్‌ పేర్కొంది. ఆర్థిక వ్యవస్థ బలమైన పునాదుల నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026–27)పై వాహన పరిశ్రమ సానుకూల దృక్పథాన్ని వ్యక్తం చేసింది. అయితే, పశ్చిమాసియా యుద్ధం దీర్ఘకాలం కొనసాగితే డిమాండ్, సరఫరా గొలుసు, వాహన ఉత్పత్తిపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని పేర్కొంది.

ముడి చమురు, కమోడిటీ ధరల పెరుగుదల, మారకపు విలువల పెరుగుదల, షిప్పింగ్‌ మార్గాల్లో అంతరాయాలు ఆటో రంగానికి సవాళ్లుగా ఉన్నాయని తెలిపింది. అంతర్జాతీయ ఉద్రిక్తతలు సద్దుమణిగితే 2026–27లో వాహన రంగం వృద్ధి మరింత వేగం అందుకుంటుందని సియామ్‌ ఆశాభావం వ్యక్తం చేసింది. గత ఆర్థిక సంవత్సరంలో భారత్‌ నుంచి వాహన ఎగుమతులు 24 శాతం పెరిగి 53,62,884 యూనిట్ల నుంచి 66,47,685 యూనిట్లకు చేరుకున్నాయి.

అంతర్జాతీయ అనిశ్చితుల్లోనూ వృద్ధి సంకేతాలు: సియామ్‌ అధ్యక్షుడు శైలేష్‌ చంద్ర అంతర్జాతీయ అనిశ్చితుల్లోనూ, భారత వాహన పరిశ్రమ బలమైన పునాదులపై నిలబడుతూ వృద్ధిని కొనసాగిస్తోందని సియామ్‌ అధ్యక్షుడు శైలేష్‌ చంద్ర తెలిపారు. దేశీయంగా పెరుగుతున్న డిమాండ్, గ్రామీణ-పట్టణ మార్కెట్లలో కొనుగోలు శక్తి పెరుగుదల, సులభమైన ఫైనాన్సింగ్‌ విక్రయాలకు ఊతమిస్తున్నాయని చెప్పారు.

జీఎస్‌టీ 2.0 సంస్కరణలు, ఆర్‌బీఐ వడ్డీ రేట్ల కోతలు మార్కెట్లో సానుకూల సెంటిమెంట్‌ను పెంచి పెట్టుబడులు, కొనుగోళ్లను వేగవంతం చేశాయని తెలిపారు. ఎగుమతుల్లో కొన్ని ప్రాంతీయ సవాళ్లు ఉన్నప్పటికీ, ఇతర మార్కెట్లలో భారత వాహనాల డిమాండ్‌ పెరుగుతుండటం, రూపాయి క్షీణత వల్ల లభిస్తున్న ధరల పోటీ సామర్థ్యం వృద్ధికి తోడ్పడుతున్నాయని వివరించారు.

#

Tags : 1

Videos

సీఎం పదవికి నితీశ్ కుమార్ రాజీనామా

ప్రపంచంలోనే వర్షం వస్తే నీళ్లు ఎత్తిపోసే ఏకైక రాజధాని అమరావతి

మహిళను 6 సార్లు కత్తితో పొడిచిన రాక్షసుడు..

సీఎం రేసులో కీలక నేతలు

ఆపని చేస్తే ఎప్పుడూ చూడని ఉద్యమం చూపిస్తాం, కేంద్రానికి స్ట్రాంగ్ వార్నింగ్

చైనా చరిత్రలో చూడని అతి పెద్ద హ్యాకింగ్ దేశ రహస్యాలు లీక్..?

ఇప్పటివరకు ఏ ప్రభుత్వం ఒక్క హార్బర్ కూడా కట్టలేదు

ఇపుడు అర్ధమయిందా కెప్టెన్సీ అంటే ఏంటో..టీమ్ ఉంటే సరిపోదు..అనుభవిస్తున్న ముంబై

డబ్బులు ఇవ్వకపోతే పరువు తీస్తానంటూ బెదిరించాడు, మలుపు తిరుగుతోన్న మంగ్లీ వివాదం

పిల్లల భవిష్యత్తు అంధకారం? బడి లేక గుడిలో చదువు..

Photos

+5

సూపర్ స్టార్ బాటలో మహేశ్ బాబు.. ఫ్యామిలీతో ఫారిన్‌ ట్రిప్స్ (ఫోటోలు)

+5

తమిళ న్యూఇయర్ స్పెషల్.. హీరోయిన్స్ ఇలా (ఫొటోలు)

+5

రుక్మిణి వసంత్ రాజస్థాన్ ట్రిప్ (ఫొటోలు)

+5

#SRHvsRR మ్యాచ్‌.. ఉప్పల్ స్టేడియంలో అందమైన భామల సందడి (ఫొటోలు)

+5

నాగశౌర్య 'బ్యాడ్ బాయ్ కార్తీక్' సినిమా ప్రీ రిలీజ్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : పుంజుకున్న ఆరెంజ్‌ ఆర్మీ.. విజయంతో ఉప్పొంగె (ఫొటోలు)

+5

చీరలో శెట్టి బ్యూటీ.. అందమే అందం (ఫొటోలు)

+5

భానుడి సెగలకు విశాఖ రుషికొండ తీరంలో పర్యాటకుల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో వైభవ్‌ సూర్యవంశీ ఆట.. SRH vs RR ప్రాక్టీస్‌ (ఫొటోలు)

+5

కూకట్‌పల్లిలో హీరో విక్టరీ వెంకటేష్ సందడి (ఫొటోలు)