Breaking News

ఐడీబీఐ బ్యాంక్‌ విక్రయానికి దారి దొరికిందా?

Published on Fri, 04/10/2026 - 14:12

న్యూఢిల్లీ: ఐడీబీఐ బ్యాంక్‌ విక్రయ చర్యలలో భాగంగా ప్రభుత్వం ఇద్దరు కొనుగోలుదారులపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. తద్వారా బ్యాంక్‌లో మెజారిటీ వాటా విక్రయానికి నిర్ణయించిన రిజర్వ్‌ ధరకంటే తక్కువకు దాఖలు చేసిన బిడ్స్‌ సవరణను కోరే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. బ్యాంక్‌లో వ్యూహాత్మక వాటా విక్రయంపై ప్రస్తుతం సాంకేతిక మదింపు జరుగుతున్నట్లు ప్రభుత్వ అధికారి ఒకరు వెల్లడించారు.

పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ప్రభుత్వం డిజిన్వెస్ట్‌మెంట్, అసెట్‌ మానిటైజేషన్‌కు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలియజేశారు. ప్రపంచ అనిశి్చతుల ప్రభావం నుంచి ఆర్థిక వ్యవస్థకు రక్షణగా ఆర్థిక వనరులను సమకూర్చుకోవాలని చూస్తున్నట్లు వివరించారు. తద్వారా ద్రవ్యపరమైన దన్నుకు దారి ఏర్పాటు చేసుకోనున్నట్లు తెలియజేశారు. మూడేళ్ల ప్రయత్నాల తదుపరి ఐడీబీఐ బ్యాంక్‌లో మెజారిటీ వాటా విక్రయ చర్యలు ఫైనాన్షియల్‌ బిడ్‌ స్థాయికి చేరిన విషయం విదితమే. వెరసి ప్రభుత్వం మళ్లీ తొలి నుంచీ మొదలుపెట్టేందుకు సిద్ధంగా లేదని ప్రభుత్వ అధికారి వెల్లడించారు.

ఇది బ్యాంక్‌ విక్రయాన్ని మరింత ఆలస్యం చేసే వీలుండటంతో తాజా యోచనకు తెరతీస్తున్నట్లు పేర్కొన్నారు. ఐడీబీఐ బ్యాంక్‌లో ప్రభుత్వ వాటా 45.48 శాతంకాగా.. పీఎస్‌యూ బీమా దిగ్గజం ఎల్‌ఐసీకి 49.24 శాతం వాటా ఉంది. దీంతో ప్రభుత్వం, ఎల్‌ఐసీ సంయుక్తంగా 60.72 శాతం వాటా విక్రయించేందుకు 2022 అక్టోబర్‌లో ఆసక్తి వ్యక్తీకరణ బిడ్స్‌(ఈవోఐ)కు ఆహ్వానం పలికాయి. ప్రేమ్‌వత్సా సంస్థ ఫెయిర్‌ఫాక్స్, ఎమిరేట్స్‌ ఎన్‌బీడీ ఫైనాన్షియల్‌ బిడ్స్‌ దాఖలు చేశాయి. బ్యాంక్‌లో ప్రభుత్వం 30.48 శాతం, ఎల్‌ఐసీ 30.24 శాతం చొప్పున వాటా విక్రయించనున్నాయి.

Videos

వాటర్ తో గేమ్స్ వద్దు.. ఒక సెల్ఫీ మూడు ప్రాణాలు

నల్లగా ఉన్నాడని లవర్తో మొగుణ్ణే లేపించేసింది

మోనాలిసాకు బిగ్ షాక్ భర్త ఫర్మాన్ ఖాన్పై పోక్సో కేసు

మీ అన్నను చంపించింది నువ్వే అని టాక్... అచ్చెన్నకు గుబాపగిలేలా సజ్జల కౌంటర్

వేసిన 20 రోజులకే ఖతం చేతులతో తవ్వితే ఊడిపోతున్న రోడ్డు

కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు

చిరు ఆగ్రహం

హరూజ్ జలసంధిలో ఇరాన్ కొత్త రూల్స్

MAVIGUN పై షర్మిల జోకర్ కామెంట్స్ సజ్జల సెటైర్స్ అదుర్స్

ఎర్రంనాయుడు మరణంలో నీ హస్తం లేదా? అచ్చెన్న పై తమ్మినేని సీతారాం షాకింగ్ నిజాలు

Photos

+5

గ్రాండ్ గా అనంత్ అంబానీ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

సీతామహాలక్ష్మిలా మృణాల్‌ ఠాకూర్‌ (ఫోటోలు)

+5

తిమ్మరాజుపల్లి టీవీ.. వెరైటీగా ట్రైలర్‌ లాంచ్‌ (ఫోటోలు)

+5

మిస్‌ తెలుగు యూఎస్‌ఏ విజేతగా భాగ్యనగరం బ్యూటీ..! (ఫొటోలు)

+5

తిరుపతిలో హీరోయిన్ శ్రీలీల సందడి (ఫొటోలు)

+5

గ్రాండ్‌గా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లగ్న పత్రిక వేడుక (ఫొటోలు)

+5

సెలబ్రిటీలతో ఐకాన్ స్టార్ బర్త్‌ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నయనతార, విఘ్నేష్ శివన్ (ఫొటోలు)

+5

గుర్తుకొస్తున్నాయి.. మహానేత పాదయాత్రకు 23 ఏళ్లు (చిత్రాలు)

+5

ఈ సినిమా ఎంతో స్పెషల్‌ అంటున్న కృతీ శెట్టి (ఫోటోలు)