Breaking News

హ్యాపీ హప్చీ

Published on Fri, 04/10/2026 - 04:35

గుడ్‌ టచ్, బ్యాడ్‌ టచ్, బాడీ సేఫ్టీ... మొదలైన వాటి గురించి ఒకటికి రెండుసార్లు చెప్పినంత మాత్రాన ప్రయోజనం ఉండదని గ్రహించిన డా. కనిక,  అన్నిరకాలుగా పిల్లల భద్రతను దృష్టిలో పెట్టుకొని ‘హాప్చి’ అనే సంస్థను ఏర్పాటు చేశారు. ‘హప్చి’ప్రభావంతో దేశవ్యాప్తంగా ఎన్నో పాఠశాలల్లో  మార్పు స్పష్టంగా కనిపిస్తోంది...

ఒకరోజు కుమారుడితో సరదాగా మాట్లాడుతూ...
‘స్కూల్లో ఏం నేర్చుకుంటున్నావు?’ అని అడిగారు కనిక. ‘గుడ్‌ టచ్, బ్యాడ్‌ టచ్‌’ అని క్యాజువల్‌గా చెప్పి పరుగెత్తాడు ఆ పిల్లాడు. ఆ సమయంలో ఆమె ఆలోచనలన్నీ ‘గుడ్‌ టచ్, బ్యాడ్‌ టచ్‌’ చుట్టే తిరిగాయి. ‘అక్కడ ఏమి నేర్చుకున్నారు? అది మాత్రమే సరిపోతుందా? నిజజీవిత పరిస్థితులను ఎదుర్కోవడానికి అవసరమైన నైపుణ్యం పిల్లలకు చేరుతుందా?’... ఇలా ఎన్నోరకాలుగా ఆలోచించారు. ఆ ఆలోచనలే ‘హప్చీ’ ఆవిర్భావానికి కారణం అయ్యాయి.

హప్చి అంటే హ్యాపీ చిల్డ్రన్‌
2020లో ఐఐఎం బెంగళూరులోని ఎన్‌ఎస్‌ఆర్‌సిఇఎల్‌లోని ఉమెన్‌ స్టార్టప్‌ ప్రోగ్రామ్‌కు దరఖాస్తు చేసుకున్నారు కనిక. ఒక సంవత్సరం తరువాత కనిక నేతృత్వంలో పిల్లల భద్రత, జీవన నైపుణ్యాలు, మానసిక శ్రేయస్సుపై దృష్టి సారించే ప్రత్యేక సంస్థ ‘హప్చి’ ఆవిర్భవించింది. ‘హప్చి అంటే హ్యాపీ చిల్డ్రన్‌ అని అర్థం. పిల్లలు సంతోషంగా, భద్రంగా ఉండేలా చూడడమే మా లక్ష్యం’ అంటున్న కనిక పిల్లల భద్రతపై ‘స్మార్ట్‌ బీ సేఫ్‌’ ‘టైమ్‌ టు వాయిస్‌ మై ఛాయిస్‌’లాంటి ఎన్నో పుస్తకాలు రాశారు. వర్క్‌షాప్‌లు నిర్వహించారు.

స్పందన లేదు...
వన్‌–టైమ్‌ అవేర్‌నెస్‌ ప్రోగ్రామ్స్‌కు పరిమితం కాకుండా ఏడాదిపాటు రకరకాల డిజిటల్‌ టూల్స్‌తో స్కూల్‌ ప్రోగ్రామ్స్‌లో భాగమయ్యే మోడల్‌ని ‘హప్చి’ ప్రవేశ పెట్టింది.
మొదట్లో పాఠశాలల నుంచి కనికకు పెద్దగా స్పందన లభించలేదు. బాడీ సేఫ్టీ, వేధింపుల వంటి అంశాలపై చర్చలు నిర్వహించడానికి చాలా పాఠశాలలు విముఖత చూపాయి. కొన్ని పాఠశాలల వారు వర్క్‌షాప్‌లకు అనుమతించినా ఆ తరువాత పెద్దగా పట్టించుకునేవారు కాదు. ఈ నేపథ్యంలో పిల్లల భద్రతకు సంబంధించిన చొరవ ఒకేవైపు నుంచి కాకుండా ఇరువైపులా ఉండాలని ఆలోచించారు కనిక.

వారి సహకారంతో...
మార్పు రావాలంటే ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సహకారం కూడా అవసరం అని ఆలోచించిన కనిక ఆ వైపుగా దృష్టి పెట్టి విజయం సాధించారు. ‘హ్యాప్‌సేఫ్‌’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ‘హ్యాప్‌సేఫ్‌’ ప్రోగ్రామ్‌లో భాగంగా 1 నుంచి 11 తరగతి విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని అబ్యూజ్‌ ప్రివెన్షన్, బుల్లీయింగ్‌ ప్రివెన్షన్, ఆన్‌లైన్‌ భద్రత, ఒత్తిడి, మానసిక ఆరోగ్యం... మొదలైన కీలక అంశాలపై పాఠ్యప్రణాళిక రూ΄÷ందించారు. కేవలం ఒకసారి అవగాహన కల్పించే స్థాయిని దాటి విద్యాభ్యాసంలో ప్రతి దశలోనూ విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు భాగమయ్యేలా ఆచరణాత్మక నైపుణ్యాలను అందించే పాఠ్యప్రణాళిక రూ΄÷ందించారు.

ఎంతో మార్పు
ఎన్నో పాఠశాలలపై ‘హప్చి’ ఎంతో ప్రభావాన్ని చూపించింది. అలాంటి పాఠశాలల్లో ‘హోరైజన్‌ గురుకుల్‌’ ఒకటి. ‘మా స్కూల్‌లో హప్చి ఎంతో మార్పు తెచ్చింది. పిల్లలు స్వేచ్ఛగా మాట్లాడడానికి సంబంధించి, శరీర భద్రత, భావోద్వేగ అవగాహన విషయాలలో మార్పు ప్రత్యేకంగా కనిపించింది’ అంటుంది న్యూహోరైజన్‌ గురుకుల్‌ టీచర్‌ జాస్మిన్‌ పడ్డా.  ఫరీదాబాద్‌(హరియాణా)లోని సంప్రదాయ కుటుంబంలో పుట్టి పెరిగిన కనిక మెడిసిన్‌ చేశారు. తండ్రి కోరుకున్నట్లే డాక్టర్‌ అయ్యారు. ఆ తరువాత హెల్త్‌కేర్‌ మేనేజ్‌మెంట్‌లోకి మారారు.

Videos

వాటర్ తో గేమ్స్ వద్దు.. ఒక సెల్ఫీ మూడు ప్రాణాలు

నల్లగా ఉన్నాడని లవర్తో మొగుణ్ణే లేపించేసింది

మోనాలిసాకు బిగ్ షాక్ భర్త ఫర్మాన్ ఖాన్పై పోక్సో కేసు

మీ అన్నను చంపించింది నువ్వే అని టాక్... అచ్చెన్నకు గుబాపగిలేలా సజ్జల కౌంటర్

వేసిన 20 రోజులకే ఖతం చేతులతో తవ్వితే ఊడిపోతున్న రోడ్డు

కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు

చిరు ఆగ్రహం

హరూజ్ జలసంధిలో ఇరాన్ కొత్త రూల్స్

MAVIGUN పై షర్మిల జోకర్ కామెంట్స్ సజ్జల సెటైర్స్ అదుర్స్

ఎర్రంనాయుడు మరణంలో నీ హస్తం లేదా? అచ్చెన్న పై తమ్మినేని సీతారాం షాకింగ్ నిజాలు

Photos

+5

గ్రాండ్ గా అనంత్ అంబానీ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

సీతామహాలక్ష్మిలా మృణాల్‌ ఠాకూర్‌ (ఫోటోలు)

+5

తిమ్మరాజుపల్లి టీవీ.. వెరైటీగా ట్రైలర్‌ లాంచ్‌ (ఫోటోలు)

+5

మిస్‌ తెలుగు యూఎస్‌ఏ విజేతగా భాగ్యనగరం బ్యూటీ..! (ఫొటోలు)

+5

తిరుపతిలో హీరోయిన్ శ్రీలీల సందడి (ఫొటోలు)

+5

గ్రాండ్‌గా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లగ్న పత్రిక వేడుక (ఫొటోలు)

+5

సెలబ్రిటీలతో ఐకాన్ స్టార్ బర్త్‌ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నయనతార, విఘ్నేష్ శివన్ (ఫొటోలు)

+5

గుర్తుకొస్తున్నాయి.. మహానేత పాదయాత్రకు 23 ఏళ్లు (చిత్రాలు)

+5

ఈ సినిమా ఎంతో స్పెషల్‌ అంటున్న కృతీ శెట్టి (ఫోటోలు)