Breaking News

‘హెక్టాకార్న్’గా మారిన రిలయన్స్ రిటైల్

Published on Thu, 04/09/2026 - 17:34

రిలయన్స్ రిటైల్ ప్రపంచంలో అత్యంత విలువైన ప్రైవేట్ స్టార్ట్‌అప్ కంపెనీల గ్లోబల్ జాబితాలో 7వ స్థానాన్ని సాధించింది. స్టాన్‌ఫోర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ చేసిన పరిశోధన ప్రకారం.. 100 బిలియన్ డాలర్లకుపైగా విలువతో ఈ సంస్థ ప్రపంచ స్థాయిలో గొప్ప విజయాన్ని నమోదు చేసింది. అత్యంత విలువైన టాప్ 100 స్టార్టప్ కంపెనీల జాబితాలో మూడు భారతీయ సంస్థలు చోటు దక్కించుకున్నాయి. అందులో రిలయన్స్ రిటైల్ అత్యున్నత ర్యాంక్ సాధించి, భారతదేశం బలమైన ప్రాతినిధ్యాన్ని చాటింది.

రిపోర్ట్ ప్రకారం.. రిలయన్స్ రిటైల్ పోస్ట్ మనీ విలువ 100 బిలియన్ డాలర్లకు మించి ఉంది. దీంతో ఇది ప్రపంచంలో ‘హెక్టాకార్న్’గా పిలవబడే ఏడు కంపెనీలలో ఒకటిగా నిలిచింది. 100 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ విలువ కలిగిన స్టార్టప్‌లను ‘హెక్టాకార్న్’ అని అంటారు. టాప్ 7 కంపెనీల్లో రిటైల్ రంగానికి చెందిన ఏకైక సంస్థ రిలయన్స్ రిటైల్ మాత్రమే.

ఈ సంస్థకు ఖతార్ ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ, అబుదాబి ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ, కెకేఆర్, సిల్వర్ లేక్, జీఐసీ, టీపీజీ, ముబాదాలా వంటి ప్రముఖ గ్లోబల్ ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడులు లభించాయి. ఇన్వెస్టర్లు నిర్ణయించిన కంపెనీ విలువనే ఈ ర్యాంకింగ్‌కు ప్రధాన ప్రమాణంగా తీసుకున్నారు. ఈ ర్యాంకింగ్ స్టాన్‌ఫోర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ యొక్క వెంచర్ క్యాపిటల్ ఇనిషియేటివ్ పరిశోధన ఆధారంగా, జనవరి 2026 వరకు ఉన్న డేటాతో రూపొందించబడింది.

జాబితాలో మొదటి మూడు స్థానాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థలు ఓపెన్ఏఐ, స్పేస్ఎక్స్, ఆంత్రోఫిక్ ఉన్నాయి. ఇది గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రెండ్స్‌లో టెక్నాలజీ, ఏఐ కంపెనీల పెరుగుతున్న ఆధిపత్యాన్ని సూచిస్తుంది.

ఈ రిపోర్ట్‌లో మొత్తం మూడు భారతీయ కంపెనీలు ఉన్నాయి. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా 24 బిలియన్ డాలర్ల విలువతో 27వ స్థానంలో ఉంది. టాటా ఈవీ మొబిలిటీ 9 బిలియన్ డాలర్ల విలువతో 93వ స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో 65 కంపెనీలతో అమెరికా అగ్రస్థానంలో ఉంది, కాగా చైనా నుంచి 21 కంపెనీలు ఉన్నాయి. భారత్, బ్రిటన్ నుంచి తలో మూడు కంపెనీలు చోటు సంపాదించాయి.

#

Tags : 1

Videos

ఎద్దులా పెరిగావ్ కానీ బుర్ర లేదు.. అచ్చన్నకు ఇచ్చిపడేసిన బొత్స

కాంగ్రెస్ కు గుడ్ బై BRSలోకి జీవన్ రెడ్డి..

నాసాలో చీకటి కోణం.. సంచలన విషయాలు బయటపెట్టిన NASA మాజీ శాస్త్రవేత్త

కంటతడి పెట్టిన బొత్స

మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులో భారీగా 'మావిగన్' ఫ్లెక్సీలు

మామను చంపిన నువ్వు తల్లి, చెల్లి గురించి మాట్లాడతావా.. నీ మొహానికి సిగ్గుందా..!

ఒప్పందం ఉల్లంఘిస్తే యుద్ధానికి రెడీగా ఉన్నాం

నీ తల్లిని తిట్టినా.. నీకు సిగ్గులేకపోవొచ్చు.... బాబు ఇంట్లో ఆడవాళ్లే నీకు... పేర్ని కిట్టు సంచలన కామెంట్స్

సంతకం ఫోర్జరీ, CMRFలో 8 లక్షలు కొట్టేసిన TDP నేత

వామ్మో ఏందయ్యా ఇది... Swiggy, Zomatoలో ఆర్డర్ పెట్టుకొని బిర్యానీ తింటున్నారా?

Photos

+5

గ్రాండ్‌గా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లగ్న పత్రిక వేడుక (ఫొటోలు)

+5

సెలబ్రిటీలతో ఐకాన్ స్టార్ బర్త్‌ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నయనతార, విఘ్నేష్ శివన్ (ఫొటోలు)

+5

గుర్తుకొస్తున్నాయి.. మహానేత పాదయాత్రకు 23 ఏళ్లు (చిత్రాలు)

+5

ఈ సినిమా ఎంతో స్పెషల్‌ అంటున్న కృతీ శెట్టి (ఫోటోలు)

+5

తెలంగాణలో ప్రసిద్ధి చెందిన ‘కామాఖ్య యోని పీఠం’ ఆలయం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

విజయవాడలో సందడి చేసిన సినీ నటి భాగ్యశ్రీ బోర్సే (ఫొటోలు)

+5

హైదరాబాద్ : “రా స్ట్రెంగ్త్ కాలిస్థెనిక్స్ ఛాంపియన్‌షిప్” (ఫొటోలు)

+5

చంద్రబాబు సర్కార్‌పై వైఎస్‌ జగన్‌ ఫైర్‌ (ఫోటోలు)

+5

డెకాయిట్‌ కోసం వచ్చేసిన వెంకీ మామ (ఫోటోలు)