Breaking News

పోస్టాఫీసు స్కీములు.. అత్యధిక వడ్డీలు

Published on Thu, 04/09/2026 - 15:40

సంపాదించే ప్రతి వ్యక్తి తన భవిష్యత్తు కోసమో, తన కుటుంబం భవిష్యత్తు కోసమో ఎంతో కొంత పొదుపు చేయాలనుకుంటారు. అయితే రిస్క్‌తో కూడిన స్టాక్‌ మార్కెట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌లు అందరూ చేయలేరు. అలాంటి వారి కోసం రిస్క్‌ లేకుండా మెరుగైన రాబడినిచ్చే అనేక పొదుపు పథకాలు పోస్టాఫీసుల్లో అందుబాటులో ఉన్నాయి. ఆయా స్కీములు ఏంటి.. వాటికి వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయి.. తెలుసుకుందాం..

2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికి (ఏప్రిల్-జూన్) సంబంధించి చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ తాజాగా ప్రకటించింది. వరుసగా ఎనిమిదో త్రైమాసికంలోనూ రేట్లలో ఎలాంటి మార్పు చేయకపోవడం గమనార్హం. సురక్షితమైన పెట్టుబడితో పాటు ఆకర్షణీయమైన రాబడులు ఇచ్చే ప్రధాన పథకాల వివరాలు ఇలా ఉన్నాయి..

సుకన్య సమృద్ధి యోజన: ఆడపిల్లల భవిష్యత్తు కోసం ఉద్దేశించిన ఈ పథకం ప్రస్తుతం అత్యధిక వడ్డీని అందిస్తోంది. దీర్ఘకాలిక అవసరాలకు ఇది ఉత్తమ ఎంపిక. దీనికి వడ్డీ రేటు 8.2 శాతంగా ఉంది.

సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్: వృద్ధులకు సామాజిక భద్రత కల్పిస్తూ, సుకన్య సమద్ధితో సమానంగా అత్యధిక 8.2% వడ్డీని అందిస్తోంది.

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF): పన్ను ప్రయోజనాలతో పాటు దీర్ఘకాలిక సంపద సృష్టికి ఇది అత్యంత ప్రజాదరణ పొందిన పథకం. దీనిపై ప్రస్తుతం 7.1% వడ్డీ లభిస్తోంది.

నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (NSC): ఐదేళ్ల కాలపరిమితి కలిగిన ఈ పథకం స్థిరమైన, సురక్షితమైన రాబడులకు గ్యారెంటీ ఇస్తుంది. దీనిపై అందిస్తున్న వడ్డీ 7.7 శాతం.

కిసాన్ వికాస్ పత్ర (KVP): తమ పెట్టుబడిని నిర్ణీత కాలంలో రెట్టింపు చేసుకోవాలనుకునే వారికి ఇది సరైన ఎంపిక. ప్రస్తుత రేటు ప్రకారం 115 నెలల్లో నగదు రెట్టింపు అవుతుంది. దీని వడ్డీ రేటు 7.5%.

మంత్లీ ఇన్‌కమ్‌మ్ స్కీమ్ (MIS): ఒకేసారి పెట్టుబడి పెట్టి, ప్రతి నెలా స్థిరమైన ఆదాయం పొందాలనుకునే వారికి ఈ పథకం అనువైనది. దీనికి 7.4% వడ్డీ లభిస్తుంది.

టైమ్ డిపాజిట్లు & రికరింగ్ డిపాజిట్లు
బ్యాంకు ఎఫ్‌డీలతో పోలిస్తే పోస్టాఫీసు టైమ్ డిపాజిట్లు గట్టి పోటీనిస్తున్నాయి. కాలపరిమితిని బట్టి వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి..

కాలపరిమితివడ్డీ రేటు (%)
ఏడాది టైమ్ డిపాజిట్6.9
రెండేళ్ల టైమ్ డిపాజిట్7.0
మూడేళ్ల టైమ్ డిపాజిట్7.1
ఐదేళ్ల టైమ్ డిపాజిట్7.5
5 ఏళ్ల రికరింగ్ డిపాజిట్ (RD)6.7

సాధారణ సేవింగ్స్ డిపాజిట్లపై యథావిధిగా 4 శాతం వడ్డీ కొనసాగుతోంది. మార్కెట్ ఒడిదుడుకులతో సంబంధం లేకుండా, ప్రభుత్వ హామీతో కూడిన ఈ పథకాలు సామాన్యులకు పెట్టుబడి సాధనాలుగా నిలుస్తున్నాయి.

Videos

ఎద్దులా పెరిగావ్ కానీ బుర్ర లేదు.. అచ్చన్నకు ఇచ్చిపడేసిన బొత్స

కాంగ్రెస్ కు గుడ్ బై BRSలోకి జీవన్ రెడ్డి..

నాసాలో చీకటి కోణం.. సంచలన విషయాలు బయటపెట్టిన NASA మాజీ శాస్త్రవేత్త

కంటతడి పెట్టిన బొత్స

మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులో భారీగా 'మావిగన్' ఫ్లెక్సీలు

మామను చంపిన నువ్వు తల్లి, చెల్లి గురించి మాట్లాడతావా.. నీ మొహానికి సిగ్గుందా..!

ఒప్పందం ఉల్లంఘిస్తే యుద్ధానికి రెడీగా ఉన్నాం

నీ తల్లిని తిట్టినా.. నీకు సిగ్గులేకపోవొచ్చు.... బాబు ఇంట్లో ఆడవాళ్లే నీకు... పేర్ని కిట్టు సంచలన కామెంట్స్

సంతకం ఫోర్జరీ, CMRFలో 8 లక్షలు కొట్టేసిన TDP నేత

వామ్మో ఏందయ్యా ఇది... Swiggy, Zomatoలో ఆర్డర్ పెట్టుకొని బిర్యానీ తింటున్నారా?

Photos

+5

గ్రాండ్‌గా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లగ్న పత్రిక వేడుక (ఫొటోలు)

+5

సెలబ్రిటీలతో ఐకాన్ స్టార్ బర్త్‌ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నయనతార, విఘ్నేష్ శివన్ (ఫొటోలు)

+5

గుర్తుకొస్తున్నాయి.. మహానేత పాదయాత్రకు 23 ఏళ్లు (చిత్రాలు)

+5

ఈ సినిమా ఎంతో స్పెషల్‌ అంటున్న కృతీ శెట్టి (ఫోటోలు)

+5

తెలంగాణలో ప్రసిద్ధి చెందిన ‘కామాఖ్య యోని పీఠం’ ఆలయం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

విజయవాడలో సందడి చేసిన సినీ నటి భాగ్యశ్రీ బోర్సే (ఫొటోలు)

+5

హైదరాబాద్ : “రా స్ట్రెంగ్త్ కాలిస్థెనిక్స్ ఛాంపియన్‌షిప్” (ఫొటోలు)

+5

చంద్రబాబు సర్కార్‌పై వైఎస్‌ జగన్‌ ఫైర్‌ (ఫోటోలు)

+5

డెకాయిట్‌ కోసం వచ్చేసిన వెంకీ మామ (ఫోటోలు)