Breaking News

మా నాన్న ప్రవర్తనతో విసిగిపోయాము!

Published on Thu, 04/09/2026 - 05:41

మా నాన్న గారిది మొదట్నుంచి వింత ధోరణే! ఇంటికి ఎవరైనా తెలిసినవారు, బంధువులు వస్తే అతిగా ప్రవర్తిస్తారు. ఫ్యాన్‌లు ఫుల్‌ స్పీడ్‌తో పెట్టడం, గట్టిగా మాట్లాడటం, వారితో తనకు పెద్ద పదవుల్లో ఉన్నవారంతా తెలుసునని, రోజూ వారితో ఫోన్‌లో మాట్లాడుతానని గొప్పలు చెబుతారు. ఎవరైనా అప్పు కావాలంటే తన అవసరాలు కూడా చూడకుండా, వారికి డబ్బులివ్వడం, ఏదైనా ఫంక్షన్‌కు వెళితే, మా తాహతుకు మించి ఖరీదైన గిఫ్ట్‌లు ఇవ్వడం కూడా మామూలే. 

మా నాన్న బలహీనత ఆసరాగా తీసుకుని, ఆయన చుట్టూ ఉన్నవారు ఆయన్ను ఎక్కువగా వాడుకుంటున్నారు. ఇంట్లో ఏదైనా ఫంక్షన్‌ జరిగితే, చాలా గ్రాండ్‌గా చేయాలని, అప్పైనా చేసి ఖర్చు పెడ్తారు. తనకు పెద్ద పెద్ద ఆఫీసర్లు, రాజకీయ నాయకులు తెల్సని, తాను తల్చుకుంటే ఏదైనా చేయగలనని, అందరికీ తెలిసేలా చెబుతుంటారు. ఆయన ప్రవర్తన వల్ల, మేము ఆర్థికంగా చితికిపోవడమే కాకుండా, ఒక్కోసారి నల్గురిలో తలెత్తుకోలేకపోతున్నాము. ఏం చేయాలో తెలియక మీ సలహా కోసం ఈ ఉత్తరం...
– రమా కుమారి, బోధన్‌

మీ బాధ అర్థం చేసుకున్నాను. మా ప్రాక్టీసులో ఇలాంటి మనస్తత్వమున్నవారిని తరచుగా చూస్తూనే ఉంటాము. ‘హైపోమేనిక్‌ పర్సనాలిటీ’ అనే ఒక ప్రత్యేక మనస్తత్వం కలవారు ఇలా ప్రవర్తిస్తారు. ఇది ఒక చిత్రమైన వ్యక్తిత్వ లక్షణం. మన చుట్టూ మీ నాన్న లాంటి వ్యక్తులు చాలా మందే ఉంటారు, ఇంటెన్సిటీలో తేడా అంతే! వీరు మొదట్నుంచీ అతిగా మాట్లాడ్డం, గొప్పలు చెప్పుకోవడం, ఎప్పుడూ ఓవర్‌ యాక్టివ్‌గా ఉండటం, ఎప్పుడూ ఏదో ఒక పనిచేస్తూనే ఉంటారు. వీరి గొప్పలు వింటూ ఉంటే, నిజమేమోనన్నంతగా నమ్మిస్తూ ఉంటారు. అయితే వీరికి నోటి దురదే తప్ప, వాస్తవానికి ఇతరులను మోసం చేయాలనే తలంపు సాధారణంగా ఉండదు.

 ఇతరులకంటే తాము గొప్ప అనిపించుకోవాలనే తపన వీరికి ఎక్కువ. ఇలాంటి వారు అతిగా ఊహించుకుని, రకరకాల వ్యాపారాలు మారుస్తూ, అనాలోచితంగా డబ్బులు పెట్టుబడి పెట్టి, ఆర్థికంగా కూడా నష్టపోతుంటారు. ఎప్పుడూ జోకులు వేస్తూ, అందరినీ నవ్విస్తూ ఉంటారు. ఏదైనా కష్టాలొచ్చినా, వారి మొహంలో బాధ, దిగులు కనిపించడం చాలా అరుదు. ఇలాంటి మనస్తత్వం సాధారణంగా జీన్స్‌ ద్వారా కొందరికి వారసత్వంగా సంక్రమిస్తుంది. మెదడులోని కొన్ని రసాయనాలు అధికంగా పనిచేయడం వల్ల కూడా కొందరిలా ప్రవర్తిస్తారు. తమ ప్రవర్తన వల్ల ఇంట్లో ఉన్నవారు ఇబ్బంది పడుతున్నారన్న స్పృహ వీరికి ఉండదు. విమర్శిస్తే తట్టుకోలేరు. ఇలాంటి వారు ఒక్కోసారి ‘బైపోలార్‌ డిసార్డర్‌’ అనే తీవ్రమైన మానసిక వ్యాధికి కూడా లోనయ్యే అవకాశముంది. మీ నాన్నగారి ప్రవర్తన మరీ శృతిమించి రాగాన పడేట్లయితే, ఒకసారి సైక్రియాట్రిస్టు సలహా తీసుకోండి. ‘మూడ్‌ స్టెబిలైజర్స్‌’ అనే కొన్ని మందుల ద్వారా వీరి ప్రవర్తనను చాలా వరకు మార్చే అవకాశముంది. ఆల్‌ ది బెస్ట్‌!

డా. ఇండ్ల విశాల్‌ రెడ్డి, 
సీనియర్‌ సైకియాట్రిస్ట్, విజయవాడ. 
మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్‌ ఐడీ: sakshifamily3@gmail.com

#

Tags : 1

Videos

సంతకం ఫోర్జరీ, CMRFలో 8 లక్షలు కొట్టేసిన TDP నేత

వామ్మో ఏందయ్యా ఇది... Swiggy, Zomatoలో ఆర్డర్ పెట్టుకొని బిర్యానీ తింటున్నారా?

మిల్లర్ పై అనుమానాలు..! IPL లో ఫిక్సింగ్ కలకలం..?

కేసీఆర్ పాలనే బెస్ట్...సీఎం రేవంత్ పై జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

పశ్చిమ బెంగాల్ లో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం

కాకాణిపై మరో అక్రమ కేసు

నయిమ్ ఖాసిమ్ ను చంపేశాం ఇజ్రాయెల్ కీలక ప్రకటన

నీది ఒక బతుకేనా... ABN రాధాకృష్ణకు కాకాణి మాస్ వార్నింగ్

బహిరంగ సభలో బిగ్ షాక్ అచ్చెన్నాయుడుకి నిరసన సెగ..

నేను చచ్చినా పర్వాలేదు.. సెల్ టవర్ ఎక్కిన యువకుడు

Photos

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నయనతార, విఘ్నేష్ శివన్ (ఫొటోలు)

+5

గుర్తుకొస్తున్నాయి.. మహానేత పాదయాత్రకు 23 ఏళ్లు (చిత్రాలు)

+5

ఈ సినిమా ఎంతో స్పెషల్‌ అంటున్న కృతీ శెట్టి (ఫోటోలు)

+5

తెలంగాణలో ప్రసిద్ధి చెందిన ‘కామాఖ్య యోని పీఠం’ ఆలయం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

విజయవాడలో సందడి చేసిన సినీ నటి భాగ్యశ్రీ బోర్సే (ఫొటోలు)

+5

హైదరాబాద్ : “రా స్ట్రెంగ్త్ కాలిస్థెనిక్స్ ఛాంపియన్‌షిప్” (ఫొటోలు)

+5

చంద్రబాబు సర్కార్‌పై వైఎస్‌ జగన్‌ ఫైర్‌ (ఫోటోలు)

+5

డెకాయిట్‌ కోసం వచ్చేసిన వెంకీ మామ (ఫోటోలు)

+5

అందమైన అల్లుడిని తెచ్చా..: రష్మిక మందన్నా (ఫోటోలు)

+5

హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌ ఎంగేజ్‌మెంట్‌ (ఫోటోలు)