Breaking News

38 ఏళ్ల నాటి రికార్డ్.. ఆకాశంలో తపాలా సేవలు

Published on Wed, 04/08/2026 - 16:32

ఇప్పుడంటే సాంకేతిక పరిజ్ఙానం అందుబాటులోకి రావడంతో కేవలం సింగిల్ క్లిక్ లో వాట్సాప్ మెసేజెస్ , ఫొటోస్, వీడియోస్ ఎక్కడ నుంచి ఎక్కడికైనా పంపే సదుపాయం అందుబాటులోకి వచ్చింది. అంతేకాదు వీడియో కాల్స్  ద్వారా ఒకరినొకరు చూస్తూ మాట్లాడుకునే అవకాశం ఉంది. దేశ, విదేశాలనుంచి కాకుండా పట్టణాల నుంచి గ్రామీణ ప్రాంతంలోని మారుమూల గ్రామాలకు సైతం టక్కుమని క్లిక్ చేస్తే ఈ-మెయిల్ వెళ్ళిపోతుంది, సెకన్లలో అవతలి వ్యక్తికి సందేశం చేరుతుంది. కానీ, ఒకప్పుడు మారుమూల దీవులకు ఉత్తరం చేరాలంటే రోజుల తరబడి నిరీక్షించాల్సి వచ్చేది. ఆ నిరీక్షణకు తెరదించుతూ, సరిగ్గా 38 ఏళ్ల క్రితం భారత తపాలా శాఖ ఆకాశ మార్గాన చేపట్టిన ఒక సాహసోపేత ప్రయోగం 'హెలికాప్టర్ పోస్టల్ సర్వీస్'. కమ్యూనికేషన్ రంగంలో సరికొత్త చరిత్ర లిఖించిన ఆ విశేషాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

హెలికాప్టర్ పోస్టల్ సేవలు.. 
భారతదేశపు మొట్టమొదటి హెలికాప్టర్ పోస్టల్ సేవలు 1988, జనవరి 27న అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. అగాధమైన సముద్రం, దట్టమైన అడవులతో కూడిన అండమాన్ నికోబార్ దీవులను ఈ చారిత్రక ఘట్టానికి వేదికగా ఎంచుకున్నారు. పోర్ట్ బ్లెయిర్ నుంచి హావ్‌లాక్ దీవుల మధ్య సాగిన ఈ మొదటి ప్రయాణం తపాలా వ్యవస్థలో ఒక మైలురాయి. ఈ వినూత్న ప్రయోగాన్ని విజయవంతం చేయడానికి భారత తపాలా శాఖ, పవన్ హాన్స్ లిమిటెడ్‌తో జతకట్టింది.

మెయిల్ బస్తాలను చేరవేయడానికి శక్తివంతమైన 'డౌఫిన్' హెలికాప్టర్లను రంగంలోకి దించారు. గతంలో పడవలు లేదా ఇతర మార్గాల ద్వారా ఉత్తరాలు చేరడానికి రెండు మూడు రోజులు పట్టే చోట, హెలికాప్టర్ పుణ్యమా అని గంటల వ్యవధిలోనే సందేశాలు చేరడం ప్రారంభమైంది. ఈ తొలి ప్రయాణాన్ని స్మరిస్తూ విడుదల చేసిన 'ఫస్ట్ డే కవర్లు', ప్రత్యేక స్టాంపులు నేటికీ తపాలా బిళ్ళల సేకరణకర్తలకు  నిధి లాంటివి.

ఆకాశ మార్గాన తపాలా సేవలు.. 
ఆకాశ మార్గాన తపాలా సేవలు అందించాలనే ఆలోచన ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఆసక్తిని రేకెత్తించింది. ప్రపంచంలోనే తొలి హెలికాప్టర్ మెయిల్ సర్వీస్ 1947, అక్టోబర్ 1న అమెరికాలో మొదలైంది. లాస్ ఏంజిల్స్ ఎయిర్‌వేస్ సహకారంతో 'సికోర్స్కీ ఎస్-51' హెలికాప్టర్ ద్వారా ఈ సేవలు అందించారు. అమెరికా బాటలోనే నడుస్తూ బ్రిటన్ కూడా 1948లో తన సొంత హెలికాప్టర్ పోస్టల్ సేవలను ప్రారంభించి ఐరోపాలో రికార్డు సృష్టించింది.

సాంకేతికత ఎంత పెరిగినా, ఆనాడు మారుమూల ప్రాంతాల ప్రజలను అనుసంధానించడానికి భారత తపాలా శాఖ చేసిన ఈ 'గగన విహారం' ఎప్పటికీ స్ఫూర్తిదాయకమే. మేఘాలను చీల్చుకుంటూ వచ్చిన ఆ ఉత్తరం వెనుక ఎన్నో కుటుంబాల అనురాగాలు, ఆప్యాయతలు ఉండేవి.. అలాంటివాటిని ఏమాత్రం చెక్కుచెదరకుండా వారికి అందించిన ఘనత భారత తపాలా శాఖకు దక్కుతుంది. 
-పసుపులేటి వెంకటేశ్వరరావు.

Videos

బిజినెస్ మ్యాన్ తో పెళ్లైంది... నలుగురు పిల్లలు ఉన్నారు

లులు మాల్ విషయంలో తప్పు చేశాం భయపడి వెనక్కి తగ్గిన ప్రభుత్వం

బుమ్రాకే చుక్కలు చూపించాడు -వాడి బ్యాటింగ్ కు పిచ్చోళ్లయిపోయాం...

భారతీయులు ఇరాన్ వదిలి వెళ్లిపోండి

ఎన్నికల సంఘం-TMC ఎంపిల సమావేశంలో రసాభాస

నా భార్యను పక్కన కూర్చోపెట్టుకుని చెప్తున్నా... ABN రాధాకృష్ణ పై విరుచుకుపడ్డ రాచమల్లు

వెనక్కి తగ్గిన ట్రంప్.. సీజ్ ఫైర్ వెనుక కారణమిదేనా?

చేసిందంతా వైఎస్సారే.. హంద్రీ-నీవాపై 'చంద్ర' నాటకం

విఫలమైన బుమ్రా అస్త్రం... వీడు మామూలు బుర్డోడు కాదు

అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందం డోనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన

Photos

+5

చంద్రబాబు సర్కార్‌పై వైఎస్‌ జగన్‌ ఫైర్‌ (ఫోటోలు)

+5

డెకాయిట్‌ కోసం వచ్చేసిన వెంకీ మామ (ఫోటోలు)

+5

అందమైన అల్లుడిని తెచ్చా..: రష్మిక మందన్నా (ఫోటోలు)

+5

హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌ ఎంగేజ్‌మెంట్‌ (ఫోటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. బన్నీ అరుదైన రికార్డులివే! (ఫోటోలు)

+5

ఒక్క సినిమాతోనే జైన్‌ మేరీ ఖాన్‌ వైరల్‌ (ఫోటోలు)

+5

abn ఆఫీస్‌ వద్ద టెన్షన్‌ .. టెన్షన్‌ (ఫోటోలు)

+5

ఫుడ్‌ సేఫ్టీపై అవగాహన.. హైదరాబాద్‌లో వాకథాన్‌ (ఫోటోలు)

+5

శోభితలో ఈ టాలెంట్‌ కూడా ఉందా! (ఫోటోలు)

+5

అప్పుడే ఏడేళ్లు.. ఎంత త్వరగా ఎదుగుతున్నావో!: లాస్య మంజునాథ్‌ (ఫోటోలు)