Breaking News

టెక్స్‌టైల్స్‌ పీఎల్‌ఐ పరిధిలోకి మరిన్ని విభాగాలు

Published on Wed, 04/08/2026 - 12:48

టెక్స్‌టైల్స్‌ రంగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం రూ.10,683 కోట్లతో ప్రకటించిన ఉత్పత్తి అనుసంధానిత పథకం (పీఎల్‌ఐ) పరిధిలోకి మ్యాన్‌ మేడ్‌ వ్రస్తాలు (ఎంఎంఎఫ్‌), ఫ్యాబ్రిక్స్, టెక్నికల్‌ టెక్స్‌టైల్స్‌నూ చేర్చనున్నట్టు కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ తెలిపారు. దీనివల్ల పరిశ్రమకు ప్రయోజనం కలుగుతుందని, వ్యాపార నిర్వహణ సులభతరం అవుతుందన్నారు. అలాగే తాజా పెట్టుబడులకు ప్రోత్సాహం లభిస్తుందని, టెక్స్‌టైల్స్‌రంగంలో వృద్ధి వేగం అందుకుంటుందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఉపాధి అవకాశాలను విస్తృతం చేయడం, అంతర్జాతీయ టెక్స్‌టైల్‌ మార్కెట్‌లో భారత్‌ స్థానాన్ని బలోపేతం చేయడం నరేంద్ర మోదీ ప్రభుత్వ ప్రాధాన్యంగా పేర్కొన్నారు. ఫుట్‌వేర్‌ పరిశ్రమల ప్రతినిధులు తనను కలసిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. ముడి సరకుల లభ్యత, నాణ్యత సమస్యలను పాదరక్షల పరిశ్రమల ఎదుర్కొంటున్నట్టు చెప్పారు. గత 12 ఏళ్లలో దేశంలో కొనుగోలు శక్తికి అనుగుణంగా పాదరక్షల వినియోగం పెరుగుతూ వస్తున్నట్టు చెప్పారు. యూఎస్‌లో ఒక్కో వ్యక్తి 7 జతల పాదరక్షలు వినియోగిస్తుంటే, చైనాలో 3.3 జతలుగా ఉందని.. భారత్‌లోనూ 3 జతలకు చేరినట్టు పేర్కొన్నారు.

ఇదీ చదవండి: మళ్లీ పసిడి ధరల మంట! తులం ఎంతంటే..

Videos

త్వరలో పాదయాత్ర.. వైఎస్ జగన్ క్లారిటీ

దమ్ము లేని దద్దమ్మ.. ఏబీఎన్ రాధాకృష్ణపై అంబటి ఫైర్

ఎక్కడ దాక్కున్నావ్.. బయటకు రా! రాధాకృష్ణకు పోతిన మహేష్ వార్నింగ్

జగన్ విధానం కాదనడానికి నువ్వెవడివి, బుడమేరు పొంగినప్పుడు హై కోర్ట్ 5 రోజులు సెలవు

ఇరాన్ కు కోలుకోలేని దెబ్బ! కోమా లో కొత్త సుప్రీం లీడర్...

అందుకే బన్నీ గ్రేట్ అంటున్న టాలీవుడ్

లక్షను 26 లక్షలు చేసింది.. ఐదేళ్లలో కాసుల పంట పండించిన స్టాక్..!

YSRCP నేతలతో వైఎస్ జగన్ @తాడేపల్లి

అంబటి VS పోలీస్ మాట్లాడకుండా ఇచ్చిపడేసాడు

భార్యకు, చెల్లికి తేడా తెలియని ABN.. RKకు వత్తాసు..

Photos

+5

అందమైన అల్లుడిని తెచ్చా..: రష్మిక మందన్నా (ఫోటోలు)

+5

హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌ ఎంగేజ్‌మెంట్‌ (ఫోటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. బన్నీ అరుదైన రికార్డులివే! (ఫోటోలు)

+5

ఒక్క సినిమాతోనే జైన్‌ మేరీ ఖాన్‌ వైరల్‌ (ఫోటోలు)

+5

abn ఆఫీస్‌ వద్ద టెన్షన్‌ .. టెన్షన్‌ (ఫోటోలు)

+5

ఫుడ్‌ సేఫ్టీపై అవగాహన.. హైదరాబాద్‌లో వాకథాన్‌ (ఫోటోలు)

+5

శోభితలో ఈ టాలెంట్‌ కూడా ఉందా! (ఫోటోలు)

+5

అప్పుడే ఏడేళ్లు.. ఎంత త్వరగా ఎదుగుతున్నావో!: లాస్య మంజునాథ్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా 'లవ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ' ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఉప్పల్‌ స్టేడియంలో సెలెబ్రిటీల సందడి (ఫోటోలు)