Breaking News

ఎలక్ట్రిక్‌ 2వీలర్స్‌ స్పీడ్‌

Published on Sat, 04/04/2026 - 04:16

ద్విచక్ర ఎలక్ట్రిక్‌ వాహన(ఈవీ) అమ్మకాలు గత ఆర్థిక సంవత్సరంలో ఒక్కసారిగా స్పీడందుకున్నాయి. ఇందుకు ద్విచక్ర వాహన దిగ్గజాలకుతోడు ఏథర్‌ ఎనర్జీ తదితర కంపెనీలు ఈవీ 2వీలర్స్‌ ఉత్పత్తిలోకి ప్రవేశించడం దోహదపడుతోంది. వెరసి రెండు రోజులు తక్కువగా 2025–26లో ద్విచక్ర ఈవీ అమ్మకాలు 17 శాతంపైగా జంప్‌ చేశాయి. 13.5 లక్షల యూనిట్లను అధిగమించాయి. 

ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాలకు కొద్ది రోజులుగా డిమాండ్‌ పెరుగుతోంది. ఇందుకు దేశీ ద్విచక్ర వాహన రంగ దిగ్గజాలు బజాజ్‌ ఆటో, టీవీఎస్, హీరో మోటోలకు తోడు ఏథర్‌ ఎనర్జీ, ఓలా ఎలక్ట్రిక్‌ తదితర కంపెనీలు జత కలవడం పరిశ్రమకు జోష్‌ నిస్తున్నట్లు ఆటో రంగ నిపుణులు పేర్కొన్నారు. పెరుగుతున్న డిమాండుకుతోడు పోటీ తీవ్రత నేపథ్యంలో 2వీలర్‌ కంపెనీలు సైతం మరిన్ని సౌకర్యాలు, సాంకేతికతలతో విభిన్న మోడళ్లను ప్రవేశపెట్టడం ద్వారా వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి.

 వెరసి గతేడాది  (2025 ఏప్రిల్‌ 1–2026 మార్చి 29) ద్విచక్ర ఈవీ కంపెనీలు ఉమ్మడిగా 13.5 లక్షల యూనిట్లను విక్రయించాయి. ఇది అంతక్రితం ఏడాది (2024–25)తో పోలిస్తే 17.3% వృద్ధికాగా.. 15 లక్షల యూనిట్ల విక్రయ మైలురాయిని అందుకునే వీలున్నట్లు ఆటో రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. గతేడాది 11 లక్షల యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి. 

రేసుకు సై.. 
ద్విచక్ర ఈవీలలో టీవీఎస్‌ మోటార్‌  3.3 లక్షల వాహన అమ్మకాలతో టాప్‌ చెయిర్‌ను అందుకుంది. తద్వారా 3 లక్షల వాహన అమ్మకాలను అధిగమించిన రెండో దిగ్గజంగా నిల్చింది. ఇప్పటికే ఈ రికార్డును సాధించిన ఓలా ఎలక్ట్రిక్‌  రేసులో వెనుకబడటం గమనార్హం! 

స్కూటర్ల నుంచి మోటార్‌ సైకిళ్ల దిగ్గజంగా ఆవిర్భవించిన బజాజ్‌ ఆటో.. ‘చేతక్‌’ బ్రాండుతో ఈవీ ద్విచక్ర వాహనాలను విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. తద్వారా రేసులో ముందుకొస్తోంది. ఈ ఏడాది ఇప్పటివరకూ రిటైల్‌గా 2.76 లక్షల వాహనాలను విక్రయించి రెండో ర్యాంకును అందుకుంది. ఇక పూర్తి ఈవీ కంపెనీ ఏథర్‌ ఎనర్జీ సైతం పటిష్ట మోడళ్లతో పోటీ పడుతోంది.

ఫుల్‌ ఛార్జింగ్‌..
ఐక్యూబ్‌ మోడల్‌ ద్వారా ఎలక్ట్రిక్‌ 2వీలర్‌ అమ్మకాలలో టాప్‌లో నిలిచిన టీవీఎస్‌ మోటార్‌ వార్షికంగా 39 శాతం పురోగతిని సాధించింది. తద్వారా 3 లక్షల వాహన విక్రయాల మార్క్‌ను అందుకుంది. ఇక హీరో మోటో.. ‘విడా’ బ్రాండ్‌ అమ్మకాలు ఏకంగా 184 శాతం జంప్‌చేశాయి. రిట్జా బ్రాండ్‌తో ఏథర్‌ ఎనర్జీ సైతం 75 శాతం వృద్ధిని అందుకుంది. మొత్తం ఈవీ 2వీలర్‌ అమ్మకాలలో ఐక్యూబ్, చేతక్, రిట్జా ఉమ్మడిగా దాదాపు 70 శాతం వాటా ఆక్రమిస్తున్నాయి. 

వీటితో హీరో మోటోను సైతం కలుపుకుంటే వినియోగదారులు పంపిణీ, సరఫరా నెట్‌వర్క్, సరీ్వసింగ్‌ సౌకర్యాలు, బ్రాండ్‌ తదితరాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు పరిశ్రమ నిపుణులు పేర్కొంటున్నారు. అయితే ప్రధాన కంపెనీలతో పోటీ, ఇతర సవాళ్ల కారణంగా మరోపక్క వోలా ఎలక్ట్రిక్‌ విక్రయాలు 53 శాతం పడిపోయాయి. గ్రీవ్స్‌ ఎలక్ట్రిక్‌ మొబిలిటీ(యాంపియర్‌), హోండా, రివర్‌ మొబిలిటీ, బిగౌస్‌ తదితర కంపెనీలు సైతం అమ్మకాలు వేగంగా పెంచుకుంటుండటం గమనార్హం. కాగా.. రేటింగ్స్‌ దిగ్గజం క్రిసిల్‌ అంచనాల ప్రకారం ఈవీ 2వీలర్‌ అమ్మకాల పరిమాణం కొత్త ఏడాది(2026–27)లోనూ 20 శాతంపైగా పుంజుకోనుంది. మొత్తం అమ్మకాలు 18 లక్షల యూనిట్లకు చేరుకునే అవకాశంఉంది.

– సాక్షి, బిజినెస్‌ డెస్క్‌

 

Videos

గజ్వేల్‌లో టెన్షన్ టెన్షన్ KCR క్యాంప్ కార్యాలయంపై దాడి

ప్రజల కోసం అసెంబ్లీ నక్సలైట్ అవుతా

నాగేంద్రను స్టేషన్ కు పిలిచి విచారించాలి

ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ నేలమట్టం! ఇరాన్ షాకింగ్ ప్రకటన

SHOCKING CCTV FOOTAGE: వామో ఏంటి ఇది కొట్టులో విక్స్ కొనడానికి వచ్చి...

వెంకన్న స్వామిపై భక్తి కంటే BR నాయుడుపై చంద్రబాబుకు ప్రేమ ఎక్కువ

రోడ్లు ఖాళీ ఎండ దెబ్బకు.. లాక్ డౌన్ పరిస్థితి

ఇంకెప్పుడు రాజీనామా! BR నాయుడుపై కట్టలు తెగిన ఆగ్రహం

ఇరాన్ సంచలన నిర్ణయం.. ఆ దేశాలకు ఇక చుక్కలే..

BR నాయుడు అంటే ఎందుకు అంత భయం చంద్రబాబు

Photos

+5

వైభవంగా ఒంటిమిట్ట శ్రీ కోదండరాముడి చక్రస్నానం (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆర్సీబీ కెప్టెన్‌ రజిత్ పాటిదార్, జితేష్ శర్మ (ఫోటోలు)

+5

బేబీ బంప్‌తో దర్శకుడు అట్లీ భార్య (ఫోటోలు)

+5

సింహాచలం : దర్శనానికి వచ్చి.. ఉంగరం దొంగిలిస్తారా..? (ఫొటోలు)

+5

‘బైకర్‌’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

నేపాల్ ట్రిప్‌లో యంగ్ సెన్సేషనల్ హీరోయిన్ (ఫొటోలు)

+5

డైరెక్టర్ పోస్టు.. స్పెషల్ ఎట్రాక్షన్‌గా హీరోయిన్ (ఫొటోలు)

+5

'ఇడియట్' రక్షిత బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

క్రీస్తు త్యాగం.. సమస్త మానవాళికీ స్ఫూర్తిదాయకం (ఫొటోలు)

+5

నల్లమల అడవి : తెలంగాణలో జరిగే ఈ సాహస యాత్ర గురించి తెలుసా? (ఫొటోలు)